త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ప్రైవేటీక‌ర‌ణ నుంచి సింగ‌రేణిని ర‌క్షిస్తాం

Kavitha | గతంలో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి అనేక మైన్లను కాపాడుకున్నామ‌ని, భవిష్యత్తులో కూడా ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో పోరాడి సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి రక్షిస్తామ‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలంగాణలోని గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు నిల్వలను సింగరేణికి కేటాయించాలని కోరారు.

S

Telangana | Published On Jun 16, 2026, 1.48 pm IST

Kavitha | ప్రైవేటీక‌ర‌ణ నుంచి సింగ‌రేణిని ర‌క్షిస్తాం
Advertisement
  • మా పార్టీలోనూ అన్న‌లు ఉన్నారు
  • కార్మికుల‌కు క‌నీసం తాగునీరు ఇస్త‌లేరు
  • గోదావ‌రి వ్యాలీ బొగ్గు నిల్వ‌ల‌ను సింగ‌రేణికి కేటాయించే బాధ్య‌త కిష‌న్‌రెడ్డిదే
  • టీఆర్ఎస్ చీఫ్ కల్వ‌కుంట్ల క‌విత‌

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: గతంలో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి అనేక మైన్లను కాపాడుకున్నామ‌ని, భవిష్యత్తులో కూడా ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో పోరాడి సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి రక్షిస్తామ‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత స్ప‌ష్టం చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలంగాణలోని గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు నిల్వలను సింగరేణికి కేటాయించాలని కోరారు. కోల్ బ్లాక్స్ కోసం సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే పరిస్థితి లేకుండా చేయాలన్నారు. మనకు ఎక్కువ బ్లాక్స్ కేటాయించే ప్రయత్నం చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

సింగరేణిలో అండర్‌గ్రౌండ్ మైన్లను మూసివేసి, ఓపెన్‌కాస్ట్ మైన్లను పెంచుతూ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ మైన్లను కొనసాగిస్తూ మ్యాన్‌పవర్‌ను పెంచాలి. సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా యాజమాన్యం, ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. గనుల్లో కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, కనీసం తాగునీరు కూడా అందించడం లేదు అని క‌విత ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా గనుల్లో కార్మికుల భద్రత, వెంటిలేషన్ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంటే, సింగరేణిలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు తగినంత గాలి కూడా అందించలేని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలి.

బొగ్గుబాయి కార్య‌క్ర‌మంలో ఉద్రిక్త‌త‌...

అంత‌కు ముందు కవిత తలపెట్టిన భూగర్భగని వద్ద ‘బొగ్గుబాయి’ కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ శ్రేణులు, కార్మిక సంఘం నాయకులతో క‌లిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ఆమె య‌త్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత జ‌రిగింది. గేట్లను తోసుకొని కవిత, పార్టీ శ్రేణులు గని ఆవరణలోకి దూసుకెళ్లారు. కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. అడవిలో అన్నలు లేరని సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలో కూడా ఉన్నారని తెలిపారు. కార్మికులకు ఇబ్బంలు కలిగిస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామని స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement