Google | గూగుల్ నుంచి జెమిని 3.6 ఫ్లాష్.. ఏఐ ఏజెంట్ల కోసం మూడు కొత్త మోడళ్లు..
Google | గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా జెమిని 3.6 ఫ్లాష్, జెమిని 3.5 ఫ్లాష్-లైట్, జెమిని 3.5 ఫ్లాష్ సైబర్ పేర్లతో మూడు కొత్త ఏఐ మోడళ్లను లాంచ్ చేసింది. ఏఐ ఏజెంట్ వర్క్‌ఫ్లోల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మోడళ్లు టోకెన్ సామర్థ్యం, తక్కువ లేటెన్సీ, మెరుగైన పనితీరుతో వస్తున్నాయని కంపెనీ తెలిపింది.
Technology | Published On Jul 22, 2026, 3.40 pm IST
Google | గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా జెమిని 3.6 ఫ్లాష్, జెమిని 3.5 ఫ్లాష్-లైట్, జెమిని 3.5 ఫ్లాష్ సైబర్ పేర్లతో మూడు కొత్త ఏఐ మోడళ్లను లాంచ్ చేసింది. ఏఐ ఏజెంట్ వర్క్‌ఫ్లోల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మోడళ్లు టోకెన్ సామర్థ్యం, తక్కువ లేటెన్సీ, మెరుగైన పనితీరుతో వస్తున్నాయని కంపెనీ తెలిపింది. గూగుల్ జెమిని టీమ్ తరఫున ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ తుల్సీ దోషి మాట్లాడుతూ ప్రొడక్షన్ స్థాయిలో ఏఐ ఏజెంట్లను రూపొందిస్తున్న డెవలపర్లు, సంస్థలకు అధిక టోకెన్ సామర్థ్యం, తక్కువ లేటెన్సీ, స్థిరమైన పనితీరు అవసరమని తెలిపారు. జెమిని 3.5 ఫ్లాష్ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త మోడళ్లు కోడింగ్, నాలెడ్జ్ వర్క్, మల్టీమోడల్ ప్రాసెసింగ్, ఏజెంట్ వర్క్‌ఫ్లోలు, సైబర్ సెక్యూరిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
కోడింగ్, నాలెడ్జ్ వర్క్, మల్టీ మోడల్ పనుల కోసం..
జెమిని 3.6 ఫ్లాష్‌ను కోడింగ్, నాలెడ్జ్ వర్క్, మల్టీమోడల్ పనుల కోసం రూపొందించారు. ఆర్టిఫిషియల్ అనాలిసిస్ ఇండెక్స్ ప్రకారం జెమిని 3.5 ఫ్లాష్‌తో పోలిస్తే ఈ మోడల్ అవుట్‌పుట్ టోకెన్ వినియోగాన్ని 17 శాతం వరకు తగ్గించింది. అలాగే డేటాకర్వ్‌కు చెందిన డీప్‌ఎస్‌డబ్ల్యూఈ బెంచ్‌మార్క్‌లలో కొన్ని పరీక్షల్లో 65 శాతం వరకు మెరుగుదల నమోదైనట్లు గూగుల్ వెల్లడించింది. ఈ మోడల్ ధరలు ప్రతి 10 లక్షల ఇన్‌పుట్ టోకెన్లకు 1.50 డాలర్లు, ప్రతి 10 లక్షల అవుట్‌పుట్ టోకెన్లకు 7.50 డాలర్లుగా నిర్ణయించింది. జెమిని 3.5 ఫ్లాష్-లైట్‌ను తక్కువ లేటెన్సీ, అధిక త్రూపుట్ అవసరాల కోసం రూపొందించారు. ముఖ్యంగా ఏజెంటిక్ సెర్చ్, డాక్యుమెంట్ ప్రాసెసింగ్ వంటి పనులకు ఇది అనుకూలంగా ఉంటుందని గూగుల్ తెలిపింది. ఆర్టిఫిషియల్ అనాలిసిస్ ప్రకారం ఈ మోడల్ సెకనుకు 350 అవుట్‌పుట్ టోకెన్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ధరలు ప్రతి 10 లక్షల ఇన్‌పుట్ టోకెన్లకు 0.30 డాలర్లు, ప్రతి 10 లక్షల అవుట్‌పుట్ టోకెన్లకు 2.50 డాలర్లుగా ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ కోసం మరో మోడల్..
సైబర్ సెక్యూరిటీ అవసరాల కోసం గూగుల్ జెమిని 3.5 ఫ్లాష్ సైబర్ మోడల్‌ను కూడా పరిచయం చేసింది. ఇది కోడ్‌మెండర్ కోడ్ సెక్యూరిటీ ఏజెంట్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. జెమిని 3.5 ఫ్లాష్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను గుర్తించడం, ధ్రువీకరించడం, వాటిని సరిచేయడం కోసం ప్రత్యేకంగా ఫైన్-ట్యూన్ చేశారు. కోడ్‌మెండర్‌లో అనేక జెమిని 3.5 ఫ్లాష్ సైబర్ ఏజెంట్లు కలిసి సమగ్ర భద్రతా నివేదికను రూపొందిస్తాయని, సైబర్‌జిమ్ బెంచ్‌మార్క్‌లో పోటీ స్థాయి పనితీరు కనబరిచినట్లు గూగుల్ వెల్లడించింది. జెమిని 3.6 ఫ్లాష్, జెమిని 3.5 ఫ్లాష్-లైట్ మోడళ్లు బుధవారం నుంచే గూగుల్ ఏఐ స్టూడియో, ఆండ్రాయిడ్ స్టూడియో ద్వారా జెమిని ఏపీఐలో, అలాగే జెమిని ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చాయి. జెమిని 3.6 ఫ్లాష్ గూగుల్ యాంటీగ్రావిటీ, జెమిని ఎంటర్‌ప్రైజ్ యాప్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. జెమిని 3.5 ఫ్లాష్-లైట్‌ను జెమిని యాప్, గూగుల్ సెర్చ్ ద్వారా దశలవారీగా విడుదల చేస్తున్నారు. జెమిని 3.5 ప్రొ ప్రస్తుతం భాగస్వాములతో పరీక్షల దశలో ఉందని, త్వరలో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది.
తాజావార్తలు
- ●Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- ●BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- ●Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
- ●OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క
- ●99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్

Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?






