HMD | రూ.10 వేలలోపు 5జీ ఫోన్.. హాట్ కేక్‌లా అమ్మకాలు.. గంటలోనే సేల్ అవుట్..
HMD | భారత మార్కెట్లో తాజాగా లాంచ్ అయిన హెచ్ఎండీ వైబ్2 5జీ స్మార్ట్‌ఫోన్‌కు భారీ స్పందన లభించింది. మే 26న ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్ ప్రారంభమైన గంటలోపే ఈ ఫోన్ పూర్తిగా సేల్ అవుట్ అయిందని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా రూ.10 వేల లోపు సెగ్మెంట్‌లో ఇండస్ బై సర్వమ్ ఏఐ ఫీచర్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Technology | Published On May 27, 2026, 2.17 pm IST
HMD | భారత మార్కెట్లో తాజాగా లాంచ్ అయిన హెచ్ఎండీ వైబ్2 5జీ స్మార్ట్‌ఫోన్‌కు భారీ స్పందన లభించింది. మే 26న ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్ ప్రారంభమైన గంటలోపే ఈ ఫోన్ పూర్తిగా సేల్ అవుట్ అయిందని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా రూ.10 వేల లోపు సెగ్మెంట్‌లో ఇండస్ బై సర్వమ్ ఏఐ ఫీచర్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రారంభ ఆఫర్ ధరగా రూ.9,499కు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ డివైస్‌కు మెట్రో నగరాలే కాకుండా చిన్న పట్టణాలు, నాన్-మెట్రో ప్రాంతాల నుంచి కూడా మంచి డిమాండ్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. బడ్జెట్ ధరలో ఏఐ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, విలువైన స్పెసిఫికేషన్లతో వినియోగదారులను టార్గెట్ చేసినట్లు హెచ్‌ఎండీ పేర్కొంది.
ఏఐ పనుల కోసం ప్రత్యేకంగా..
ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌లో ప్రధానంగా లోకలైజ్డ్ ఏఐ సామర్థ్యాలపైనే దృష్టి పెట్టింది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఇండస్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఈ ఫోన్ అభివృద్ధి, మార్కెట్ విడుదలలో పలు భాగస్వామ్య సంస్థలు కీలక పాత్ర పోషించాయి. సర్వం ఏఐ (ఇండస్) ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానిక భాషలు, భారతీయ వినియోగానికి సరిపోయే ఏఐ అనుభవాన్ని అందించింది. సంచార్ సాథీ ద్వారా డిజిటల్ సేఫ్టీ, మొబైల్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లతో అనుసంధానం చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ కు తొలి ఎక్స్‌క్లూజివ్ ఆన్‌లైన్ సేల్స్ భాగస్వామిగా వ్యవహరించింది.
సేల్ అవుట్ అనంతరం స్పందించిన హెచ్‌ఎండీ, వినియోగదారుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపింది. తదుపరి స్టాక్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, ఫ్లిప్‌కార్ట్‌లో తదుపరి సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
తాజావార్తలు
- ●Google Playstore | ప్లే స్టోర్‌లో యాప్ మాయం అయితే వెంటనే అలర్ట్.. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్..
- ●Mira Road Goat Controversy | బక్రీద్ ఉద్రిక్తతలు: అపార్ట్మెంట్లోకి మేకలు.. నిరసనగా పందిపిల్లతో ఎంట్రీ.. పోలీసుల హైడ్రామా!
- ●Harish Rao | ఇదేనా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అంటే సీఎం గారూ..? : హరీశ్‌రావు
- ●Pune Porsche Case | పుణె పోర్షే కేసు: కరెన్సీ నోట్ల దండలతో తండ్రి చిందులు.. మండిపడుతున్న నెటిజన్లు
- ●Thummala Nageswara Rao | మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల : మంత్రి తుమ్మల
- ●Air India | సాంకేతిక సమస్య.. 8 గంటలుగా గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం..!

Google Playstore | ప్లే స్టోర్‌లో యాప్ మాయం అయితే వెంటనే అలర్ట్.. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్..

Mira Road Goat Controversy | బక్రీద్ ఉద్రిక్తతలు: అపార్ట్మెంట్లోకి మేకలు.. నిరసనగా పందిపిల్లతో ఎంట్రీ.. పోలీసుల హైడ్రామా!

Harish Rao | ఇదేనా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అంటే సీఎం గారూ..? : హరీశ్‌రావు

Pune Porsche Case | పుణె పోర్షే కేసు: కరెన్సీ నోట్ల దండలతో తండ్రి చిందులు.. మండిపడుతున్న నెటిజన్లు



