త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lyria 3 | జెమిని ఏఐలో ఇక మ్యూజిక్ జ‌న‌రేట్ చేయొచ్చు.. గూగుల్ నుంచి కొత్త ఏఐ టూల్‌..

Lyria 3 | జ‌న‌రేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌నంగా అనేక టూల్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి. అవ‌న్నీ వినియోగ‌దారుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు స‌హాయం చేస్తున్నాయి.

S

Technology | Published On Feb 22, 2026, 2.07 pm IST

Lyria 3 | జెమిని ఏఐలో ఇక మ్యూజిక్ జ‌న‌రేట్ చేయొచ్చు.. గూగుల్ నుంచి కొత్త ఏఐ టూల్‌..
Advertisement

Lyria 3 | జ‌న‌రేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌నంగా అనేక టూల్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి. అవ‌న్నీ వినియోగ‌దారుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ప‌నుల‌ను వేగంగా పూర్తి చేసేందుకు స‌హాయం చేస్తున్నాయి. ఏఐ ప్లాట్‌ఫామ్‌లు త‌ర‌చూ నూత‌న టూల్స్‌ను అందుబాటులోకి తెస్తూ త‌మ ప‌రిధిని మ‌రింత మంది యూజ‌ర్ల‌కు విస్త‌రిస్తున్నాయి. అందులో భాగంగానే టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా త‌న జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో మ‌రో నూత‌న టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. లైరియా 3 (Lyria) పేరిట ఈ టూల్ ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. ఈ మేర‌కు గూగుల్ త‌న అధికారిక బ్లాగ్‌లో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఏ రూపంలో అయినా ప్రాంప్ట్‌..

జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్ లో అందుబాటులో ఉన్న లైరియా 3 టూల్ ద్వారా యూజ‌ర్లు 30 సెక‌న్ల నిడివి గ‌ల మ్యూజిక్‌ను సృష్టించ‌వ‌చ్చు. యూజ‌ర్లు ఇచ్చే ప్రాంప్ట్‌ల‌కు అనుగుణంగా ఈ టూల్ మ్యూజిక్‌ను జ‌న‌రేట్ చేసి ఇస్తుంది. యూజ‌ర్లు టెక్ట్స్‌, ఆడియో, వీడియో, ఇమేజ్ రూపంలో ఇన్ పుట్ ఇవ్వ‌వ‌చ్చు. అందుకు త‌గిన‌ట్లు లైరియా 3 ఆటోమేటిగ్గా మ్యూజిక్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. ప్ర‌స్తుతానికి ఈ టూల్ ద్వారా త‌క్కువ నిడివి ఉన్న మ్యూజిక్‌ను జ‌న‌రేట్ చేసేందుకు మాత్ర‌మే వీలుంటుంద‌ని, దీన్ని వ్య‌క్తిగ‌త మ్యూజిక్ క్రియేష‌న్ అవ‌స‌రాల‌కు వాడుకోవ‌చ్చ‌ని గూగుల్ తెలిపింది.

30 సెక‌న్ల నిడివి మాత్ర‌మే..

గూగుల్ త‌న డీప్ మైండ్ టెక్నాల‌జీ ద్వారా అభివృద్ధి చేసిన జ‌న‌రేటివ్ మ్యూజిక్ మోడ‌ల్ లైరియా 3 కాగా ఇది ప్ర‌స్తుతం బీటా ద‌శ‌లో ఉంది. జెమిని ప్లాట్‌ఫామ్‌లో దీన్ని యూజ‌ర్లు ఉప‌యోగించుకోవ‌చ్చు. కేవ‌లం 30 సెక‌న్ల నిడివి క‌లిగిన మ్యూజిక్‌ను జ‌న‌రేట్ చేసేందుకు మాత్ర‌మే ప్ర‌స్తుతం అనుమ‌తి ఉంది. ఈ టూల్ స‌హాయంతో వినియోగ‌దారులు ఆటోమేటిగ్గా లిరిక్స్‌ను జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. మ్యూజిక్‌లో జోన‌ర్‌, టెంపో, ఎన‌ర్జీ లెవ‌ల్స్‌, వోక‌ల్ స్టైల్‌, మూడ్‌, నెరేటివ్ వంటి అంశాల‌ను ప్రాంప్ట్‌లో ఇచ్చి అందుకు అనుగుణంగా మ్యూజిక్ జ‌న‌రేట్ అయ్యేలా టూల్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఏఐ జ‌న‌రేట్ చేసిన మ్యూజిక్ అన్న ఫీలింగ్ క‌ల‌గ‌దు. ఇక ఈ లైరియా 3 టూల్‌ను త్వ‌ర‌లోనే యూట్యూబ్ క్రియేట‌ర్ల‌కు కూడా ఇన్‌బిల్ట్‌గా అందిస్తామ‌ని, దీనికి రానున్న రోజుల్లో మ‌రిన్ని మెరుగులు దిద్దుతామ‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement