త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Search | గూగుల్ కొత్త ఫీచర్.. సెర్చ్‌లోనే క్రియేటర్లకు ప్రత్యేక ప్రొఫైల్..

Google Search | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తన సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లో సెర్చ్ ప్రొఫైల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లు తమ ఆన్‌లైన్ ఉనికిని మరింత సమర్థంగా ప్రదర్శించుకునే అవకాశం పొందనున్నారు. సెర్చ్‌లోనే ప్రత్యేకంగా షేర్ చేయగలిగే ప్రొఫైల్ పేజీ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా క్రియేటర్లు, పబ్లిషర్లు తమ కంటెంట్‌ను వివిధ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఒకే చోట చూపించవచ్చు.

S

Technology | Published On Jun 5, 2026, 4.57 pm IST

Google Search | గూగుల్ కొత్త ఫీచర్.. సెర్చ్‌లోనే క్రియేటర్లకు ప్రత్యేక ప్రొఫైల్..
Advertisement

Google Search | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ తన సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లో సెర్చ్ ప్రొఫైల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా పబ్లిషర్లు, కంటెంట్ క్రియేటర్లు తమ ఆన్‌లైన్ ఉనికిని మరింత సమర్థంగా ప్రదర్శించుకునే అవకాశం పొందనున్నారు. సెర్చ్‌లోనే ప్రత్యేకంగా షేర్ చేయగలిగే ప్రొఫైల్ పేజీ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా క్రియేటర్లు, పబ్లిషర్లు తమ కంటెంట్‌ను వివిధ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఒకే చోట చూపించవచ్చు. తాజా ఆర్టికల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు వంటి కంటెంట్‌ను ఒకే ప్రొఫైల్‌లో సమీకరించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచవచ్చు. దీంతో యూజర్లు విశ్వసనీయమైన, తాజా సమాచారాన్ని సులభంగా గుర్తించ‌గ‌లుగుతారు. గూగుల్ తెలిపిన‌ ప్రకారం సెర్చ్ ప్రొఫైల్ ద్వారా యూజర్లు తమకు ఇష్టమైన పబ్లిషర్లు, క్రియేటర్లను నేరుగా ఫాలో అవ్వ‌చ్చు. ఒకసారి ఫాలో అయితే ఆ సోర్స్ నుంచి వచ్చే కంటెంట్ గూగుల్ డిస్కవర్ ఫీడ్‌లో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. డిస్కవర్ గూగుల్ యాప్ హోమ్ స్క్రీన్‌లో అందుబాటులో ఉంటుంది.

3 మార్గాల్లో యాక్సెస్‌..

మొబైల్ వినియోగదారులు సెర్చ్ ప్రొఫైల్స్‌ను మూడు మార్గాల్లో యాక్సెస్ చేయవచ్చు. సెర్చ్‌లో కనిపించే క్రియేటర్ లేదా పబ్లిషర్ నాలెడ్జ్ ప్యానెల్ ద్వారా, గూగుల్ డిస్కవర్‌లో పబ్లిషర్ లేదా క్రియేటర్ పేరుపై ట్యాప్ చేయడం ద్వారా, నేరుగా ప్రొఫైల్ యూఆర్‌ఎల్ ద్వారా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ప్రధాన సోషల్ మీడియా లేదా వీడియో ప్లాట్‌ఫామ్‌లలో గణనీయమైన ఫాలోయింగ్ ఉన్న పబ్లిషర్లు, క్రియేటర్లు తమ సెర్చ్ ప్రొఫైల్‌ను క్లెయిమ్ చేసుకుని పలు అంశాలను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌చ్చు. అవతార్ క్రియేష‌న్‌, బయో, వెబ్‌సైట్ లింకులు, సోషల్ మీడియా ఖాతాలు, వీడియో ప్లాట్‌ఫామ్ లింకులు, ఇతర ముఖ్యమైన కంటెంట్ ను షేర్ చేయ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం అమెరికాలోనే..

సెర్చ్ ప్రొఫైల్‌ను క్లెయిమ్ చేయడం వల్ల అర్హత కలిగిన పబ్లిషర్లు, క్రియేటర్లకు కొత్తగా నాలెడ్జ్ ప్యానెల్ కూడా రూపొందించుకునే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది. ఇప్పటికే నాలెడ్జ్ ప్యానెల్ కలిగిన వారి వివరాలు కూడా అప్డేట్ అవుతాయి. కొత్త అవతార్, తాజా కంటెంట్, సెర్చ్ ప్రొఫైల్‌కు నేరుగా వెళ్లే లింక్ ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలో ప్రారంభించిన‌ట్లు గూగుల్ వెల్లడించింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించే ప్రణాళిక ఉందని తెలిపింది. అలాగే పబ్లిషర్లు, క్రియేటర్లు తమ పనిని మరింత సమర్థంగా ప్రదర్శించుకునేలా, సెర్చ్‌లో తమ ఉనికిని మెరుగుపరుచుకునేలా అదనపు ఫీచర్లను కూడా భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది.

Advertisement
Advertisement