Talasani Srinivas Yadav | ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థులు వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం సకాలంలో పీజు రీయింబర్స్‌మెంట్‌లు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చదువు పూర్తయినా ఫీజు చెల్లించలేదని విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్‌లను ఇవ్వడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజూ ఇలాంటి పరిస్థితులు రానీయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు.
ఢిల్లీలో ఏం జరిగిందో చూశాం. విద్యార్థులు తలచుకుంటే ఏదైనా చేయగలరు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో పీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తాం. రాష్ట్రంలోని విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బకాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసే వరకు ప్రభుత్వంపై పోరాడతాం అని తలసాని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు






