Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
Google | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌పై అదిరిపోయే అప్‌డేట్స్‌ను ప్రకటించింది. గూగుల్ సెర్చ్, డిస్కవర్, గూగుల్ న్యూస్‌లో పర్సనలైజేషన్‌కు మరింత ప్రాధాన్యతను ఇస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పబ్లిషర్ల కోసం కొత్తగా ప్రిఫర్డ్ సోర్సెస్ బటన్‌ను అందించింది.
Technology | Published On Aug 22, 2026, 10.27 am IST
Google | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌పై అదిరిపోయే అప్‌డేట్స్‌ను ప్రకటించింది. గూగుల్ సెర్చ్, డిస్కవర్, గూగుల్ న్యూస్‌లో పర్సనలైజేషన్‌కు మరింత ప్రాధాన్యతను ఇస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పబ్లిషర్ల కోసం కొత్తగా ప్రిఫర్డ్ సోర్సెస్ బటన్‌ను అందించింది. అలాగే డిస్కవర్ ఫీడ్‌ను వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకునే విధంగా యూజర్లకు కంట్రోల్స్‌ను అందించింది. దీని వల్ల యూజర్లు తమకు ఇష్టమైన ప్లాట్‌ఫామ్‌లలో పబ్లిష్ అయ్యే వార్తలనే రోజూ చదవచ్చు. అవసరం లేని పబ్లిషర్లను అన్‌ఫాలో కావచ్చు. అలాగే ఆండ్రాయిడ్‌లో గూగుల్ న్యూస్ అనుభవాన్ని మరింత మెరుగు పరిచింది. గూగుల్ న్యూస్ ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లకు కావల్సిన అంశాలను యూజర్లు ముందుగానే ఎంచుకోవచ్చు. దీంతో వారికి కావల్సిన వార్తలను వినేందుకు అవకాశం ఉంటుంది.
పబ్లిషర్లకు ప్రిఫర్డ్ సోర్సెస్ బటన్..
వార్తల పబ్లిషర్లు తమ వెబ్ పేజీల్లో పొందుపరుచుకునేలా ఇంటరాక్టివ్ ప్రిఫర్డ్ సోర్సెస్ బటన్‌ను ఉపయోగించవచ్చు. పాఠకులు ఈ బటన్‌పై క్లిక్ చేస్తే ఆ సైట్ గూగుల్‌లో వారి ప్రిఫర్డ్ సోర్స్‌గా యాడ్ అవుతుంది. దీంతో వారు చూస్తున్న వెబ్ సైట్‌కు చెందిన వార్తలను డిస్కవర్ ఫీడ్‌లో ప్రతి రోజూ పొందవచ్చు. కొత్త వార్తలు ఎప్పటికప్పుడు అందులో లభిస్తాయి. అలాగే ప్రిఫర్డ్ సోర్సెస్‌గా ఎంచుకున్న వెబ్‌సైట్లకు చెందిన కంటెంట్ టాప్ స్టోరీలు, ఏఐ ఓవర్ వ్యూస్ ఏఐ మోడ్‌లో కనిపిస్తాయి. ఇప్పటికే సుమారుగా 6 లక్షల మందికి పైగా యూజర్లు ప్రిఫర్డ్ సోర్సెస్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారని, అయితే దీనికి మరిన్ని మెరుగులు దిద్దామని గూగుల్ తెలిపింది. పబ్లిషర్లు ప్రిఫర్డ్ సోర్స్ బటన్‌కు సంబంధించిన కోడ్‌ను గూగుల్ సెర్చ్ సెంట్రల్ డాక్యుమెంటేషన్ ద్వారా పొందవచ్చు.
డిస్కవర్ ఫీడ్‌కు మార్పులు..
డిస్కవర్ ఫీడ్‌కు కూడా గూగుల్ మరిన్ని మార్పులు చేసింది. పర్సనలైజ్ చేసుకునే విధంగా యూజర్లకు కొత్త కంట్రోల్స్‌ను అందిస్తోంది. దీని వల్ల యూజర్లు తమ డిస్కవర్ ఫీడ్‌లో ఏయే వెబ్‌సైట్లకు చెందిన వార్తలు కావాలో ముందుగానే నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల తమకు ఇష్టం లేని లేదా అవసరం లేని వెబ్‌సైట్లను వారు సందర్శించకుండా వ్యక్తిగతంగా కంట్రోల్ చేయవచ్చు. యూజర్లు తమ డిస్కవర్ ఫీడ్‌లో కనిపించే కంటెంట్‌పై మూడు చుక్కల మెనూను ట్యాప్ చేసి, ఏయే అంశాలు లేదా లింక్‌లను ఎక్కువగా సందర్శించాలనుకుంటున్నారో, వేటిని చూడొద్దనుకుంటున్నారో లేదా తక్కువగా చూడాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించవచ్చు. యూజర్లు తమ సొంత మాటల్లో ఈ విషయాన్ని గూగుల్‌కు చెప్పవచ్చు. దీంతో ఆపైన డిస్కవర్ ఫీడ్ యూజర్ల ఇష్టాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. యూజర్లకు కావల్సిన వనరుల నుంచే డిస్కవర్ ఫీడ్ వార్తలను అందిస్తుంది.
ప్రత్యేక ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లు..
యూజర్లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లోని గూగుల్ న్యూస్ యాప్‌లో రోజువారీ ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లను వినవచ్చు. ఇవి కూడా ముందుగా ఎంచుకున్న వార్తా వనరుల ఆధారంగానే రోజూ అందుబాటులో ఉంటాయి. అవసరం అనుకుంటే ఇందులోనూ ప్రత్యేక కంట్రోల్స్ ఇచ్చినందున యూజర్లకు ఏయే వార్తలు ఆడియో బ్రీఫింగ్ మాదిరిగా కావాలో ముందుగానే సెట్ చేయవచ్చు. దీంతో రోజూ కావల్సిన సమయంలో ఆడియో బ్రీఫింగ్‌లను వినవచ్చు. కాగా డిస్కవర్, గూగుల్ సెర్చ్‌లలో ఈ ఫీచర్లు దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. పర్సనలైజ్ చేసిన డిస్కవర్ ఫీడ్ ప్రస్తుతం చాలా మంది యూజర్లకు అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్లు యూజర్లకు లభ్యం కానున్నాయి. అలాగే పబ్లిషర్లు తమ వెబ్‌సైట్ లలో ప్రిఫర్డ్ సోర్సెస్ బటన్‌కు సంబంధించిన కోడ్‌ను ప్రస్తుతం పొందవచ్చని గూగుల్ తెలిపింది. ఇక ఆడియో న్యూస్ బ్రీఫింగ్ సదుపాయం సైతం ఇప్పటికే అందుబాటులో ఉందని గూగుల్ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
ఆగస్టు 20, 2026

Adani Group | గూగుల్‌కు పోటీగా అదానీ భారీ ప్లాన్.. ఒడిశాలో రూ.1 లక్ష కోట్ల ఏఐ డేటా సెంటర్..
ఆగస్టు 5, 2026

Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్‌ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
- ●RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
- ●Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు
- ●Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి
- ●బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి

RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం

Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు



