Google Wallet | ఆధార్ డిజిటల్ వెరిఫికేషన్ ఇక ఈజీ.. గూగుల్ వాలెట్ యాప్‌లో కొత్త ఫీచర్..
Google Wallet | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన వాలెట్ యాప్‌కు నూతన అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా దీన్ని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌లో డిజిటల్ ఐడెండిటీ ఫీచర్‌ను మరింత విస్తరించింది. ఇందులో ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్ ఇచ్చింది.
Technology | Published On Apr 28, 2026, 2.17 pm IST
Google Wallet | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన వాలెట్ యాప్‌కు నూతన అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా దీన్ని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌లో డిజిటల్ ఐడెండిటీ ఫీచర్‌ను మరింత విస్తరించింది. ఇందులో ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్ ఇచ్చింది. అలాగే పాస్‌పోర్ట్ ఆధారిత డిజిటల్ ఐడీ సేవలను కూడా మెరుగు పరిచినట్లు తెలిపింది. UIDAI భాగస్వామ్యంతో గూగుల్ వాలెట్ ఇప్పుడు ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్‌కు సపోర్ట్‌ను అందిస్తోంది. వినియోగదారులు తమ ఆధార్ ఆధారిత గుర్తింపును నేరుగా తమ డివైస్‌లో సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. దీంతో రోజువారీ అవసరాల కోసం ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా వేగంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు గూగుల్ వాలెట్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ అలన్ స్టాపెల్‌బర్గ్ వివరాలను వెల్లడించారు.
అనేక చోట్ల ఐడీ వెరిఫికేషన్ ఇక ఈజీ..
ఈ వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్స్ ఆధారంగా రూపొందించారు. ఇందులో సెలెక్టివ్ డిస్‌క్లోజర్ వంటి ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి. అంటే అవసరమైన వివరాలు మాత్రమే వెరిఫికేషన్ సమయంలో షేర్ అవుతాయి. దీంతో డిజిటల్, ఫిజికల్ పరిస్థితుల్లో సురక్షితమైన ఐడెంటిటీ వినియోగం సాధ్యమవుతుంది. ఇక ఈ ఆధార్ డిజిటల్ ఐడీని పలు సేవల్లో ఉపయోగించేందుకు అనుసంధానం చేస్తున్నారు. పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ఎ సర్టిఫికెట్ ఉన్న సినిమాలను చూడాలంటే వయస్సు నిర్దారణ కోసం లేదా ప్రేక్షకులకు రివార్డులను అందించేందుకు, భారత్ మాట్రిమొనీ వంటి సైట్లలో ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం, అట్లిస్‌లో అంతర్జాతీయ వీసా అప్లికేషన్ల ఆటో ఫిల్, మైగేట్ వంటి గేటెడ్ కమ్యూనిటీ లేదా అపార్ట్‌మెంట్ వంటి యాప్‌లలో డెలివరీ, సర్వీస్ స్టాఫ్ వెరిఫికేషన్, స్నాబ్ ఇట్ లో గిగ్ వర్కర్ల ఐడెంటిటీ చెక్‌లకు గూగుల్ అందిస్తున్న ఈ ఆధార్ డిజిటల్ ఐడీని ఉపయోగించనున్నారు. దీంతో వేగంగా వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి నిత్యం ఎదురయ్యే వెరిఫికేషన్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్లకే..
గూగుల్ ఐడీ పాస్ ఫీచర్‌ను కూడా విస్తరించింది. ఇది పాస్‌పోర్ట్ సమాచారంతో డిజిటల్ ఐడీని సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఐడీ పాస్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవల్లో వయస్సు లేదా గుర్తింపు నిర్ధారణ కోసం ఉపయోగించవచ్చు. ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్ ఇప్పుడు భారత్‌లో గూగుల్ వాలెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐడీ పాస్ ఫీచర్ ప్రస్తుతం సింగపూర్, తైవాన్, బ్రెజిల్ దేశాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని కూడా భారత వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నారు. అయితే గూగుల్ అందిస్తున్న ఈ ఫీచర్‌లను పొందాలంటే గూగుల్ వాలెట్ యాప్‌ను యూజర్లు తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గూగుల్ వాలెట్ యాప్ ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






