Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్
Hyderabad Police | ఫంక్షన్ హాళ్లలో అధిక శబ్దంతో డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, రోడ్లపై అస్తవ్యస్త పార్కింగ్, ప్రజా శాంతికి భంగం కలిగించే ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు.
Hyderabad Police | ఫంక్షన్ హాళ్లలో అధిక శబ్దంతో డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, రోడ్లపై అస్తవ్యస్త పార్కింగ్, ప్రజా శాంతికి భంగం కలిగించే ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు కులసుంపుర డివిజన్ పరిధిలోని ఫంక్షన్ హాళ్ల యజమానులు, నిర్వాహకులతో సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో గోల్కొండ జోన్ అదనపు డీసీపీ బీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ధ్వని కాలుష్య నియంత్రణ నిబంధనలు-2000తో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అనుమతించిన సమయాలు దాటిన తర్వాత డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించడం, బాణసంచా కాల్చడం, రోడ్లపై వాహనాలు నిలిపివేయడం వంటి అంశాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఫంక్షన్ హాళ్ల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే ట్రేడ్ లైసెన్సుల రద్దుకు కూడా సిఫార్సు చేస్తామని అదనపు డీసీపీ హెచ్చరించారు. సమావేశంలో పాల్గొన్న ఫంక్షన్ హాళ్ల యజమానులు పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






