Google | యూట్యూబ్ సేవల అంతరాయంపై స్పందించిన గూగుల్
Google | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మంగళవారం (ఫిబ్రవరి 18, 2026) తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ అంతరాయం కారణంగా భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో యూట్యూబ్ యాప్, వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం, వీడియోలు ప్లే కాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.
Technology | Published On Feb 18, 2026, 8.30 am IST
Google | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మంగళవారం (ఫిబ్రవరి 18, 2026) తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ అంతరాయం కారణంగా భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో యూట్యూబ్ యాప్, వెబ్‌సైట్ తెరుచుకోకపోవడం, వీడియోలు ప్లే కాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. లక్షలాది మంది వినియోగదారులు ఈ అంతరాయంపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే సేవల్లో అంతరాయం ప్రారంభమైన కొద్ది సేపటికే గూగుల్ ఈ సమస్యను అధికారికంగా అంగీకరించింది. టీమ్ యూట్యూబ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ ను యాక్సెస్ చేయడంలో కొంతమందికి సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించామని, తమ బృందాలు దీనిపై పనిచేస్తున్నాయని, తాజా అప్‌డేట్‌ను తెలియజేస్తామని పేర్కొంది.
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ గణాంకాల ప్రకారం అమెరికాలో గరిష్ట స్థాయిలో 3.20 లక్షల మందికిపైగా వినియోగదారులు ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. భారత్‌లో కూడా తెల్లవారుజామున కొన్ని నిమిషాల వ్యవధిలోనే 19 వేలకుపైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త స్థాయిలోనే అంతరాయం ఏర్పడినట్టు స్పష్టమైంది. యూట్యూబ్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు సమథింగ్ వెంట్ రాంగ్ వంటి ఎర్రర్ సందేశాలు కనిపించాయని, వీడియోలు లోడ్ కావడం లేదని వినియోగదారులు తెలిపారు. అదే సమయంలో యూట్యూబ్ టీవీతో పాటు గూగుల్‌కు చెందిన మరికొన్ని సేవల్లోనూ ఫిర్యాదులు పెరగడం గమనార్హం. దీంతో ఇది యూట్యూబ్‌కే కాకుండా ప్లాట్‌ఫాం స్థాయిలో ఏర్పడిన సాంకేతిక సమస్యగా భావిస్తున్నారు. అయితే సేవలు పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరించబడతాయన్న విషయంపై యూట్యూబ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు పని చేస్తున్నాయని మాత్రమే సంస్థ వెల్లడించింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






