త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nokia 2360 Flip | ఒకప్పటి క్రేజీ నోకియా ఫ్లిప్ ఫోన్.. మ‌ళ్లీ లాంచ్ అయింది..

Nokia 2360 Flip | హెచ్‌ఎండీ సంస్థ నోకియా 2360 ఫ్లిప్ పేరుతో కొత్త 2జి ఫీచర్ ఫోన్‌ను ప్రకటించింది. కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్‌ను నియంత్రించే ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎస్ఓఎస్ బటన్ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. హెచ్‌ఎండీ సంస్థ నోకియా 2360 ఫ్లిప్‌ను ప్రధానంగా వృద్ధులు, పిల్లలు, సులభమైన మొబైల్ కమ్యూనికేషన్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది.

S

Technology | Published On Oct 30, 2026, 5.28 pm IST

Nokia 2360 Flip | ఒకప్పటి క్రేజీ నోకియా ఫ్లిప్ ఫోన్.. మ‌ళ్లీ లాంచ్ అయింది..
Advertisement

Nokia 2360 Flip | హెచ్‌ఎండీ సంస్థ నోకియా 2360 ఫ్లిప్ పేరుతో కొత్త 2జి ఫీచర్ ఫోన్‌ను ప్రకటించింది. కుటుంబ సభ్యులు దూరం నుంచే ఫోన్ సెట్టింగ్స్‌ను నియంత్రించే ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎస్ఓఎస్ బటన్ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. హెచ్‌ఎండీ సంస్థ నోకియా 2360 ఫ్లిప్‌ను ప్రధానంగా వృద్ధులు, పిల్లలు, సులభమైన మొబైల్ కమ్యూనికేషన్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. సంప్రదాయ క్లామ్‌షెల్ డిజైన్‌తోపాటు రిమోట్ అసిస్టెన్స్ సాఫ్ట్‌వేర్, ప్రత్యేక ఎమర్జెన్సీ బటన్‌ను ఇందులో అందించింది. ఈ ఫోన్‌లోని ఫ్యామిలీ అసిస్ట్ ఫీచర్ ద్వారా అనుమతి పొందిన కుటుంబ సభ్యులు దూరం నుంచే కొన్ని సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఫోన్ వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడం, కొత్త కాంటాక్ట్స్‌ను జోడించడం, రోజువారీ రిమైండర్లను షెడ్యూల్ చేయడం వంటి పనులను ఫోన్‌ను నేరుగా చేతిలోకి తీసుకోకుండానే నిర్వహించవచ్చు.

ఫీచ‌ర్లు ఇవే..

భద్రత కోసం ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక ఎస్ఓఎస్ బటన్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ఈ బటన్‌ను నొక్కితే ముందుగా నిర్ణయించిన ప్రధాన కాంటాక్ట్‌కు ఆటోమేటిక్‌గా ఫోన్ కాల్ వెళ్తుంది. అదే సమయంలో ముందుగా ఎంపిక చేసుకున్న ఐదుగురు వ్యక్తులకు అత్యవసర టెక్స్ట్ అలర్ట్స్ కూడా పంపిస్తుంది. ఫోన్‌లో 2.8 ఇంచుల క్యూవీజీఏ ప్రధాన డిస్‌ప్లే, 1.77 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే ఉన్నాయి. నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తోపాటు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 900/1800 మెగాహెడ్జ్ డ్యుయల్ బ్యాండ్ కనెక్టివిటీ, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందించారు. 1,450 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 15 రోజుల స్టాండ్‌బై టైమ్, 27.5 గంటల టాక్‌టైమ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ బరువు 121 గ్రాములు. చార్‌కోల్, టీల్, బర్గండీ రెడ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. అయితే దీని అధికారిక ధర, వివిధ దేశాల్లో విడుదల తేదీలను హెచ్‌ఎండీ ఇంకా ప్రకటించలేదు.

ట్యాగ్స్:

2G PhoneFamily AssistFeature PhoneHMDNokia 2360 FlipNokia Flip PhoneSOS Button
Advertisement
Advertisement