Chrome Browser | క్రోమ్ బ్రౌజర్‌లో ఇన్‌బిల్ట్ గా ఏఐ.. ప్రత్యేకంగా సైట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
Chrome Browser | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలి కాలంలో తన ఆన్‌లైన్ టూల్స్‌తోపాటు ఇతర యాప్స్‌లో ఏఐని విస్తృతంగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే అనేక సేవలకు కొత్త అప్‌డేట్స్‌ను విడుదల చేస్తోంది. ఇక ఇంటర్నెట్ బ్రౌజర్ క్రోమ్‌కు కూడా ఏఐ పరంగా నూతన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
Technology | Published On Apr 18, 2026, 4.35 pm IST
Chrome Browser | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలి కాలంలో తన ఆన్‌లైన్ టూల్స్‌తోపాటు ఇతర యాప్స్‌లో ఏఐని విస్తృతంగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే అనేక సేవలకు కొత్త అప్‌డేట్స్‌ను విడుదల చేస్తోంది. ఇక ఇంటర్నెట్ బ్రౌజర్ క్రోమ్‌కు కూడా ఏఐ పరంగా నూతన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. క్రోమ్ బ్రౌజర్‌లో ఇక జెమిని ఏఐ ని ఇన్‌బిల్ట్‌గా గూగుల్ అందిస్తోంది. అందులో భాగంగానే ఆ బ్రౌజర్‌లో తాజాగా ఏఐ మోడ్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని వల్ల యూజర్లు బ్రౌజింగ్ సమయంలో ఏఐ కోసం ఇంకో విండో ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఆ విండో నుంచే ఏఐ ద్వారా సహాయం పొందవచ్చు. ఏఐ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నందున వేర్వేరు ట్యాబ్‌ల మధ్య మారాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఈ క్రమంలో వెబ్ పేజీలు, సెర్చ్ ఫలితాలు, ఏఐ రిజల్ట్స్‌ను ఒకే ఇంటర్ ఫేస్ ద్వారా యూజర్లు పొందవచ్చు. ఈ మార్పు కలిగిన క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్‌డేట్ ను గూగుల్ ప్రస్తుతం లాంచ్ చేసింది. దీని వల్ల యూజర్ల పనులు మరింత సులభతరం అవుతాయని గూగుల్ తెలిపింది.
వెబ్ పేజ్, ఏఐ విండో ఒకే చోట..
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేసి అప్‌డేట్ చేస్తే కొత్త ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు. బ్రౌజర్‌ను అప్ డేట్ చేశాక అందులో ట్యాబ్‌ను ఓపెన్ చేసి ఏదైనా వెబ్ పేజీని తెరిచాక అందులో ఏఐ మోడ్ అని కనిపించే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో ఆ వెబ్ పేజ్ పక్కనే ఏఐ ఇంటర్ ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా వెబ్ పేజీతోపాటు ఏఐ విండో కూడా ఒకేసారి కనిపిస్తాయి. ఇలా ఫీచర్ ఉండడం వల్ల యూజర్లు వెబ్ పేజీలో పనిచేస్తూనే మరోవైపు పక్కనే ఏఐతో సంభాషణ కొనసాగించవచ్చు. ఈ విధానం వల్ల ఒకేసారి పలు సోర్స్‌ల నుంచి సమాచారాన్ని పోల్చి చూడవచ్చు. మళ్లీ సెర్చ్ చేయకుండా ఫాలో అప్ ప్రశ్నలు అడగవచ్చు. అలాగే బ్రౌజింగ్ కాంటెక్ట్స్‌ను కొనసాగించవచ్చు. క్రోమ్ బ్రౌజర్‌లో ఏఐ మోడ్‌ను ఉపయోగిస్తే యూజర్ చూసే వెబ్ పేజీతోపాటు పలు ఇతర సోర్స్‌లు, సమాచారం ఆధారంగా కూడా ఏఐ సమాధానాలను ఇస్తుంది. ఉదాహరణకు ఏదైనా ప్రొడక్ట్ గురించి వెబ్ పేజీలో చదువుతున్నప్పుడు దాని ఫీచర్లు లేదా ఇతర ప్రొడక్ట్స్‌తో పోలికలను కూడా అదే పేజీని విడిచిపెట్టకుండా తెలుసుకోవచ్చు.
ఎంతో సమయం ఆదా..
కొత్త అప్‌డేట్ వల్ల యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌లో తరచూ ట్యాబ్‌ల మధ్య మారాల్సిన అవసరం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. యూజర్లు మాటి మాటికీ వెనక్కి, ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నిరంతరం వర్క్ ఫ్లో కొనసాగుతుంది. చదివేందుకు ఎక్కువ సమయం పట్టే ఆర్టికల్స్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా చదవచ్చు. వీడియోలు చూసే సమయంలోనూ అంతరాయం తగ్గుతుంది. అలాగే ఏఐ సహాయం, కంటెంట్ ఒకే చోట ఉండడం వల్ల యూజర్లకు ఏకాగ్రత మెరుగు పడుతుంది. అయితే ఇవే కాకుండా ఈ ఏఐ ఫీచర్‌ను గూగుల్ తన ఇతర ప్రొడక్ట్స్‌లోనూ విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కేవలం క్రోమ్ మాత్రమే కాకుండా ఫొటోలు, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్లలోనూ ఈ సేవలను అందించనుంది. అలాగే కాన్వాస్, ఇమేజ్ జనరేషన్ వంటి టూల్స్‌ను కూడా ఏఐ మోడ్‌లోనే అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్‌లో కొత్తగా వచ్చిన ఈ ఏఐ మోడ్ అమెరికా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని దేశాల్లో ఈ అప్‌డేట్‌ను అందించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






