Google Maps | గూగుల్ మ్యాప్స్‌లో భారీ అప్‌డేట్.. హిందీలో అడగొచ్చు.. జీమెయిల్‌తో సెక్యూర్ కనెక్షన్..
Google Maps | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌కు గాను భారీ అప్‌డేట్స్‌ను ప్రకటించింది. కొత్తగా ఆస్క్ మ్యాప్స్ పేరిట అప్‌డేట్స్‌ను ఇవ్వడంతోపాటు హిందీ భాషకు సపోర్ట్‌ను అందించారు. పర్సనల్ ఇంటెలిజెన్స్, కన్వర్జేషన్ హిస్టరీ, రియల్‌టైం పబ్లిక్ ట్రాన్సిట్ సమాచారం తదితర కొత్త ఫీచర్లు ఈ నూతన అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
Technology | Published On Aug 8, 2026, 10.06 am IST
Google Maps | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌కు గాను భారీ అప్‌డేట్స్‌ను ప్రకటించింది. కొత్తగా ఆస్క్ మ్యాప్స్ పేరిట అప్‌డేట్స్‌ను ఇవ్వడంతోపాటు హిందీ భాషకు సపోర్ట్‌ను అందించారు. పర్సనల్ ఇంటెలిజెన్స్, కన్వర్జేషన్ హిస్టరీ, రియల్‌టైం పబ్లిక్ ట్రాన్సిట్ సమాచారం తదితర కొత్త ఫీచర్లు ఈ నూతన అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చాయి. జెమిని ఏఐ సహాయంతో మ్యాప్స్ డేటాతో కలిపి డిజైన్ చేసిన ఆస్క్ మ్యాప్స్ ద్వారా యూజర్లు తమ సహజ భాషలో సంభాషణలు కొనసాగించవచ్చు. ప్రదేశాలు, మార్గాలు, ప్రయాణ ప్రణాళికలు, స్థానిక సమాచారం గురించి ప్రశ్నలు అడిగి సమాధానాలను పొందవచ్చు. భారత్‌లోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా హిందీ భాష సపోర్ట్‌ను ఇచ్చారు. దీని వల్ల యూజర్లు ఈ భాషలోనే ఆస్క్ మ్యాప్స్‌ను ఉపయోగించవచ్చు. హిందీలో ప్రశ్నలు అడిగితే సహజమైన రీతిలో సమాధానాలు ఇస్తుంది.
హిందీలో అడగొచ్చు..
హిందీలో ఆస్క్ మ్యాప్స్‌ను ప్రశ్నలు అడగడం ద్వారా కొత్త ప్రదేశాలను గుర్తించడం, ప్రయాణ మార్గాలను ప్లాన్ చేయడం, స్థానిక సమాచారం తెలుసుకోవడం మరింత సులభతరం అవుతుంది. మ్యాప్స్‌లో పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను నూతనంగా అందిస్తున్నారు. దీని వల్ల యూజర్లు తమ జీమెయిల్ ఖాతాలను సురక్షితంగా మ్యాప్స్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీంతో జీమెయిల్‌లో ఉండే విమాన టిక్కెట్ బుకింగ్‌లు, హోటల్ రిజర్వేషన్లు, డిన్నర్ బుకింగ్స్ తదితర వివరాలను ఉపయోగించి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సూచనలు ఇస్తుంది. ఉదాహరణకు.. ఒక నగరానికి ప్రయాణిస్తున్న యూజర్ విమానం బయలుదేరే ముందు హోటల్ సమీపంలో ఏం చేయవచ్చని అడిగితే, జీమెయిల్‌లోని హోటల్ రిజర్వేషన్ వివరాల ఆధారంగా సమీపంలోని టూరిస్టు ప్లేస్‌లను సూచిస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టుకు ఎప్పుడు బయల్దేరాలో చెబుతుంది. అయితే జీమెయిల్ కనెక్షన్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుంది. దీన్ని యూజర్లు తమ ఇష్టం ప్రకారం ఆఫ్ లేదా ఆన్ చేయవచ్చు. భవిష్యత్తులో క్యాలెండర్ వంటి ఇతర యాప్‌లకు కూడా ఈ సపోర్ట్‌ను విస్తరిస్తామని గూగుల్ తెలిపింది.
గతంలో జరిగిన సంభాషణలతో..
కన్వర్జేషన్ హిస్టరీ ఫీచర్ సహాయంతో గతంలో జరిగిన సంభాషణలను గుర్తుంచుకుంటుంది. హిస్టరీ సెట్టింగ్స్‌ను ఆన్ చేస్తే, గతంలో అడిగిన ప్రశ్నలు లేదా ఇచ్చిన సిఫారసులను తిరిగి గుర్తు చేసి అదే ప్రణాళికను అక్కడి నుంచే కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు.. సియాటిల్ ట్రిప్ కోసం గతంలో సూచించిన కార్యక్రమాలను మళ్లీ గుర్తు చేయమని అడిగితే, కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం ఉండదు. పాత సమాచారాన్నే తిరిగి చూపిస్తుంది. దీంతో ఏఐ టోకెన్లు సేవ్ అవుతాయి. ఆస్క్ మ్యాప్స్ ఇక ప్రయాణానికి ముందు అవసరమైన రియల్‌టైం సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇందులో ప్రయాణ మార్గాల్లో ఉండే ట్రాఫిక్ పరిస్థితులు, రోజువారీ ప్రయాణ సమాచారం, వాతావరణ అప్‌డేట్స్, రెస్టారెంట్ల వద్ద ఏర్పడుతున్న రద్దీ, ప్రత్యక్ష పబ్లిక్ ట్రాన్సిట్ సమాచారం లభిస్తుంది.
ట్రాన్సిట్ విడ్జెట్..
కొత్తగా అందించిన ట్రాన్సిట్ విడ్జెట్ సహాయంతో బస్సులు, మెట్రో, రైళ్లకు సంబంధించిన ప్రత్యక్ష షెడ్యూల్స్, ఆలస్య వివరాలు, కనెక్టింగ్ ట్రాన్సిట్ ఆప్షన్లు, సేవలు ఆలస్యమైనప్పుడు తాజా వేచి ఉండే సమయం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. ఐఎస్‌బీటీ కాశ్మీరీ గేట్ వద్ద అందుబాటులో ఉన్న తదుపరి బస్సులు, స్థానిక బస్సులు, మెట్రో సేవలు వంటి మల్టీ మోడల్ ట్రాన్సిట్ వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కాగా గూగుల్ మ్యాప్స్‌లో హిందీ భాషకు సపోర్ట్, పర్సనల్ ఇంటెలిజెన్స్, కన్వర్జేషన్ హిస్టరీ, రియల్‌టైం పబ్లిక్ ట్రాన్సిట్ సమాచారం తదితర ఆస్క్ మ్యాప్స్ ఫీచర్లను ప్రస్తుతం దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు. అందువల్ల ఈ ఫీచర్లన్నీ యూజర్లకు లభించేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం






