Anthropic | ఆంథ్రోపిక్ నుంచి రెండు పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్.. వేయి ఏఐ ఏజెంట్లను ఒకేసారి వాడొచ్చు..
Anthropic | ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ ఫేబుల్ 5.2, క్లాడ్ మైథోస్ 5.2 పేర్లతో రెండు అధునాతన కృత్రిమ మేధ మోడళ్లను విడుదల చేసింది. కోడింగ్, గణిత విశ్లేషణ, సైబర్ భద్రత, శాస్త్రీయ పరిశోధన, రోబోటిక్స్ రంగాల్లో మెరుగైన సామర్థ్యాలతో వీటిని రూపొందించింది. ఫేబుల్ సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండగా, మైథోస్‌ను ధ్రువీకరించిన సంస్థలకు మాత్రమే పరిమితం చేసింది.
Technology | Published On Nov 10, 2026, 4.33 pm IST
Anthropic | ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ ఫేబుల్ 5.2, క్లాడ్ మైథోస్ 5.2 పేర్లతో రెండు అధునాతన కృత్రిమ మేధ మోడళ్లను విడుదల చేసింది. కోడింగ్, గణిత విశ్లేషణ, సైబర్ భద్రత, శాస్త్రీయ పరిశోధన, రోబోటిక్స్ రంగాల్లో మెరుగైన సామర్థ్యాలతో వీటిని రూపొందించింది. ఫేబుల్ సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండగా, మైథోస్‌ను ధ్రువీకరించిన సంస్థలకు మాత్రమే పరిమితం చేసింది.
రోజుల తరబడి స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం..
సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, గంటల నుంచి రోజులపాటు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాలను ఈ మోడళ్లలో అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ రెండు మోడళ్లు ప్రాథమికంగా ఒకే ఏఐ మోడల్‌పై ఆధారపడినప్పటికీ, వాటి భద్రతా పరిమితులు, వినియోగ అనుమతుల్లో తేడాలు ఉన్నాయి. సైబర్ భద్రత, జీవశాస్త్ర పరిశోధన వంటి సున్నితమైన రంగాల్లో దుర్వినియోగాన్ని నిరోధించే అదనపు రక్షణ వ్యవస్థలతో ఫేబుల్ 5.2ను సాధారణ వినియోగదారులు, వ్యాపార సంస్థల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ బెడ్‌రాక్ వంటి క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ మోడల్‌ను అందించనున్నట్లు తెలిపింది. మరోవైపు మైథోస్ 5.2ను అధునాతన సైబర్ భద్రత, జీవశాస్త్ర పరిశోధనల్లో ఉపయోగించే ధ్రువీకరించిన సంస్థలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అందించనుంది.
1 వేయి ఏఐ ఏజెంట్లను ఒకేసారి వాడొచ్చు..
కోడింగ్, స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ల సామర్థ్యాల్లో ఈ మోడళ్లు గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను నిర్వహించడం, ఒకేసారి పలు ఏఐ ఏజెంట్లను సమన్వయం చేయడం వీటి ప్రత్యేకతలుగా పేర్కొంది. ఫేబుల్ 5.2తో ఇంజినీర్లు ఒక కీలకమైన ప్రొడక్షన్ సర్వీస్‌ను పైథాన్ నుంచి రస్ట్ ప్రోగ్రామింగ్ భాషలోకి మార్చినట్లు సంస్థ తెలిపింది. ఈ మార్పుతో సదరు సర్వీస్ పనితీరు, విశ్వసనీయత మెరుగుపడడంతోపాటు ప్రారంభమయ్యే వేగం సుమారు 26 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1వేయి ఏఐ ఏజెంట్లను ఉపయోగించి 30 గంటల్లో ఫెర్మాట్ చివరి సిద్ధాంతానికి సంబంధించిన గణిత రుజువును అధికారిక రూపంలో రూపొందించినట్లు వెల్లడించింది. మూడు పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పన, అనుకరణ రోబోటిక్స్ పనుల్లో పనితీరు మెరుగుదల, బ్లాక్ హోల్స్‌కు సంబంధించిన సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనల్లోనూ ఈ మోడళ్లు సహకరించినట్లు తెలిపింది.
ఛార్జీలు ఎంతంటే..
ధరల విషయానికి వస్తే.. ప్రతి మిలియన్ ఇన్‌పుట్ టోకెన్లకు 8 డాలర్లు, ప్రతి మిలియన్ అవుట్‌పుట్ టోకెన్లకు 40 డాలర్లుగా ఆంథ్రోపిక్ నిర్ణయించింది. అదనంగా వేగవంతమైన మోడ్‌ను ఎంచుకుంటే సాధారణ వేగంతో పోలిస్తే 2.5 రెట్ల వరకు త్వరగా సమాధానాలు పొందవచ్చని, ఇందుకు అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపింది. విడుదలకు ముందు విస్తృతమైన భద్రతా పరీక్షలు నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది. సాధారణ కోడింగ్, సమాచార ఆధారిత పనుల కోసం ఒపస్ మోడళ్లను కొనసాగిస్తూ, మరింత క్లిష్టమైన సాంకేతిక, పరిశోధనా అవసరాల కోసం ఫేబుల్, మైథోస్ మోడళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.
సంబంధిత వార్తలు

Nvidia | ఎన్విడియా సీఈఓ చేసిన తప్పు.. సంస్థకు భారీ నష్టం.. 1.57 లక్షల కోట్ల డాలర్లు ఆవిరి..
నవంబర్ 10, 2026

Cisco | 27 ఏళ్ల యువ ఇంజనీర్‌కు సిస్కో భారీ బాధ్యత.. రెండేళ్లలో 98 శాతం కోడ్ మార్పు..
నవంబర్ 3, 2026

Elon Musk | గ్రోక్ వినియోగదారులకు షాక్.. త్వరగా ముగుస్తున్న పరిమితులు.. మస్క్ ఏమన్నారంటే..?
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం
- ●Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి
- ●Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే
- ●Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు
- ●Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల - మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి...
- ●Wipro | ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఐటీ షేర్లను కొని పెట్టుకోవాలన్న సిటీ గ్రూప్..

Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం

Bhatti Vikramarka | కరువు కాలంలో రైతులకు భరోసా ఇవ్వండి

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS కనీసం స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొనలేదు : ప్రియాంక్ ఖర్గే

Maheshkumar Godu | భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నారు



