Google | ఇక సెల్ఫీ వీడియో తీస్తే చాలు.. గూగుల్ అకౌంట్ లాగిన్ అవుతుంది..
Google | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూజర్ల అకౌంట్లకు మరింత భద్రతను కల్పిస్తూ కొత్తగా సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త సైన్-ఇన్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు తమ అకౌంట్ లాక్ అయినప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించే ఫోన్ లేదా కంప్యూటర్ అందుబాటులో లేని పరిస్థితుల్లో అకౌంట్‌ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
Technology | Published On Jul 24, 2026, 1.46 pm IST
Google | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూజర్ల అకౌంట్లకు మరింత భద్రతను కల్పిస్తూ కొత్తగా సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త సైన్-ఇన్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు తమ అకౌంట్ లాక్ అయినప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించే ఫోన్ లేదా కంప్యూటర్ అందుబాటులో లేని పరిస్థితుల్లో అకౌంట్‌ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సెల్ఫీ వీడియో వెరిఫికేషన్, ఇప్పటికే ఉన్న రికవరీ ఈ-మెయిల్, రికవరీ ఫోన్ నంబర్, పాస్‌కీస్, రికవరీ కాంటాక్ట్స్ వంటి రికవరీ ఆప్షన్‌లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే వినియోగదారులు ముందుగానే తమ గూగుల్ అకౌంట్‌లో సెల్ఫీ వీడియోను సెటప్ చేయాలి. అకౌంట్ లాక్ అయిన తర్వాత లేదా రికవరీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ వీడియోను జోడించే అవకాశం ఉండదు.
ముందుగా సెటప్ చేయాలి..
సెల్ఫీ వీడియో వెరిఫికేషన్‌ను సెటప్ చేయడానికి వినియోగదారులు తమ డివైస్ కెమెరాను ఉపయోగించి గూగుల్ ఇచ్చే సూచనలను అనుసరించాలి. ఇందులో తలను స్వల్పంగా కదిలించడం వంటి సులభమైన చర్యలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ముఖాన్ని వివిధ కోణాల్లో రికార్డ్ చేసి ఒక సెల్ఫీ వీడియోను గూగుల్ సేవ్ చేస్తుంది. అకౌంట్ రికవరీ సమయంలో వినియోగదారులను మరోసారి కొత్త సెల్ఫీ వీడియో రికార్డ్ చేయాలని గూగుల్ కోరుతుంది. ఆ వీడియోను ముందుగా సేవ్ చేసిన వీడియోతో పోల్చి రెండు ముఖాలు ఒకే వ్యక్తివేనని నిర్ధారించి అకౌంట్ యాజమాన్యాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ ఫీచర్‌లో గోప్యత, భద్రతకు కూడా గూగుల్ ప్రాధాన్యం ఇచ్చింది. వినియోగదారుల అనుమతితోనే సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి స్టోర్ చేస్తామని గూగుల్ తెలిపింది. అవసరమైతే గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సేవ్ చేసిన సెల్ఫీ వీడియోను ఎప్పుడైనా తొలగించుకోవచ్చు.
వీడియోలకు గోప్యత, భద్రత..
సైన్-ఇన్ వెరిఫికేషన్ కోసమే ఈ వీడియోను ఉపయోగిస్తామని, ఇతర అవసరాల కోసం వినియోగదారులు ప్రత్యేకంగా అనుమతి ఇస్తే మాత్రమే ఉపయోగిస్తామని గూగుల్ స్పష్టం చేసింది. స్టోర్ చేసిన వీడియోను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అయిన రూపంలో భద్రపరుస్తారు. నకిలీ ఫోటోలు లేదా డీప్‌ఫేక్ వీడియోలు ఉపయోగించి ఇతరులు అకౌంట్‌లోకి ప్రవేశించకుండా ప్రత్యేక భద్రతా తనిఖీలను కూడా గూగుల్ అమలు చేస్తోంది. రికార్డింగ్ నిజ సమయంలో తీసిందేనని నిర్ధారించేందుకు వినియోగదారులతో కొన్ని సాధారణ కదలికలు చేయించడంతోపాటు అనుమానాస్పద సైన్-ఇన్ ప్రయత్నాలను గుర్తించే ఇప్పటికే ఉన్న భద్రతా వ్యవస్థలను కూడా వినియోగిస్తుంది. ఈ సెల్ఫీ వీడియో సైన్-ఇన్ ఫీచర్ ప్రస్తుతం అర్హత కలిగిన గూగుల్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాలు, అన్ని అకౌంట్లు లేదా అన్ని డివైస్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. అర్హతను పరిశీలించి ఈ ఫీచర్‌ను సెటప్ చేసుకోవడానికి g.co/signin-selfie ని సందర్శించవచ్చు.
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం






