త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Pixel 10a | గూగుల్ పిక్స‌ల్ 10ఎ ఫోన్ వ‌చ్చేసింది.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ధ‌ర ఎంతంటే..?

Google Pixel 10a | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ పిక్స‌ల్ 10ఎ ను విడుద‌ల చేసింది. భార‌త్‌తోపాటు ప్ర‌పంచ వ్యాప్త మార్కెట్‌ల‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేయ‌గా, పిక్స‌ల్ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 19, 2026, 1.54 pm IST

Google Pixel 10a | గూగుల్ పిక్స‌ల్ 10ఎ ఫోన్ వ‌చ్చేసింది.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

Google Pixel 10a | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ పిక్స‌ల్ 10ఎ ను విడుద‌ల చేసింది. భార‌త్‌తోపాటు ప్ర‌పంచ వ్యాప్త మార్కెట్‌ల‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేయ‌గా, పిక్స‌ల్ సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. అలాగే సూర్య‌కాంతిలోనూ స్ప‌ష్టంగా వీక్షించేలా ఈ ఫోన్ కు 3000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్ నెస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన పిక్స‌ల్ 9ఎ ఫోన్ డిస్‌ప్లే క‌న్నా ఈ ఫోన్ డిస్‌ప్లే 11 శాతం ప్ర‌కాశ‌వంతంగా ఉంటుంద‌ని గూగుల్ తెలిపింది. ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు.

7 ఏళ్ల వ‌ర‌కు సాఫ్ట్‌వేర్ స‌పోర్ట్‌..

పిక్స‌ల్ 10ఎ ఫోన్‌లో గూగుల్ సొంత టెన్సార్ జి4 చిప్‌సెట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌ను కూడా క‌లిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ డిఫాల్ట్‌గా వ‌స్తుంది. 7 ఏళ్ల వ‌ర‌కు సాఫ్ట్‌వేర్ స‌పోర్ట్‌ను అందిస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. సాఫ్ట్‌వేర్ స‌పోర్ట్‌లో భాగంగా సెక్యూరిటీ అప్‌డేట్స్‌, ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఉంటాయ‌ని వెల్ల‌డించింది. కాగా అమెరికాలో ఈ ఫోన్‌లో శాటిలైట్ ఓఎస్ఎస్‌ను అందిస్తున్నారు. దీనివ‌ల్ల మొబైల్‌ నెట్‌వ‌ర్క్ లేని చోట నేరుగా శాటిలైట్‌కు క‌నెక్ట్ అయి ఎమ‌ర్జెన్సీ స‌హాయం పొంద‌వ‌చ్చు. పిక్స‌ల్ 10ఎ ఫోన్‌ను ఆబ్సిడియ‌న్‌, ఫాగ్‌, లావెండ‌ర్‌, బెర్రీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేశారు. ఇది ఐపీ68 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్‌ను కూడా క‌లిగి ఉంది.

భారీ బ్యాట‌రీ..

పిక్స‌ల్ 10ఎ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా, మ‌రో 13 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెకండ‌రీ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ కెమెరాల‌న్నింటి స‌హాయంతో 4కె వీడియోల‌ను చిత్రీక‌రించుకోవ‌చ్చు. ఆటో బెస్ట్ టేక్ అనే ఫీచ‌ర్ స‌దుపాయంతో ఫొటోలు, వీడియోల‌ను అత్యుత్త‌మ క్వాలిటీతో ఆక‌ర్ష‌ణీయంగా వచ్చేలా చిత్రీక‌రించుకోవ‌చ్చు. ఈ ఫోన్‌లో 5100 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా ఇది 30 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంద‌ని కంపెనీ తెలిపింది. అలాగే 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. క‌నుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. 23 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌కు కూడా ఇందులో సపోర్ట్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు. ఒక‌టి ఫిజిక‌ల్‌గా మ‌రొక‌టి నానో సిమ్‌గా పనిచేస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6ఇ, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి స‌దుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

గూగుల్ పిక్స‌ల్ 10ఎ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ మాత్ర‌మే ప్ర‌స్తుతం అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధ‌రను రూ.49,999 గా నిర్ణ‌యించారు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు గూగుల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. మార్చి 6 నుంచి దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన రిటెయిల్ స్టోర్స్‌లలో ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్‌పై జీరో డౌన్ పేమెంట్‌, జీరో ఇంట్రెస్ట్‌, సుల‌భ‌మైన ఈఎంఐ ప్లాన్లు వంటి ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.3వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఇస్తారు. 24 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అద‌నంగా మ‌రో రూ.3వేల బోన‌స్‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement