త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GTA 6 | జీటీఏ 6 గేమ్‌ను ఎందులో ఆడాలి..? ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? పూర్తి గేమింగ్ సెట‌ప్ వివ‌రాలివే..!

GTA 6 | రాక్‌స్టార్ గేమ్స్ నుంచి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) భారత్‌లో ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ కన్సోళ్లపై అందుబాటులోకి వచ్చింది. గేమ్ స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999గా, అల్టిమేట్ ఎడిషన్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. అయితే కొత్తగా ప్లేస్టేషన్ 5 కొనుగోలు చేసి ఈ గేమ్ ఆడాలనుకునే వారు కన్సోల్, గేమ్, ఇతర పరికరాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

S

Technology | Published On Nov 19, 2026, 12.35 pm IST

GTA 6 | జీటీఏ 6 గేమ్‌ను ఎందులో ఆడాలి..? ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? పూర్తి గేమింగ్ సెట‌ప్ వివ‌రాలివే..!
Advertisement

GTA 6 | రాక్‌స్టార్ గేమ్స్ నుంచి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) భారత్‌లో ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ కన్సోళ్లపై అందుబాటులోకి వచ్చింది. గేమ్ స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999గా, అల్టిమేట్ ఎడిషన్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. అయితే కొత్తగా ప్లేస్టేషన్ 5 కొనుగోలు చేసి ఈ గేమ్ ఆడాలనుకునే వారు కన్సోల్, గేమ్, ఇతర పరికరాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

గేమ్ ధ‌ర ఎంత‌..?

గేమింగ్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) భారత్‌లో విడుదలైంది. రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన ఈ గేమ్ కల్పిత ప్రాంతమైన లియోనిడా నేపథ్యంలో సాగుతుంది. ఆధునిక రూపంలో రూపొందించిన వైస్ సిటీకి ఆటగాళ్లను తీసుకెళ్లనుంది. జేసన్ డువాల్, లూసియా కామినోస్ అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ కథనం కొనసాగుతుంది. ప్లేస్టేషన్ స్టోర్, ఎక్స్‌బాక్స్ స్టోర్‌లలో రెండు ఎడిషన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999 కాగా, ఇందులో పూర్తి బేస్ గేమ్ లభిస్తుంది. నవంబర్ 20లోపు డిజిటల్ వెర్షన్ కొనుగోలు చేసేవారికి వింటేజ్ వైస్ సిటీ ప్యాక్‌తోపాటు ఒక నెల జీటీఏ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఫిజికల్ వెర్షన్ కొనుగోలు చేసేవారికి డిస్క్‌కు బదులుగా గేమ్ డౌన్‌లోడ్ కోడ్ ఉన్న ప్యాకేజీ అందిస్తున్నారు. అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499గా ఉంది. ఇందులో బేస్ గేమ్‌తోపాటు జేసన్, లూసియా పాత్రలకు సంబంధించిన అదనపు వాహనాలు, ఆయుధాలు, కస్టమైజేషన్ సదుపాయాలు, వ్యాపారాలకు సంబంధించిన ప్రత్యేక కంటెంట్ అందుబాటులో ఉంటుంది.

ఎంత ఖ‌ర్చు వ‌స్తుంది..?

కొత్తగా ప్లేస్టేషన్ 5 కొనుగోలు చేసేవారికి అసలు ఖర్చు మరింత ఎక్కువ కానుంది. సోనీ గతంలో కన్సోల్ ధరలను పెంచిన నేపథ్యంలో స్టాండర్డ్ డిస్క్ ఆధారిత ప్లేస్టేషన్ 5 ధర ప్రస్తుతం రూ.69,990గా ఉంది. దీనికి జీటీఏ 6 స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999 కలిపితే మొత్తం రూ.75,989 అవుతుంది. ఇక గేమింగ్ కోసం మానిటర్ కొనుగోలు చేయాలంటే సుమారు రూ.15వేలు, గేమింగ్ చైర్ కోసం మరో రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సి వ‌స్తుంది. కానీ ఇప్ప‌టికే చైర్ ఉన్న‌వారు కొత్త‌గా కొనాల్సిన ప‌నిలేదు. అదనపు డ్యుయల్‌సెన్స్ కంట్రోలర్, హెడ్‌సెట్, స్టోరేజ్ అప్‌గ్రేడ్‌లు కొనుగోలు చేస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. ముఖ్యంగా జీటీఏ 6 గేమ్‌కు గరిష్ఠంగా 212 జీబీ స్టోరేజ్ అవసరమవుతుందని రాక్‌స్టార్ త‌న స‌పోర్ట్ డాక్యుమెంట్ల‌లో పేర్కొంది. ఇతర గేమ్‌లను కూడా కన్సోల్‌లో ఉంచుకోవాలనుకునే వారు అదనపు స్టోరేజ్ కొనుగోలును పరిశీలించాల్సి ఉంటుంది.

పూర్తి సెట‌ప్‌కు ఎంత‌వుతుంది..?

గేమ్ డిజిటల్ వెర్షన్‌ను ప్లేస్టేషన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్లేస్టేషన్ 5 ప్రో మెరుగుదలలకు కూడా ఇందులో మద్దతు ఉంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ వినియోగదారులు ఎక్స్‌బాక్స్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్లేస్టేషన్ 5 కన్సోల్ కొనుగోలు చేయాలనుకునే వారు సోనీ అధికారిక విక్రయ కేంద్రాలు, రిలయన్స్ డిజిటల్, అమెజాన్‌లలో ధరలను పోల్చుకోవచ్చు. రిటైలర్, ప్రాంతం, విక్రయ నిబంధనలను బట్టి ధరలు, అందుబాటు మారే అవకాశం ఉంటుంది. జీటీఏ 6 గేమ్ కొనుగోలు ధర రూ.5,999 అయినప్పటికీ, కొత్తగా గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టేవారు పూర్తి సెటప్ కోసం రూ.70 వేల నుంచి రూ.లక్షకు పైగా బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement