త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Search | గూగుల్ సెర్చ్‌లో భారీ మార్పులు.. ఇక ట్రస్టెడ్ వెబ్‌సైట్లకే ప్రాధాన్యత‌..

Google Search | గూగుల్ తన సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. యూజర్లు ట్రస్టెడ్ వెబ్‌సైట్లు, ఒరిజినల్ రిపోర్టింగ్, క్రియేటర్ ఇన్‌సైట్స్, ఫస్ట్‌హ్యాండ్ పర్స్పెక్టివ్‌లను మరింత సులభంగా కనుగొనేలా ఈ మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాల్లో ఈ ఫీచర్లను విస్తరించనుంది.

S

Technology | Published On May 28, 2026, 3.03 pm IST

Google Search | గూగుల్ సెర్చ్‌లో భారీ మార్పులు.. ఇక ట్రస్టెడ్ వెబ్‌సైట్లకే ప్రాధాన్యత‌..
Advertisement

Google Search | గూగుల్ తన సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. యూజర్లు ట్రస్టెడ్ వెబ్‌సైట్లు, ఒరిజినల్ రిపోర్టింగ్, క్రియేటర్ ఇన్‌సైట్స్, ఫస్ట్‌హ్యాండ్ పర్స్పెక్టివ్‌లను మరింత సులభంగా కనుగొనేలా ఈ మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాల్లో ఈ ఫీచర్లను విస్తరించనుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రిఫర్డ్ సోర్సెస్ ఫీచర్‌ను ఇప్పుడు ఏఐ ఓవర్వ్యూస్, ఏఐ మోడ్‌లో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అలాగే టైమ్‌లీ ఆర్టికల్స్, ఆన్‌లైన్ డిస్కషన్స్, ఇన్‌ఫ్లుయెన్షియల్ రిపోర్టింగ్‌ను హైలైట్ చేసే కొత్త కారౌజెల్ ఫీచర్లు కూడా సెర్చ్‌లో కనిపించనున్నాయి. ఈ అప్‌డేట్స్‌ను గూగుల్ సెర్చ్ ప్రొడక్ట్ మేనేజర్ డంకన్ ఓస్‌బోర్న్ ప్రకటించారు. వెబ్‌లో ఉన్న ట్రస్టెడ్ సోర్సెస్, క్రియేటర్ కంటెంట్, ఫస్ట్‌హ్యాండ్ పర్స్పెక్టివ్‌లతో యూజర్లను మరింత మెరుగ్గా కనెక్ట్ చేయడమే ఈ మార్పుల లక్ష్యమని ఆయన తెలిపారు.

ఎంపిక చేసుకున్న సైట్ల వార్త‌లు ముందుగానే..

గూగుల్ తెలిపిన ప్రకారం, యూజర్లు ఎక్కువగా నమ్మే వెబ్‌సైట్లు, పబ్లిషర్లు, క్రియేటర్ల కంటెంట్‌ను ముందుగా చూపించేందుకు ప్రిఫర్డ్ సోర్సెస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి ఈ ఫీచర్ ఏఐ ఓవర్వ్యూస్, ఏఐ మోడ్‌లో కూడా పనిచేస్తుంది. దీంతో యూజర్లు ముందుగానే ఎంపిక చేసుకున్న వెబ్‌సైట్ల లింకులను ఏఐ జనరేటెడ్ సెర్చ్ రెస్పాన్స్‌లలో సులభంగా గుర్తిస్తారు. టాప్ స్టోరీస్ మాదిరిగానే ఈ ప్రిఫర్డ్ సోర్సెస్‌కు స్పష్టమైన లేబుల్స్ కూడా కనిపిస్తాయి. యూజర్లు సెర్చ్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్‌లోని సోర్స్ ప్రిఫరెన్సెస్ ద్వారా తమకు ఇష్టమైన వెబ్‌సైట్లు, పబ్లిషర్లను జ‌త చేయ‌వ‌చ్చు. ఫ్రెష్ కంటెంట్‌ను పబ్లిష్ చేసే ఏ వెబ్‌సైట్ అయినా ఇందులో చేరవచ్చని గూగుల్ తెలిపింది. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం యూజర్లు ప్రిఫర్డ్ సోర్స్ లింకులను క్లిక్ చేసే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే 3.45 లక్షలకు పైగా యూనిక్ సోర్సెస్‌ను యూజర్లు ఎంపిక చేసుకున్నారు.

