HMD India | స్మార్ట్‌ఫోన్ లేకున్నా యూపీఐ పేమెంట్స్.. హెచ్‌ఎండీ కొత్త సదుపాయం..
HMD India | భారత్‌లో హెచ్‌ఎండీ ఇండియా కీలక ప్రకటన చేసింది. హెచ్‌ఎండీ, నోకియా ఫీచర్ ఫోన్లలో ఫోన్‌పే యూపీఐ 123పే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లను ఉపయోగించే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేసుకునే అవకాశం లభించింది.
Technology | Published On Sep 1, 2026, 1.33 pm IST
HMD India | భారత్‌లో హెచ్‌ఎండీ ఇండియా కీలక ప్రకటన చేసింది. హెచ్‌ఎండీ, నోకియా ఫీచర్ ఫోన్లలో ఫోన్‌పే యూపీఐ 123పే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లను ఉపయోగించే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేసుకునే అవకాశం లభించింది. ఈ సదుపాయం ఉన్న ఫోన్లలో మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం చేయవచ్చు. కెమెరా ఉన్న మోడళ్లలో క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి చెల్లింపులు కూడా చేయవచ్చు. అలాగే బ్యాంకు ఖాతాలోని నగదు నిల్వను తెలుసుకోవడం, గత లావాదేవీల వివరాలను చూడటం, మొబైల్ రీచార్జ్ చేసుకోవడం వంటి సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
ఏయే ఫీచర్ ఫోన్లలో ఉంది..
ఈ అనుసంధానం ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులు యూపీఐ సేవలను పొందేందుకు ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌కు మారాల్సిన అవసరం ఉండదు. కాల్స్, సందేశాలకే పరిమితమైన ఫీచర్ ఫోన్లను రోజువారీ అవసరాలకు ఉపయోగపడే డిజిటల్ సేవలకు కూడా అనుసంధానించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు హెచ్‌ఎండీ తెలిపింది. ప్రస్తుతం హెచ్‌ఎండీ 105 2జి, హెచ్‌ఎండీ 110 2జి, నోకియా 105 క్లాసిక్, నోకియా 105 సింగిల్ సిమ్, నోకియా 105 డ్యుయల్ సిమ్, నోకియా 106, నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్లలో ఫోన్‌పే యాప్ అందుబాటులో ఉంది. మరిన్ని ఫీచర్ ఫోన్ మోడళ్లకు ఫోన్‌పే యూపీఐ 123పే సేవలను తీసుకురావడానికి హెచ్‌ఎండీ, ఫోన్‌పే సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.
సరళంగా చెల్లింపులు చేసేందుకే..
ఈ సందర్భంగా హెచ్‌ఎండీ ఇండియా, ఏపీఏసీ సీఈఓ, వైస్ ప్రెసిడెంట్ రవి కున్వర్ మాట్లాడుతూ.. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజువారీ జీవితంలో భాగమయ్యాయని అన్నారు. వినియోగదారులు ఎలాంటి ఫోన్ ఉపయోగిస్తున్నప్పటికీ సౌకర్యవంతమైన సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఫీచర్ ఫోన్లు సరళంగా, నమ్మకంగా ఉండటంతో కోట్లాది మంది వాటినే ఎంచుకుంటున్నారని, అలాంటి వారు ఇప్పటికే ఉపయోగిస్తున్న ఫోన్లలోనే ఫోన్‌పే ద్వారా ముఖ్యమైన రోజువారీ సేవను అందిస్తున్నామని చెప్పారు. సాంకేతికత ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలన్న హెచ్‌ఎండీ ఆలోచనకు ఈ భాగస్వామ్యం మరో అడుగు అని వివరించారు. ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ మాట్లాడుతూ గత దశాబ్దంలో యూపీఐ భారత్‌లో చెల్లింపుల విధానాన్ని పూర్తిగా మార్చివేసిందన్నారు. స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే పరిమితమైన డిజిటల్ చెల్లింపులను ఫీచర్ ఫోన్లకు విస్తరించడం ద్వారా దేశంలోని మరింత మంది ప్రజలకు యూపీఐ ప్రయోజనాలను చేరువ చేయగలమని తెలిపారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






