Google Gemini | విండోస్ యూజర్లకు గూగుల్ జెమిని.. ఇక డెస్క్‌టాప్‌లోనే ఏఐ అసిస్టెంట్..
Google Gemini | గూగుల్ అధికారికంగా విండోస్ కోసం ప్రత్యేకమైన జెమిని అప్లికేషన్‌ను విడుదల చేసింది. దీంతో విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే డెస్క్‌టాప్ కంప్యూటర్లలో నేరుగా గూగుల్ ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో మ్యాక్‌ఓఎస్ కోసం డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేసిన గూగుల్, తాజాగా విండోస్ యూజర్లకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Sep 11, 2026, 4.06 pm IST
Google Gemini | గూగుల్ అధికారికంగా విండోస్ కోసం ప్రత్యేకమైన జెమిని అప్లికేషన్‌ను విడుదల చేసింది. దీంతో విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే డెస్క్‌టాప్ కంప్యూటర్లలో నేరుగా గూగుల్ ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో మ్యాక్‌ఓఎస్ కోసం డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేసిన గూగుల్, తాజాగా విండోస్ యూజర్లకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ ను రోజువారీ కంప్యూటింగ్ పనుల్లో జెమినిని మరింత సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ప్రతిసారి వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి జెమిని వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, డెస్క్‌టాప్ నుంచే వేగంగా ఏఐ సేవలను యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. జెమిని విండోస్ యాప్‌లో ప్రధానంగా పలు కీలక ఫీచర్లు ఉన్నాయి. వాటిలో క్విక్ యాక్సెస్ ఓవర్‌లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ కీలను ప్రెస్ చేయాలి..
కీబోర్డ్‌లో ఆల్ట్, స్పేస్ బటన్లను ప్రెస్ చేయడం ద్వారా ఎప్పుడైనా జెమినిని తెరపైకి తీసుకురావచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర అప్లికేషన్ పైనే జెమిని ఓవర్‌లే కనిపిస్తుంది. దీంతో డాక్యుమెంట్లలోని సమాచారాన్ని పరిశీలించడం, వాస్తవాలను ధ్రువీకరించడం, సమాధానాలను రూపొందించడం, ప్రజెంటేషన్ ఆలోచనలను సిద్ధం చేయడం వంటి పనులను త్వరగా పూర్తిచేసుకోవచ్చు. పని పూర్తయిన తర్వాత తిరిగి ప్రధాన అప్లికేషన్‌కు వెళ్లవచ్చు. క్లిష్టమైన పనుల కోసం జెమిని పూర్తి అప్లికేషన్ విండోను కూడా అందిస్తుంది. ఇది ఒక కేంద్ర వర్క్‌స్పేస్‌లా పనిచేస్తుంది. జెమిని స్పార్క్ ద్వారా బహుళ దశల్లో పూర్తయ్యే పనులను అప్పగించే అవకాశం ఉంటుంది. అలాగే జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వంటి గూగుల్ వర్క్‌స్పేస్ సేవలతో అనుసంధానం చేసుకుని, స్టోర్ చేసిన ఫైల్స్‌లోని సమాచారాన్ని తీసుకుని సందర్భానుసారంగా సమ్మరీలు, ఇతర కంటెంట్‌ను రూపొందించుకోవచ్చు.
మల్టీమీడియా కంటెంట్ కోసం..
మల్టీమీడియా కంటెంట్ తయారీకి కూడా డెస్క్‌టాప్ యాప్‌లోనే సదుపాయాలు అందించారు. నానో బనానా ద్వారా కస్టమ్ విజువల్స్‌ను రూపొందించుకోవడంతోపాటు, జెమిని ఓమ్ని ఉపయోగించి వీడియో కంటెంట్‌ను కూడా ఒకే డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్ నుంచి రూపొందించుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే సమయంలో సిస్టమ్ వనరుల వినియోగాన్ని తక్కువగా ఉంచేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. విండోస్ 10, విండోస్ 11 యూజర్లు జెమిని సైట్ నుంచి ఇన్‌స్టాలర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్ అప్‌డేట్లలో మరిన్ని స్థానిక డెస్క్‌టాప్ ఇంటిగ్రేషన్లను అందించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
ఆగస్టు 20, 2026

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026

ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్‌బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Kasipeta | మ్యుటేషన్ చేసేందుకు లంచం.. రిటైర్డ్ తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
- ●Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి
- ●Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? - ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ
- ●Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది
- ●Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
- ●Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం

Kasipeta | మ్యుటేషన్ చేసేందుకు లంచం.. రిటైర్డ్ తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష

Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి

Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? - ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ

Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది



