Tollywood | డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదిరిన వివాదం – జానీ మాస్టర్ భార్యకు పోటీగా కొత్త కార్యవర్గం – సుమలత రియాక్షన్
రఘు మాస్టర్ ఆధ్వర్యంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చట్టబద్దమైన గుర్తింపు లేదని జానీ మాస్టర్ భార్య సుమలత అన్నారు. తమకు ఎలాంటి అధికారిక నోటీసు ఇవ్వకుండా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం సమంజసం కాదని అగ్రహం వ్యక్తం చేశారు.
Entertainment | Published On Sep 1, 2026, 12.41 pm IST
Tollywood | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో నెలకొన్న అంతర్గత విభేదాల పై అధ్యక్షురాలు సుమలత స్పందించారు. సుమలతకు పోటీగా రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని కొందరు డ్యానర్లు ఇటీవల ప్రకటించారు. ఆ కార్యవర్గానికి చట్టబద్దమైన గుర్తింపు లేదని సుమలత అన్నారు. తమకు ఎలాంటి న్యాయపరమైన నోటీసు ఇవ్వకుండా మరో వర్గం కొత్త అసోసియేషన్‌ను ప్రకటించడం సమంజసం కాదని అన్నారు.రఘు మాస్టర్ ఆధ్వర్యంలో ప్రకటించిన కొత్త కార్యవర్గంపై సుమలత దేవి తీవ్రస్థాయిలో స్పందించారు. తమను, తమ సభ్యులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు.
సినీ పరిశ్రమలోని పెద్దలే...
"సినీ పరిశ్రమలోని కొంత మంది పెద్దలే మా యూనియన్‌ను రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఓ కార్యవర్గం ఏర్పాటైంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ పేరుతో ఏర్పాటైన ఆ కార్యవర్గానికి చట్టబద్దత లేదు. దానికి మా అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అందులో గతంలో తప్పులు చేసినవారే అందులో సభ్యులుగా ఉన్నారు. మా కార్యవర్గానికి ఎలాంటి లీగల్ నోటీసు రాలేదు. నోటీసు ఇవ్వకుండా మా కార్యవర్గాన్ని నాన్ ఆఫీషియల్ అని ఎలా ప్రకటిస్తారు?” అని సుమలత ప్రశ్నించారు.
అవినీతిని ప్రశిస్తే...
అసోసియేషన్‌లో గతంలో జరిగినట్లు చెబుతున్న 36 లక్షల రూపాయల అవినీతి వ్యవహారానికి సంబంధించిన తుది నివేదికను ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకే ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తనపై అవినీతి ఆరోపణలు, నిందలు వేస్తున్నారని సుమలత దేవి అన్నారు.
ఛాంబర్ మద్దతు కావాలి...
“మా యూనియన్ సమస్యపై నిర్ణయం తీసుకునే అధికారం మా సభ్యులకే ఉంది. మేము నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నాం. యూనియన్‌లో సభ్యులు ఓటు వేయకుండా అడ్డుకునే పరిస్థితులను కొందరు సృష్టిస్తున్నారు. మాకు ఫెడరేషన్ మద్దతు కావాలి. మా కార్యవర్గం ఏ తప్పు చేసిందో స్పష్టంగా చెప్పాలి. మేము ఫెడరేషన్‌తోనే ఉంటాం. ఫిల్మ్ ఛాంబర్ కూడా మాకు మద్దతుగా ఉండాలి ” అని సుమలత దేవిపేర్కొన్నారు.
చిరంజీవి పరిష్కరించాలి...
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సమస్యలను ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి , సురేష్ బాబు , దిల్ రాజు వంటి సినీ పెద్దలు పరిష్కరించాలని సుమలత విజ్ఞప్తి చేశారు. తమ యూనియన్ కు మద్దతుగా ఉండాలని కోరారు.“చిరంజీవి గారంటే మాకు ఎంతో ఇష్టం. డ్యాన్స్ అంటే ముందుగా మాకు ఆయనే గుర్తొస్తారు. ఆయన మా సమస్యను పరిష్కరించాలి. తప్పులు చేసిన మా సభ్యుల్లో కొందరిని నిలదీసి ప్రశ్నించినందుకే ఈ స్థాయిలో వివాదం చేస్తున్నారు” అని సుమలత దేవి అన్నారు.
విడదీయాలని చూస్తే సహించం...
అయితే, యూనియన్‌ను చీల్చేందుకు లేదా సభ్యులను ఇబ్బంది పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదంటూ సుమలత హెచ్చరించారు. .“మా యూనియన్‌ను విడదీయాలని చూసేవారికి ఇదే మా హెచ్చరిక. యూనియన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సభ్యులను, యూనియన్ కార్యకలాపాలను అడ్డుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఎవరైనా హద్దులు దాటితే వారికి గట్టిగా బుద్ధి చెబుతాం. మా యూనియన్ ఐక్యతను దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదు” అని సుమలత అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
ఆగస్టు 31, 2026

Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – జానీ మాస్టర్‌తో కలిసి!
ఆగస్టు 24, 2026

Jani Master | జానీ మాస్టర్ బ్యాన్పై ట్విస్ట్ – రెండు రోజుల్లోనే ఫెడరేషన్ యూటర్న్
జులై 19, 2026
తాజావార్తలు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?
- ●Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?



