Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
Manisha Bhanwala | భారత మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం జరిగిన మహిళల 59 కేజీల విభాగం ఫైనల్లో అమెరికా రెజ్లర్ అబిగైల్ నెట్‌ను 8-6తో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
Manisha Bhanwala | భారత మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం జరిగిన మహిళల 59 కేజీల విభాగం ఫైనల్లో అమెరికా రెజ్లర్ అబిగైల్ నెట్‌ను 8-6తో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఒక దశలో 0-6తో వెనుకబడిన మనీషా.. అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిని చిత్తు చేయడం విశేషం.
సుశీల్ కుమార్ సరసన మనీషా
ఈ విజయంతో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచింది. గతంలో పురుషుల 66 కేజీల విభాగంలో సుశీల్ కుమార్ 2010లో ప్రపంచ టైటిల్ సాధించాడు. తాజాగా మహిళల విభాగంలో మనీషా ఈ ఘనత సాధించి భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఈసారి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటారు. ఒకే ఎడిషన్‌లో తొలిసారి ముగ్గురు భారత మహిళలు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. మనీషా స్వర్ణం సాధించగా.. నీలం సిరోహి (50 కేజీలు), కాజల్ ధోచక్ (76 కేజీలు) ఫైనల్లో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. తనుము శర్మ కాంస్య పతకంతో భారత్ ఖాతాలో మరో పతకం చేర్చింది.
సెమీస్‌లోనూ అదరగొట్టి..
ఫైనల్‌కు ముందు జరిగిన సెమీఫైనల్లో కజకిస్తాన్‌కు చెందిన ఆల్టిన్ షగయేవాను ఓడించి మనీషా టైటిల్ పోరుకు చేరుకుంది. అయితే ఫైనల్లో ఆరంభంలో ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శించినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడింది. 0-6తో వెనుకబడిన స్థితి నుంచి వరుస పాయింట్లు సాధిస్తూ 8-6తో విజయం అందుకుంది. మనీషా చారిత్రక విజయం భారత మహిళా రెజ్లింగ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి
- ●Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు
- ●Rafale | ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండైన రాఫెల్
- ●Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- ●IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి
- ●Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం

Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి

Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు

Rafale | ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండైన రాఫెల్

Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే




