త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices | బంగారం ధ‌ర‌లు ఢ‌మాల్‌.. అంచ‌నాల‌కు మించి అమెరికా వృద్ధి..

Gold Prices | అమెరికా ఆర్థిక వృద్ధి అంచనాలను మించడం, ద్రవ్యోల్బణం కొనసాగుతుండడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుంద‌న్న వార్త‌లు బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెంచాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల‌లో ఈ లోహాల ధరలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

S

Business | Published On Oct 30, 2026, 8.08 pm IST

Gold Prices | బంగారం ధ‌ర‌లు ఢ‌మాల్‌.. అంచ‌నాల‌కు మించి అమెరికా వృద్ధి..
Advertisement

Gold Prices | అమెరికా ఆర్థిక వృద్ధి అంచనాలను మించడం, ద్రవ్యోల్బణం కొనసాగుతుండడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచుతుంద‌న్న వార్త‌లు బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెంచాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల‌లో ఈ లోహాల ధరలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

ఒక్క సెష‌న్‌లోనే 42 డాల‌ర్లు త‌గ్గిన ప‌సిడి..

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 42 డాలర్లు (1.03 శాతం) తగ్గి 4,024.60 డాలర్ల వద్ద ట్రేడయింది. అమెరికా మూడో త్రైమాసిక జీడీపీ వృద్ధి 3.4 శాతంగా నమోదైంది. ఇది మార్కెట్ అంచనా 3.2 శాతం కంటే ఎక్కువ. అదే సమయంలో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 3.6 శాతానికి పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుంద‌న్న అంచనాలు బలపడడంతో పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి తగ్గించారు. వడ్డీ ఆదాయం అందించని బంగారంపై ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

భారీగా క్షీణించిన వెండి ధ‌రలు..

వెండి ధరలు కూడా మరింత భారీగా పడిపోయాయి. ఔన్సు వెండి ధర 1.672 డాలర్లు (3.10 శాతం) తగ్గి 52.180 డాలర్లకు చేరింది. పారిశ్రామిక అవసరాల నుంచి డిమాండ్ తగ్గుతుంద‌న్న ఆందోళనలు, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ తయారీ రంగంపై ఇంధన ధరల ప్రభావం వెండిపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు తిరిగి ప్రారంభం కావడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుతాయ‌న్న అంచనాలు కూడా బంగారం, వెండికి ఉన్న డిమాండ్‌ను తగ్గించాయి. కాగా దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు ఇవాళ ఒక్క రోజే సుమారు 4వేల పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మై 1,38,500 వ‌ద్ద కొన‌సాగింది. మ‌రోవైపు సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 9వేల పాయింట్ల‌కు పైగా క్షీణించి 1,80,400 వద్ద ట్రేడ‌యింది.

ట్యాగ్స్:

Gold MarketGold PricesGold RateSilver MarketSilver PricesSilver RateUS Federal Reserve
Advertisement
Advertisement