త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GTA 6 | జీటీఏ 6 వ‌చ్చేస్తోంది.. గేమింగ్ ప్రియుల‌కు పండ‌గే.. లాంచ్ ఎప్పుడంటే..?

GTA 6 | జీటీఏ 6 గేమ్ విడుదల రోజున విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు బెల్‌ఫాస్ట్‌లోని బాయ్స్ మోడల్ స్కూల్ వినూత్న ఆలోచన చేసింది. నవంబర్ 19న పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇద్దరికి 70 పౌండ్ల విలువైన ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ గిఫ్ట్ కార్డులను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. అదే రోజు విద్యార్థులకు గణిత పరీక్ష కూడా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

S

Technology | Published On Nov 18, 2026, 3.27 pm IST

GTA 6 | జీటీఏ 6 వ‌చ్చేస్తోంది.. గేమింగ్ ప్రియుల‌కు పండ‌గే.. లాంచ్ ఎప్పుడంటే..?
Advertisement

GTA 6 | జీటీఏ 6 గేమ్ విడుదల రోజున విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు బెల్‌ఫాస్ట్‌లోని బాయ్స్ మోడల్ స్కూల్ వినూత్న ఆలోచన చేసింది. నవంబర్ 19న పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఇద్దరికి 70 పౌండ్ల విలువైన ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ గిఫ్ట్ కార్డులను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. అదే రోజు విద్యార్థులకు గణిత పరీక్ష కూడా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

లాంచ్ ఎప్పుడు..?

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6) విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ గేమ్ విడుదల రోజున విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి గేమ్ ఆడే అవకాశం ఉందని భావించిన ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ బాయ్స్ మోడల్ స్కూల్ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది. నవంబర్ 19న గేమ్ విడుదల కానుండగా, అదే రోజు 11వ తరగతి విద్యార్థులందరికీ, 12వ తరగతిలోని కొంతమందికి జీసీఎస్ఈ గణిత పరీక్ష జరగనుంది. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులకు లేఖ పంపింది. గ్రాండ్ థెఫ్ట్ ఆటో వంటి వినోద కార్యక్రమాలను వారాంతం వరకు వాయిదా వేసుకోవచ్చని సూచించింది. అలాగే గురువారం, శుక్రవారం రెండు రోజులూ పాఠశాలకు హాజరైన విద్యార్థుల్లో లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి 70 పౌండ్ల విలువైన ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ గిఫ్ట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది.

పరీక్ష‌ల ఒత్తిడి త‌గ్గేందుకు గేమింగ్ స‌హాయ‌ప‌డుతుందా..?

పాఠశాల ప్రిన్సిపల్ మేరీ మోంట్‌గోమరీ మాట్లాడుతూ.. విద్యార్థులు గణిత పరీక్షకు సిద్ధంగా ఉండడం, మంచి ఫలితాలు సాధించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత కొన్నేళ్లుగా జీసీఎస్ఈ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని, ఆ విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గేమ్ విడుదల కారణంగా విద్యార్థులు దృష్టి మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, గిఫ్ట్ కార్డుల ఆలోచన మాత్రం విద్యార్థుల నుంచే వచ్చిందని వెల్లడించారు. పాఠశాల హెడ్ మాస్ట‌ర్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా గృహ హింసకు గురైన పురుషులకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. గేమింగ్ తమకు పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. మాజీ ప్రిన్సిపల్ క్యాథ్లీన్ ఓహేర్ ఈ నిర్ణయాన్ని తెలివైన చర్యగా అభివర్ణించగా, ఒక్కరోజు పాఠశాలకు గైర్హాజరైనా కొందరు విద్యార్థుల్లో తిరిగి పాఠశాలకు వెళ్లడంపై ఆందోళన పెరిగి, అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అల్స్టర్ యూనియనిస్ట్ పార్టీ కౌన్సిలర్ పీట్ వ్రే హెచ్చరించారు.

అత్య‌ధిక వ్య‌యంతో రూపొందిన గేమ్ ఇదే..

జీటీఏ 6 గేమ్.. జీటీఏ 5 విడుదలైన 13 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి వస్తోంది. 2013లో జీటీఏ 5 విడుదలైన సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సెలవులు తీసుకోవడంతో జీటీఏ ఫ్లూ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటివరకు జీటీఏ 5 దాదాపు 23 కోట్ల కాపీలు అమ్ముడైంది. జీటీఏ 6 అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్లకు పైగా (సుమారు 866 మిలియన్ పౌండ్లు) ఖర్చయినట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక వ్యయంతో రూపొందుతున్న గేమ్‌గా ఇది నిలిచింది. ఫ్లోరిడాను పోలిన కల్పిత ప్రాంతమైన లియోనిడా నేపథ్యంలో ఈ గేమ్ కథ సాగుతుంది. లూసియా అనే మహిళా పాత్రను తొలిసారిగా ప్రధాన ప్లేయబుల్ పాత్రగా పరిచయం చేస్తుండగా, ఆమె భాగస్వామి జేసన్ కూడా కథలో కీలక పాత్ర పోషించనున్నాడు.

Advertisement
Advertisement