Google Pixel Upgrade Program | గూగుల్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ఎప్పటికీ కొత్త పిక్సల్ ఫోన్లను వాడవచ్చు..
Google Pixel Upgrade Program | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భారత్‌లోని వినియోగదారులకు గాను బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నూతనంగా పిక్సల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని వల్ల యూజర్లు పిక్సల్ ఫోన్లను నిరంతరాయంగా ఎల్లప్పుడూ వాడుతూనే ఉండవచ్చు.
Technology | Published On Dec 19, 2025, 9.43 pm IST
Google Pixel Upgrade Program | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భారత్‌లోని వినియోగదారులకు గాను బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నూతనంగా పిక్సల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని వల్ల యూజర్లు పిక్సల్ ఫోన్లను నిరంతరాయంగా ఎల్లప్పుడూ వాడుతూనే ఉండవచ్చు. ఒక ఫోన్‌ను వాడిన తరువాత కొన్ని నెలలకు అది వద్దనుకుంటే అప్పటికి విడుదలయ్యే ఇంకో కొత్త పిక్సల్ ఫోన్‌ను వాడవచ్చు. ఇందుకు గాను పలు సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అయితే సరిపోతుంది. సాధారణంగా కొత్త ఫోన్లను భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తే కొన్ని సంవత్సరాల వరకు వాటిని మార్చేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఒకవేళ మారుద్దామని చూసినా సెకండ్ హ్యాండ్ ఫోన్ అయిపోతుంది కనుక అమ్మితే డబ్బులు కూడా తక్కువ వస్తాయి. కనుక ఫోన్లను మార్చేందుకు ఎవరూ ఇష్టపడరు. అయితే గూగుల్ ప్రవేశపెట్టిన ఈ పిక్సల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు తమ పిక్సల్ ఫోన్లను సులభంగా మార్చుకుని కొత్త పిక్సల్ ఫోన్లను వాడవచ్చు. ఇలా ఈ ప్రోగ్రామ్ ప్రకారం వారు నిరంతరం కొత్త సిరీస్ పిక్సల్ ఫోన్లను వాడుతూనే ఉండవచ్చు. దీని వల్ల ఫోన్‌ను మారిస్తే విలువ కోల్పోతుందని దిగులు చెందాల్సిన పని ఉండదు. ఎల్లప్పుడూ కొత్త ఫోన్లను ఎంజాయ్ చేయవచ్చు.
జూన్ 30వ తేదీ వరకు..
గూగుల్ అందిస్తున్న ఈ పిక్సల్ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్‌కు గాను ఆ సంస్థ క్యాషిఫై, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి సంస్థలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలోనే ఈ ప్రోగ్రామ్‌లో వినియోగదారులు చేరేందుకు గాను వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును విధించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్‌లలో వినియోగదారులకు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా వినియోగదారులు ముందుగా పిక్సల్ 10 సిరీస్‌లో ఏదైనా ఫోన్‌ను 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ విధానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి గాను నెలకు రూ.3,333 ఈఎంఐ చెల్లించాలి. ఇక 9వ నెల అనంతరం 15వ నెల లోపు ఎప్పుడైనా సరే ఫోన్ వద్దని అనుకుంటే, అప్పటికి రిలీజ్ అయ్యే కొత్త పిక్సల్ ఫోన్‌ను వాడాలని అనుకుంటే ప్రస్తుతం ఉన్న పిక్సల్ ఫోన్‌ను మార్చుకోవచ్చు. ఇక అందుకు గాను అష్యూర్డ్ బైబ్యాక్ ఇస్తారు. కనుక ఫోన్‌కు తక్కువ విలువ వస్తుందని ఆందోళన చెందాల్సిన పనిలేదు.
పిక్సల్ 10 ఫోన్లకు..
ఈ క్రమంలో క్యాషిఫై వారు వినియోగదారుడికి మిగిలిన ఈఎంఐ లోన్ మొత్తం నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆ నగదుతో వినియోగదారుడు తనకు ఉన్న ఫోన్ లోన్‌ను క్లోజ్ చేయవచ్చు. ఇక కొత్త పిక్సల్ ఫోన్‌కు గాను మళ్లీ అప్పటి నుంచి 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ మొదలవుతుంది. దాన్ని మళ్లీ నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. అలా ఆ ప్లాన్ కూడా 9 నుంచి 15 నెలల మధ్య యాక్టివేట్ అవుతుంది. అప్పుడు కూడా మళ్లీ కొత్త పిక్సల్ ఫోన్‌ను అలాగే మార్చుకోవచ్చు. ఇలా ఈ పిక్సల్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. దీని వల్ల వినియోగదారులు ఎల్లప్పుడూ కొత్త పిక్సల్ ఫోన్లను వాడవచ్చు. ఇక ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ పిక్సల్ ఫోన్‌ను అయినా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం పిక్సల్ 10 సిరీస్‌లో పిక్సల్ 10, 10 ప్రొ, 10 ప్రొ ఎక్స్ఎల్, 10 ప్రొ ఫోల్డ్ ఫోన్లు ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అందుబాటులో ఉన్నాయి.
అదనపు బోనస్..
కాగా ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే కొత్త కస్టమర్లకు తమ పాత ఫోన్ ఏదైనా సరే ఎక్స్‌ఛేంజ్ చేస్తే క్యాషిఫై నుంచి రూ.7వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఇస్తారు. అలాగే వినియోగదారులు ఈ ప్రోగ్రామ్‌లో చేరిన అనంతరం 30 రోజుల లోపు తమ ఫోన్‌ను క్యాషిఫై వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా పిక్సల్ ఫోన్‌కు ఎలాంటి డ్యామేజ్ అయినా తీసుకుంటారు. కానీ ఫోన్ మాత్రం పనిచేసే కండిషన్‌లో ఉండాలి. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను వాడాలని అనుకునే వారికి గూగుల్ అందిస్తున్న ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





