Money | సైబర్ మోసంలో పోయిన డబ్బు.. ఇలా రీఫండ్ పొందండి..
Money | సైబర్ వలలో చిక్కి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే అలా పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తుంది. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే ఇది సాధ్యమవుతుంది. సైబర్ దాడి జరిగిన తొలి గంటలో తేరుకుని ఫిర్యాదు చేసిన వారిలో 80-90 శాతం మందికి తమ డబ్బు తిరిగి పొందే అవకాశం లభిస్తుంది.
Technology | Published On Jun 16, 2026, 12.59 pm IST
Money | సైబర్ వలలో చిక్కి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే అలా పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తుంది. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే ఇది సాధ్యమవుతుంది. సైబర్ దాడి జరిగిన తొలి గంటలో తేరుకుని ఫిర్యాదు చేసిన వారిలో 80-90 శాతం మందికి తమ డబ్బు తిరిగి పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు ఫిర్యాదు చేసిన తర్వాత సైబర్ దాడికి గురైన మొత్తం బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయ్యేది. ఆ డబ్బులను తిరిగి పొందేందుకు బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో మనీ రిస్టోరేషన్ మాడ్యుల్ (ఎంఆర్‌ఎం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితులు ఫ్రీజ్ అయిన డబ్బును సులభంగా తిరిగి పొందే అవకాశం కల్పించింది.
ఇలా చేయాలి..
సైబర్ మోసానికి గురైన బాధితుడు తప్పనిసరిగా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ లేదా 1930 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాలి. తర్వాత https://mrm-ncrp.mha.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సిటిజన్ లాగిన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఎన్‌సీఆర్‌పీకి లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత రెయిజ్ రిఫండ్ రిక్వెస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎన్‌సీఆర్‌పీ నుంచి వచ్చిన 14 అంకెల ఫిర్యాదు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే ఫిర్యాదు వివరాలు, డెబిట్ వివరాలు కనిపిస్తాయి. రీఫండ్ కోసం అవసరమైన పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ రిఫండ్ మొత్తాన్ని వేరే బ్యాంకు ఖాతాకు జమ చేయాలనుకుంటే, ఆ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. దరఖాస్తు పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు జనరేట్ అయిన రిక్వెస్ట్ ఐడీ వస్తుంది. దాని ద్వారా దరఖాస్తు స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు.
రూ.50వేలకు మించితే..
ఒక వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాలో రూ.50 వేల కంటే తక్కువ మొత్తం ఫ్రీజ్ అయినట్లయితే ఎఫ్‌ఐఆర్ లేదా కోర్టు ఉత్తర్వులు అవసరం ఉండవు. పోలీస్ రిపోర్టు లేదా ఇండెమ్నిటీ బాండ్ ఆధారంగా రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఒకే బ్యాంకు ఖాతాలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తం ఫ్రీజ్ అయినట్లయితే ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి. ఆ తర్వాత ఎంఆర్‌ఎం పోర్టల్ ద్వారానే రిఫండ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎలాంటి థర్డ్ పార్టీ సేవలు అవసరం ఉండవు. సహాయం కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించవచ్చని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






