ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్‌బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
ASUS Chromebook CX15 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ భారత్ లో తన నూతన క్రోమ్‌బుక్ మోడల్‌ను లాంచ్ చేసింది. అసుస్ క్రోమ్‌బుక్ సీఎక్స్15 పేరిట ఈ ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్, మొదటిసారి ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ డివైస్‌ను తీసుకొచ్చింది.
Technology | Published On Aug 6, 2026, 1.09 pm IST
ASUS Chromebook CX15 | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ భారత్ లో తన నూతన క్రోమ్‌బుక్ మోడల్‌ను లాంచ్ చేసింది. అసుస్ క్రోమ్‌బుక్ సీఎక్స్15 పేరిట ఈ ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్, మొదటిసారి ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ డివైస్‌ను తీసుకొచ్చింది. ఇది క్రోమ్ ఓఎస్ పై పనిచేస్తూ ఉత్పాదకత, విద్య, వినోదం కోసం గూగుల్ ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ గూగుల్ ఎకోసిస్టమ్‌తో సమగ్రంగా అనుసంధానమై ఉంటుంది. పరిశోధన, ప్రజెంటేషన్లు రూపొందించడం, ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం, వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, టీమ్ సహకారం వంటి పనులను సులభంగా నిర్వహించేందుకు రూపొందించారు.
మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో..
అసుస్ క్రోమ్‌బుక్ సీఎక్స్15లో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ నానోఎడ్జ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్, యాంటీ గ్లేర్ ప్యానెల్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ బరువు 1.59 కిలోలు కాగా, జపాన్ సంప్రదాయ వాషి పేపర్ నుంచి ప్రేరణ పొందిన ప్యూర్ గ్రే రంగులో అందుబాటులోకి వచ్చింది. యూఎస్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ప్రమాణాలను ఇది అందుకుంది. డిజైన్‌లో రీసైకిల్ చేసిన పదార్థాలను కూడా ఉపయోగించారు. ఈ డివైస్‌లో ఇంటెల్ ఎన్50 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 12.5 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అలాగే 45 వాట్ల యూఎస్‌బీ టైప్ సి ఫాస్ట్ చార్జర్‌ను కూడా అందిస్తున్నారు.
గూగుల్ ఏఐ ప్రొ ఫ్రీ..
ఈ క్రోమ్‌బుక్‌తో మూడు నెలల గూగుల్ ఏఐ ప్రొ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నారు. దీని ద్వారా జెమిని జీమెయిల్, డాక్స్, షీట్స్, జెమిని నోట్‌బుక్ ఏఐ ఫీచర్లు, 5 టెరాబైట్ల క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ ఫ్లో ద్వారా ఏఐ ఆధారిత వీడియోల క్రియేషన్, గూగుల్ ఫొటోస్ అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ టూల్స్, నానో బనానా ఇమేజ్ జనరేషన్, యూట్యూబ్ ప్రీమియం లైట్ వంటి సేవలను వినియోగించుకోవచ్చు. భద్రత పరంగా ఈ ల్యాప్‌టాప్‌లో టైటాన్ సి సెక్యూరిటీ చిప్‌ను అందించారు. ఇది హార్డ్‌వేర్ స్థాయిలో రక్షణ కల్పిస్తుంది. క్రోమ్ ఓఎస్ ద్వారా ఆటోమేటిక్ సెక్యూరిటీ అప్‌డేట్లు, సైబర్ ముప్పుల నుంచి ఇంటర్నల్‌గా రక్షణ లభిస్తుంది. అలాగే వినియోగదారుల గోప్యత కోసం ఫిజికల్ వెబ్‌క్యామ్ ప్రైవసీ షటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ధర వివరాలు..
క్రోమ్‌బుక్ సీఎక్స్15 ధర రూ. 47,990 ఉండగా, ఇది అసుస్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఆర్‌ఓజీ స్టోర్లు, అసుస్ అధీకృత రిటైల్ భాగస్వాములు, రిలయన్స్ డిజిటల్, అసుస్ ఈ-షాప్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. వినియోగదారులకు సులభ చెల్లింపుల కోసం నెలకు రూ. 3,999 నుంచి ప్రారంభమయ్యే సున్నా శాతం నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా సంస్థ అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌పై ఒక సంవత్సరం స్టాండర్డ్ వారంటీతోపాటు ఒక సంవత్సరం యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా లభిస్తోంది.
సంబంధిత వార్తలు

Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన గూగుల్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయాయి..
సెప్టెంబర్ 22, 2026

Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్సైట్లను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..
సెప్టెంబర్ 19, 2026

ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధరలు ఎంతంటే..?
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
- ●Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!
- ●Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
- ●Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
- ●Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..

Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!



