త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp Chats Backup | వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ లైవ్ చాట్‌ల‌కే కాదు, బ్యాక‌ప్ చాట్‌ల‌కు కూడా.. ఎలా ఆన్ చేయాలంటే..?

Whatsapp Chats Backup | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న ప్లాట్‌ఫామ్‌పై ఎప్ప‌టి నుంచో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మెసేజ్‌ల‌ను పంపించేవారు, స్వీక‌రించే వారు త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ ఆ మెసేజ్‌ల‌ను యాక్సెస్ చేయ‌లేరు. ర‌హ‌స్య‌మైన 64 బిట్ ఎన్‌క్రిప్ష‌న్ కీ ద్వారా ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది.

S

Technology | Published On Apr 20, 2026, 11.37 am IST

Whatsapp Chats Backup | వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ లైవ్ చాట్‌ల‌కే కాదు, బ్యాక‌ప్ చాట్‌ల‌కు కూడా.. ఎలా ఆన్ చేయాలంటే..?
Advertisement

Whatsapp Chats Backup | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న ప్లాట్‌ఫామ్‌పై ఎప్ప‌టి నుంచో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మెసేజ్‌ల‌ను పంపించేవారు, స్వీక‌రించే వారు త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ ఆ మెసేజ్‌ల‌ను యాక్సెస్ చేయ‌లేరు. ర‌హ‌స్య‌మైన 64 బిట్ ఎన్‌క్రిప్ష‌న్ కీ ద్వారా ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. యూజ‌ర్ మెసేజ్ పంప‌గానే ఈ కీ ఆ మెసేజ్‌ను గ‌జిబిజిగా మార్చి అవ‌త‌లి యూజ‌ర్‌కు పంపుతుంది. అవ‌తలి యూజ‌ర్ ఆ మెసేజ్‌ను స్వీక‌రించ‌గానే ఆ కీ మ‌ళ్లీ ఆ మెసేజ్‌ను డీకోడ్ చేస్తుంది. దీంతో స్వీక‌ర్త మెసేజ్‌ను చ‌ద‌వ‌గ‌లుగుతారు. ఇలా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల యూజ‌ర్లు పంపుకునే సందేశాలు వాట్సాప్ కూడా చూడ‌లేదు. అయితే కేవ‌లం లైవ్ చాట్స్‌కు మాత్ర‌మే కాకుండా బ్యాకప్ తీసుకునే చాట్‌ల‌కు కూడా వాట్సాప్ ఈ ఎన్‌క్రిప్ష‌న్ స‌దుపాయాన్ని అందిస్తోంది. కానీ చాలా మందికి దీని గురించి తెలియ‌దు. కొన్ని స్టెప్స్‌ను పాటిస్తే వాట్సాప్ చాట్‌ల‌ను బ్యాక‌ప్ తీసుకునే స‌మ‌యంలో వాటికి ఈ ఎన్‌క్రిప్ష‌న్‌ను యాడ్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆ చాట్‌ల‌ను త‌రువాత ఎక్క‌డ సేవ్ చేసినా కూడా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి క‌నుక ఇత‌రులు వాటిని యాక్సెస్ చేయ‌లేరు. డేటాకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. వాట్సాప్‌లో చాట్‌ల‌ను బ్యాక‌ప్ తీసుకునే స‌మ‌యంలో ఎన్‌క్రిప్ష‌న్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవాలంటే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల‌పై ఈ స్టెప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై..

ఆండ్రాయిడ్ డివైస్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్‌లోని చాట్స్ విభాగంలోకి వెళ్లాలి. చాట్ బ్యాక‌ప్ అనే సెక్ష‌న్‌లో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాక‌ప్ బ‌ట‌న్‌పై ట‌చ్ చేయాలి. త‌రువాత ట‌ర్న్ ఆన్ మీద ట‌చ్ చేస్తే క్రియేట్ ఎ పాస్ కీ అని ద‌ర్శ‌న‌మిస్తుంది. తెర‌మీద క‌నిపించే సూచ‌న‌ల‌ను పాటించాలి. దీంతో ఈ ఫీచ‌ర్ యాక్టివేట్ అవుతుంది. ఆ త‌రువాత వాట్సాప్‌లో బ్యాక‌ప్ తీసుకునే చాట్‌లు అన్నీ ఆటోమేటిగ్గా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అయితే ఇదే ఫీచ‌ర్‌లో మోర్ ఆప్ష‌న్స్ అనే సెట్టింగ్‌పై ట‌చ్ చేసి 64 బిట్ ఎన్‌క్రిప్ష‌న్ కీతోనూ బ్యాక‌ప్ జ‌రిగేలా సెట్టింగ్‌ను మార్చుకోవ‌చ్చు.

ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై..

ఐఓఎస్ డివైస్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేశాక అందులో ప్రొఫైల్ పేజ్‌లోకి వెళ్లాలి. త‌రువాత వాట్సాప్ సెట్టింగ్స్ కింద ఉండే చాట్స్ విభాగంలోని చాట్ బ్యాక‌ప్‌పై ట‌చ్ చేయాలి. త‌రువాత బ్యాకప్ నౌ అనే బ‌ట‌న్‌పై ప్రెస్ చేసి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాక‌ప్‌పై ట‌చ్ చేయాలి. బ్యాక‌ప్ బ‌ట‌న్‌ను టర్న్ ఆన్ చేయాలి. తెర‌మీద క‌నిపించే సూచ‌న‌ల‌ను అనుస‌రిస్తూ పాస్ కీని క్రియేట్ చేయాలి. దీంతో ఈ ఫీచ‌ర్ యాక్టివేట్ అవుతుంది. త‌రువాత బ్యాక‌ప్ తీసే చాట్‌లు అన్నీ ఆటోమేటిగ్గా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. దీంతో అవి బ్యాక‌ప్ రూపంలోనూ సుర‌క్షితంగా ఉంటాయి. ఇలా ఈ ఫీచ‌ర్ ఆయా ప్లాట్‌ఫామ్‌ల‌పై ప‌నిచేస్తుంది.

Advertisement
Advertisement