కొత్త‌గా కారౌజెల్ ఎక్స్‌పీరియెన్సెస్‌..

గూగుల్ సెర్చ్‌లో ఇప్పుడు ఆర్టికల్స్, అప్‌డేట్స్, పర్స్పెక్టివ్‌ల కోసం కొత్త కారౌజెల్ ఆధారిత అనుభవాలు కూడా రానున్నాయి. డెవలపింగ్ టాపిక్స్‌కు సంబంధించిన సెర్చ్‌లలో వివిధ పబ్లిషర్ల నుంచి వచ్చిన టైమ్‌లీ కవరేజ్‌ను చూపించే ప్రముఖ ఆర్టికల్ కారౌజెల్ కనిపిస్తుంది. ఇందులో ప్రిఫర్డ్ సోర్సెస్ కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజర్లు ఏ ఆర్టికల్ చదవాలో నిర్ణయించుకునే ముందు వారికి ప్రారంభ స్థాయి కాంటెక్స్ట్, పలు కంటెంట్ ఆప్షన్లు అందించడమే ఈ ఫీచర్ ఉద్దేశమని గూగుల్ తెలిపింది. అలాగే ఆన్‌లైన్ డిస్కషన్స్, ఫోరమ్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి వచ్చే పర్స్పెక్టివ్‌ల కోసం ప్రత్యేక కారౌజెల్‌ను కూడా కంపెనీ సిద్ధం చేస్తోంది. అభిప్రాయాలు, అనుభవాలు, ఇతరుల ఇన్‌సైట్స్ కోసం సెర్చ్ చేసే యూజర్లకు ఇది ఉపయోగపడనుంది.

ఒరిజిన‌ల్‌ను గుర్తించ‌డం సుల‌భం..

గూగుల్ తన హైలీ సైటెడ్ బ్యాడ్జ్‌ను మరిన్ని ఆర్టికల్ లింకులకు విస్తరిస్తోంది. ఇతర పబ్లిషర్లు, ఆర్టికల్స్ ఎక్కువగా రిఫర్ చేసే కథనాలు, రిపోర్ట్స్‌కు ఈ లేబుల్ కనిపిస్తుంది. దీంతో యూజర్లు ఇన్‌ఫ్లుయెన్షియల్ లేదా ఒరిజినల్ రిపోర్టింగ్‌ను మరింత సులభంగా గుర్తిస్తారు. అలాగే ఏదైనా ఆర్టికల్ హైలీ సైటెడ్ సోర్స్‌ను రిఫర్ చేస్తే, దానిని కూడా సెర్చ్ స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రభావవంతమైన కవరేజ్, ఒరిజినల్ రిపోర్టింగ్‌ను యూజర్లు త్వరగా కనుగొంటార‌ని గూగుల్ పేర్కొంది. ఏఐ ఓవర్వ్యూస్, ఏఐ మోడ్ కోసం ప్రిఫర్డ్ సోర్సెస్ సపోర్ట్ ఇవాళ్టి నుంచే రోల్‌అవుట్ అవుతోందని గూగుల్ తెలిపింది. కొత్త ఆర్టికల్, పర్స్పెక్టివ్ కారౌజెల్స్‌తోపాటు విస్తరించిన హైలీ సైటెడ్ లేబుల్స్ కూడా దశలవారీగా గూగుల్ సెర్చ్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement