త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google Pixel 10 | గూగుల్ పిక్స‌ల్ 10 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.55వేల క‌న్నా త‌క్కువ‌కే..

Google Pixel 10 | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న పిక్స‌ల్ 10 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రూ.79,999 ప్రారంభ ధ‌ర‌కు లాంచ్ అయింది. ప్ర‌స్తుతం ఫ్లాట్ డిస్కౌంట్ అనంత‌రం ఈ ఫోన్ రూ.74,999కు అందుబాటులో ఉంది.

S

Technology | Published On Apr 12, 2026, 3.12 pm IST

Google Pixel 10 | గూగుల్ పిక్స‌ల్ 10 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.55వేల క‌న్నా త‌క్కువ‌కే..
Advertisement

Google Pixel 10 | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న పిక్స‌ల్ 10 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రూ.79,999 ప్రారంభ ధ‌ర‌కు లాంచ్ అయింది. ప్ర‌స్తుతం ఫ్లాట్ డిస్కౌంట్ అనంత‌రం ఈ ఫోన్ రూ.74,999కు అందుబాటులో ఉంది. అయితే ఇదే కాకుండా ప‌లు ఇత‌ర ఆఫ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌పై వ‌ర్తింప‌జేస్తే వినియోగ‌దారులు ఈ ఫోన్‌ను రూ.55వేల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌పై బ్యాంకు డిస్కౌంట్ల‌తోపాటు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌, ఎక్స్‌ఛేంజ్ బోన‌స్‌ను కూడా ఇస్తున్నారు. దీంతో ఫోన్ ధ‌ర భారీగా త‌గ్గుతుంది.

డిస్కౌంట్ ఇలా పొందండి..

ఫ్లాట్ డిస్కౌంట్ అనంత‌రం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్స‌ల్ 10కు చెందిన 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ రూ.74,999 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌తోనూ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ప‌లు ఎంపిక చేసిన హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్‌ను కొంటే రూ.4వేల డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులు ఉన్న వినియోగ‌దారులు త‌మ కార్డుకు ముందుగా డిస్కౌంట్ ఆఫ‌ర్ ఉందా, లేదా అన్న విష‌యాన్ని సైట్‌లో చెక్ చేసి నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ డిస్కౌంట్ అనంత‌రం పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై కూడా రాయితీని ఇస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గ‌రిష్టంగా రూ.52వేలు ఇస్తారు. అయితే గూగుల్‌కు చెందిన పిక్స‌ల్ 7 ఫోన్‌ను వాడుతున్న వారు ఫోన్‌ను అప్ గ్రేడ్ చేయాల‌ని భావిస్తే ఆ మోడ‌ల్‌కు రూ.15వేల‌ను ఎక్స్‌ఛేంజ్ ధ‌ర కింద ఇస్తున్నారు. ఇక మ‌రో రూ.5వేల ఎక్స్‌ఛేంజ్ బోన‌స్ కూడా ల‌భిస్తోంది. దీంతో ఫోన్ ధ‌ర భారీగా త‌గ్గుతుంది. ఈ రాయితీల అనంత‌రం ఫోన్ ధ‌ర‌ రూ.50,999 కు చేరుతుంది. ఇలా ఈ ఫోన్ రూ.55వేల క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంది.

అద్భుత‌మైన ఫీచర్లు..

గూగుల్ పిక్స‌ల్ 10 ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో వినియోగ‌దారుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొంది. ఇందులో ప‌లు ఆకర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసిన టెన్సార్ జి5 ప్రాసెస‌ర్ ఉండ‌గా, ఏఐ ఆధారిత సేవ‌ల‌ను అందించ‌డంలో వేగంగా ప‌నిచేస్తుంది. అలాగే రోజువారి పనులు కూడా వేగంగా నిర్వ‌హించుకోవ‌చ్చు. ఇందులో 6.3 ఇంచుల ఓలెడ్ ఆక్చువా డిస్‌ప్లేను ఇచ్చారు. డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది క‌నుక అద్భుత‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. 4970 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో ఇచ్చారు. ఫుల్‌గా చార్జింగ్ చేస్తే సాధార‌ణ వాడ‌కానికి ఒక రోజు మొత్తం బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంద‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 13 మెగాపిక్స‌ల్ సెకండ‌రీ కెమెరాను, 10.8 మెగాపిక్స‌ల్ అడిష‌న‌ల్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 10.5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. పాత ఫోన్‌ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త ఫోన్‌కు మారాల‌ని చూస్తున్న వారికి ఇది అద్భుత‌మైన ఆఫ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు.

Advertisement
Advertisement