Daanam Nagendar | ఇగ నేన్ గూడా దాడి చేస్తా.. అట్లయితెనే అధికారులు మాట ఇంటరేమో
Daanam Nagendar | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా నిర్వహణ విషయంలో హౌసింగ్ బోర్డు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ ఎమ్మెల్యేల లాగా దాడి చేస్తేనే అధికారులు మాట వింటారేమోనని.. అట్లయితే దౌర్జన్యం చేయడానికి రెడీగా ఉన్నానన్నారు.
సంక్షిప్త సారాంశం
లబ్ధిదారుల లిస్టులో నా నియోజకవర్గం వాళ్లు కాకుండా అంతా బయటోళ్లే కనిపిస్తున్నరు. మూసాపేట్ నుంచి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అంబర్‌పేట, నాంపల్లి నుంచి తీసుకొచ్చి పేర్లు ఇక్కడ వేశారు. అసలు అధికారులకు బాధ్యత లేదా?
- అప్పట్ల ఒకర్ని కొట్టి జైలుకు కూడా పోయొచ్చిన
- మంచి బత్కు బత్కి మళ్ల జైలెందుకని మంచిగున్న
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Daanam Nagendar | త్రినేత్ర.న్యూస్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా నిర్వహణ విషయంలో హౌసింగ్ బోర్డు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ ఎమ్మెల్యేల లాగా దాడి చేస్తేనే అధికారులు మాట వింటారేమోనని.. అట్లయితే దౌర్జన్యం చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. దాడి చేయడం తనకు పాత అలవాటేనన్నారు. గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయొచ్చానని గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులపై గరమయ్యారు.
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రా నిర్వహణలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండానే డ్రా ప్రారంభించారని దానం మండిపడ్డారు. తన నియోజకవర్గానికి రావాల్సిన 480 ఇండ్లకు గాను కేవలం 120 ఇండ్లే కేటాయించారని ఆయన ఆరోపించారు. హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని విమర్శించారు.
అంతా బయటోళ్లే ఉన్నరు..
లబ్ధిదారుల లిస్టులో నా నియోజకవర్గం వాళ్లు కాకుండా అంతా బయటోళ్లే కనిపిస్తున్నరు. మూసాపేట్ నుంచి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అంబర్‌పేట, నాంపల్లి నుంచి తీసుకొచ్చి పేర్లు ఇక్కడ వేశారు. అసలు అధికారులకు బాధ్యత లేదా? 360 డిగ్రీస్‌లో మీరు ఎక్కడ స్క్రూటిని చేశారు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి వాళ్ల మీద చర్య తీసుకోవాలని నేన్ డిమాండ్ చేస్తున్నా.
మళ్లెందుకని మంచిగున్న..
మీకు మంత్రిగారంటే పట్టి లేదు.. ఎమ్మెల్యేగారంటే పట్టిలేదు. ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలు పోయి ఒక ఆఫీసర్‌ను అడ్డగోలుగా తిట్టారు నా ముందే. నేన్ అడిగిన ఆ ఎమ్మెల్యేను.. ఏందిబై మీరు ఇట్లా ప్రవర్తిస్తే ఎట్లా అంటే ఐసా నై సుతర్‌తే అన్న ఏ లోగా అని అంటురాళ్లు. ఇగ మేం గూడా అదే పద్ధతి అవలంబించుమంటే అవలంబిస్తం. మాకు అలవాటే అది. ఇంతకుముందు చేసినుంటి గూడా. ఒక ఆఫీసర్‌ను కొట్టి అప్పుడు 15 రోజులు జైలుకు కూడా పోయిన. ఇప్పుడు ఇంత బతుకు బత్కి మళ్లెందుకు జైలుకని మంచిగున్న నేన్.. అని దానం వ్యాఖ్యానించారు.
పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ
ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్
ప్రభుత్వ అధికారులను కొట్టడం నాకు అలవాటే
గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయా
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది
లబ్ధిదారుల… https://t.co/7J9DB4sFJR pic.twitter.com/nTslA2fIcc
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
సెప్టెంబర్ 1, 2026

OPS vs CPS | సెప్టెంబర్ 1 విద్రోహ దినం.. ఓపీఎస్ అమలయ్యేనా..?
సెప్టెంబర్ 1, 2026

EHS | నిమ్స్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కౌంటర్స్ ఎత్తేసిన సర్కార్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. ప్రయాణికుల్లో టెన్షన్
- ●Talasani Srinivas Yadav | ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●PM Modi | ప్రధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్.. జువెలరీ స్టాక్స్ భారీగా పతనం..
- ●Tollywood | డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదిరిన వివాదం - కొత్త కార్యవర్గం చెల్లదంటూ జానీ మాస్టర్ భార్య కామెంట్లు
- ●Commercial LPG prices hiked | వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు.. సీఎన్జీ, జెట్ ఇంధన ధరలూ పెంపు
- ●Mamitha Baiju | ఓటీటీలోకి సూర్య, మమితా బైజు సూపర్ హిట్ మూవీ - పెళ్లి కాకుండానే హీరోయిన్ తల్లిగా మారితే?

IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. ప్రయాణికుల్లో టెన్షన్

Talasani Srinivas Yadav | ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

PM Modi | ప్రధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్.. జువెలరీ స్టాక్స్ భారీగా పతనం..

Tollywood | డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదిరిన వివాదం - కొత్త కార్యవర్గం చెల్లదంటూ జానీ మాస్టర్ భార్య కామెంట్లు



