త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | యూజ‌ర్ల‌కు గూగుల్ షాక్‌.. ఇక జీమెయిల్ ఉచిత స్టోరేజ్ 5జీబీ మాత్ర‌మే..

Google | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ప్రస్తుతం వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్లకు ఉచితంగా ఒక మోస్త‌రు స్థాయి క్లౌడ్ స్టోరేజ్ అందిస్తోంది. ఈ స్టోరేజ్ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ మధ్య షేర్ అవుతుంది. అయితే త్వరలో ఈ పరిమితిలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు జీమెయిల్ యూజర్లు గూగుల్ కొత్త అకౌంట్లకు సాధారణంగా ఇచ్చే 15జీబీ స్టోరేజ్ బదులుగా తక్కువ స్టోరేజ్ లిమిట్‌ను టెస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు.

S

Technology | Published On May 15, 2026, 5.39 pm IST

Google | యూజ‌ర్ల‌కు గూగుల్ షాక్‌.. ఇక జీమెయిల్ ఉచిత స్టోరేజ్ 5జీబీ మాత్ర‌మే..
Advertisement

Google | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ప్రస్తుతం వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్లకు ఉచితంగా ఒక మోస్త‌రు స్థాయి క్లౌడ్ స్టోరేజ్ అందిస్తోంది. ఈ స్టోరేజ్ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ మధ్య షేర్ అవుతుంది. అయితే త్వరలో ఈ పరిమితిలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు జీమెయిల్ యూజర్లు గూగుల్ కొత్త అకౌంట్లకు సాధారణంగా ఇచ్చే 15జీబీ స్టోరేజ్ బదులుగా తక్కువ స్టోరేజ్ లిమిట్‌ను టెస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. చాలా సంవత్సరాలుగా గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రతి యూజర్‌కు 15జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందిస్తోంది. కానీ ఇప్పుడు కొత్త యూజర్లకు ఫ్రీ జీమెయిల్ స్టోరేజ్‌ను తగ్గిస్తే, ఎక్కువ స్టోరేజ్ అవసరమైన వారు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది.

కొత్త జీమెయిల్ అకౌంట్లకు 5జీబీ మాత్రమే..

రెడిట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పలువురు యూజర్లు షేర్ చేసిన వివరాల ప్రకారం, ఫోన్ నంబర్ లింక్ చేయని కొత్త జీమెయిల్ అకౌంట్లకు గూగుల్ కేవలం 5జీబీ ఫ్రీ స్టోరేజ్ మాత్రమే ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఫోన్ నంబర్ వెరిఫై చేసిన యూజర్లకు మామూలుగా ఉండే 15జీబీ స్టోరేజ్ అందుతోంది. యూజర్లు ఫోన్ నంబర్ జోడించకుండా అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. కానీ అలాంటి అకౌంట్లకు స్టోరేజ్ 5జీబీకే పరిమితం అవుతోందని సమాచారం. దీనిపై కొందరు యూజర్లు విమర్శలు చేస్తున్నారు. ఫోన్ నంబర్ తీసుకోవడం ద్వారా గూగుల్ మరింత యూజర్ డేటాను సేకరిస్తుందని వారు అంటున్నారు. మరోవైపు కొందరు మాత్రం స్పామ్ అకౌంట్లను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఫేక్ అకౌంట్లపై గూగుల్ ఫోకస్..?

ప్రస్తుతం చాలా మంది అదనపు స్టోరేజ్ కొనకుండా ఉండేందుకు పలు జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్‌ను తగ్గించడానికే గూగుల్ కొత్త అకౌంట్లపై స్టోరేజ్ పరిమితులు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెడిట్ పోస్టుల ప్రకారం ఈ టెస్ట్ ప్రస్తుతం కెన్యా, నైజీరియా వంటి కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే ఇది భవిష్యత్తులో గ్లోబల్ రోల్‌ఔట్‌కు ముందు చేసే ఎ/బి టెస్టింగ్ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ జీమెయిల్ అధికారిక సపోర్ట్ పేజీల్లో మాత్రం కొత్త అకౌంట్లకు 15జీబీ ఫ్రీ స్టోరేజ్ అందుతుందని చూపిస్తోంది. అదనపు స్టోరేజ్ అవసరమైన వారు గూగుల్ వన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్ అధికారిక స్పందన..

అయితే ఈ విష‌యంల‌పై గూగుల్ అధికారికంగా స్పందించింది. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో క‌కొత్త అకౌంట్లకు కొత్త స్టోరేజ్ పాలసీని టెస్ట్ చేస్తున్నామ‌ని తెలిపింది. దీని ద్వారా యూజర్లకు మెరుగైన స్టోరేజ్ సేవలు అందించడంతోపాటు అకౌంట్ సెక్యూరిటీ, డేటా రికవరీని కూడా మెరుగుపరచాలని చూస్తున్నామ‌ని గూగుల్ ప్రతినిధి తెలిపారు. ఇక భార‌త్‌లో జీమెయిల్‌తోపాటు ఇత‌ర గూగుల్ స‌ర్వీసుల‌కు మొత్తం క‌లిపి అందిస్తున్న 15జీబీ ఉచిత స్టోరేజ్ లిమిట్ దాటితే అద‌న‌పు లిమిట్ కోసం గూగుల్ ప‌లు ప్లాన్ల‌ను ఇక్క‌డి యూజ‌ర్ల‌కు అందిస్తోంది. అందులో భాగంగా గూగుల్ వ‌న్ లైట్ ప్లాన్‌ను తీసుకుంటే 30జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. దీనికి నెల‌కు రూ.59 చెల్లించాలి. 100జీబీ స్టోరేజ్‌కు నెల‌కు రూ.130, 2టీబీ స్టోరేజ్‌కు నెల‌కు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement