Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
Google Assistant | గూగుల్ సంస్థ తన ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌లలో లెగసీ గూగుల్ అసిస్టెంట్ సేవలను అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై జెమినినే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ప్రధాన ఏఐ ఆధారిత అసిస్టెంట్‌గా పనిచేయనుంది. ఈ మార్పు సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుందని, గూగుల్ తదుపరి తరం కృత్రిమ మేధస్సు వ్యవస్థ వైపు పూర్తిస్థాయి మార్పును చేపడుతున్నట్లు తెలిపింది.
Technology | Published On Aug 7, 2026, 5.18 pm IST
Google Assistant | గూగుల్ సంస్థ తన ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌లలో లెగసీ గూగుల్ అసిస్టెంట్ సేవలను అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై జెమినినే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో ప్రధాన ఏఐ ఆధారిత అసిస్టెంట్‌గా పనిచేయనుంది. ఈ మార్పు సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుందని, గూగుల్ తదుపరి తరం కృత్రిమ మేధస్సు వ్యవస్థ వైపు పూర్తిస్థాయి మార్పును చేపడుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో గూగుల్ అసిస్టెంట్ యాక్సెస్‌ను తొలగించడం ప్రారంభిస్తుంది. ఈ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల కానుండటంతో, అందరు వినియోగదారులకు చేరుకోవడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. ఒకసారి ఏదైనా పరికరంలో గూగుల్ అసిస్టెంట్ ను తొలగించిన తర్వాత, వినియోగదారులు తిరిగి దానిని ఉపయోగించే అవకాశం ఉండదు. గూగుల్ అసిస్టెంట్‌కు మళ్లీ మారే ఆప్షన్ కూడా అందుబాటులో ఉండదు. ఇకపై హే గూగుల్ అని వాయిస్ కమాండ్ ఇవ్వడం లేదా పవర్ బటన్‌ను ఎక్కువసేపు ట్యాప్ చేయడం వంటి సాధారణ యాక్టివేషన్ పద్ధతులు గూగుల్ అసిస్టెంట్‌ను కాకుండా నేరుగా జెమినిని యాక్టివేట్ చేస్తాయి.
అర్హతలు, మద్దతు ఉన్న ప్రాంతాల్లోనే..
అయితే ఈ మార్పు కనీస హార్డ్‌వేర్ అర్హతలు ఉన్న, జెమినికి మద్దతు ఉన్న ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ పరికరాలకే వర్తిస్తుంది. అటువంటి పరికరాల్లో జెమిని డిఫాల్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. మొబైల్లో జెమినిని ప్రధాన అసిస్టెంట్‌గా ఎంచుకున్న వెంటనే, దానికి అనుసంధానమైన ఇతర పరికరాలపై కూడా అదే అనుభవం అందుబాటులోకి వస్తుంది. వేర్ ఓఎస్ ఆధారిత స్మార్ట్‌వాచ్‌లలో గూగుల్ అసిస్టెంట్ స్థానంలో జెమిని పనిచేస్తుంది. అనుకూల హెడ్ఫోన్లు, ఇయర్బడ్స్లలో అసిస్టెంట్ కమాండ్లను కూడా జెమిని ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే స్మార్ట్‌ఫోన్ ప్రొజెక్షన్ ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ ఆటోలో కూడా సెప్టెంబర్ 4 నుంచి జెమినికి మార్పు ప్రారంభమవుతుంది. అయితే వాహనంలోనే గూగుల్ సాఫ్ట్వేర్ ఇంటర్నల్ గా ఉండే గూగుల్ బిల్ట్-ఇన్ కార్లకు మాత్రం మినహాయింపు ఉంది. అలాంటి వాహనాల్లో సెప్టెంబర్ 4 తర్వాత కూడా గూగుల్ అసిస్టెంట్ కొనసాగుతుందని గూగుల్ స్పష్టం చేసింది.
వీటిపై ప్రభావం ఉండదు..
ఈ మార్పు ప్రస్తుతం ప్రధానంగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, వాటికి అనుసంధానమైన యాక్సెసరీలకే పరిమితం కాగా గూగుల్ టీవీ, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు వంటి స్వతంత్ర స్మార్ట్ హోమ్ పరికరాలపై ఈ తేదీ నుంచి ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే భవిష్యత్తులో ఈ పరికరాలకు కూడా జెమిని సామర్థ్యాలను తీసుకురావడానికి ప్రత్యేక మైగ్రేషన్ ప్రణాళికలను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ తెలిపిన ప్రకారం, మొబైల్ పరికరాల నుంచి గూగుల్ అసిస్టెంట్‌ను తొలగించే ప్రణాళిక తమ ఏఐ సేవలన్నింటినీ జెమిని ఫ్రేమ్‌వర్క్ కింద ఏకీకృతం చేసే వ్యూహంలో భాగమని స్పష్టం చేసింది. దీని ద్వారా అన్ని గూగుల్ హార్డ్‌వేర్ పరికరాల్లో మరింత సహజమైన, సంభాషణాత్మకమైన, సమగ్ర ఏఐ అసిస్టెంట్ అనుభవాన్ని అందించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
సంబంధిత వార్తలు

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..
నవంబర్ 26, 2026

Google Gemini | జెమినితో ఫోన్ కాల్స్, బిల్లు చెల్లింపులు.. ఇక పనులన్నీ ఏఐతోనే!
నవంబర్ 18, 2026

November Lucky Horoscope | నవంబర్‌లో ఈ 4 రాశులకు అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



