Selfie Video | నా భార్య అందట్ల ఇజ్జత్ తీస్తుంది.. ఈ బత్కు బత్కాలని లేదు.. కన్నోళ్లకు సెల్ఫీ వీడియో పంపి యువకుడి అదృశ్యం
Selfie Video | తన భార్య పూటకు పదిసార్లు సావమంటుందని.. అందట్ల ఇజ్జత్ తీస్తుందని ఓ యువకుడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మానాన్నలకు సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమయ్యాడు.
Selfie Video | త్రినేత్ర న్యూస్: తన భార్య పూటకు పదిసార్లు సావమంటుందని.. అందట్ల ఇజ్జత్ తీస్తుందని ఓ యువకుడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నిత్యం కొడుతూ కొరుకుతుందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవలు చెప్పినా అప్పటి పూర్తికి సరే అంటుందని.. మళ్లా అదే తీరు ఇబ్బంది పెడుతుందని చెప్పాడు. అమ్మా నాన్నా.. మీ కడుపున చెడవుట్టిన.. మీరైనా మంచిగ ఉండండి అంటూ సెల్ఫీ వీడియో (Selfie Video) తీసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ (Mahaboobnagar) జిల్లా బాలానగర్ మండలం మోతీఘన్‌పూర్‌లో తాజాగా చోటుచేసుకుంది. బాధితుడు శివప్రసాద్ (23) (Shiva prasad) ఆవేదన ఆయన మాటల్లో..
చానా ఆలోచించుకున్నా. ఎన్నిసార్లు గొడవైనా సరే మంచిగుంట సారీ తప్పయింది అంటుంది. మళ్లొచ్చినంక ఇష్టమొచ్చినట్టు గొడవ వెట్టుకుంటుంది. ఎట్లవడితే అట్ల మాటలు మాట్లాడుతుంది. పెద్దమనుషులు చెప్తే మంచిగుంటా అంటుంది. పోలిస్‌స్టేషన్‌కాడికోతే ఆళ్లతోని మంచిగుంటా అని చెప్తుంది. లాస్ట్‌కొస్తే మళ్ల అదే రిపీట్ చేస్తుంది. నైట్ టైమ్‌ల ప్రతిరోజు టార్చరే. నా మీదనే అబండాలు మోపుకుంటా మొత్తం ఇజ్జత్ తీయాలని చూస్తుంది.
ఏమన్నంటే సారీ అంటుంది..
ఐదుసార్లయినా గానీ ఆమె మారుతలేదు. నాకు ఇట్లొంటి బతుకు బత్కాలని లేదు. నా జీవితం మీద నాకే విరక్తి వస్తుంది. కొడుతుంది.. కొరుకుతుంది. పిచ్చి పిచ్చి చేస్తుంది. ఏమన్నంటెనేమో సారీ తప్పయిందని మాట్లాడుతుంది. అమ్మనాన్న అడ్డమొస్తే ఆళ్లను తిడుతుంది. ఎవలు చెప్పినా సరే అప్పటిపూర్తికి సరే అంటుంది. మళ్లా వచ్చి గొడవ వడుతుంది.
నా మన్సు సచ్చిపోయింది
అమ్మా, నాయినా నా మన్సు సచ్చిపోయింది. మీరు మంచిగుండుర్రి. మీ కడుపున చెడ ఉట్టిన. అందట్ల ఇజ్జత్ తీసిన. పూటకు పదిసార్లు సావుమని అంటుంది. నా సావు నేన్ సస్తా. మీరైతే మంచిగుండుండి. నా గురించి ఆలోచించకుండి. ప్రతిరోజు టార్చరే.. ఎంతగానమని భరించాలే. అందరికి చెప్తెనేమో ఒక్కసారి సూడు.. ఒక్కసారి సూడు అనంటరు. ఆడపిల్లది నడుస్తదని చెప్పి ఏదంటదే చేస్తుంది. సచ్చినా ఆమెతోనైతే బత్క నేను అని సెల్ఫీ వీడియో తీశాడు.
అనంతరం స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లిన శివప్రసాద్ కొత్తూరు వద్ద స్కూటీ నిలిపి అదృశ్యమయ్యాడు. శివప్రసాద్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
"నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు"
తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడి అదృశ్యం
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో తన భార్య తనను తరచూ వేధిస్తోందని, కొడుతూ, బూతులు తిడుతూ అవమానిస్తుందని ఆవేదనతో వీడియో తీసి అదృశ్యమైన శివప్రసాద్ (23) అనే యువకుడు
తరచూ గొడవలు పెట్టుకుని, పెద్ద మనుషుల ముందు తననే తప్పుగా చిత్రీకరిస్తుందని ఆవేదన
ఆడవారివైపే చట్టాలు ఉన్నాయని అదునుగా చేసుకుని తనతో ఆడుకుంటుందని, కొడుతూ, కొరుకుతూ, పిచ్చిపట్టినట్టు చేసి చనిపోమని అంటుందని ఆందోళన
"నాకు ఈ బతుకు బతకాలని లేదు, మీరైనా సంతోషంగా ఉండండి" అంటూ తల్లిదండ్రులకు తెలిపి స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లిన శివప్రసాద్
కొత్తూరు వద్ద స్కూటీ నిలిపి అదృశ్యమయ్యాడని, శివప్రసాద్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
సంబంధిత వార్తలు

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
నవంబర్ 21, 2026

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు



