త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | ఐఫోన్‌కు దగ్గరైన ఆండ్రాయిడ్.. గూగుల్ భారీ అప్‌డేట్స్..

Google | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఫైల్ షేరింగ్, డివైస్ మైగ్రేషన్, అలాగే ఆండ్రాయిడ్-ఐఓఎస్ మధ్య సెక్యూర్ మెసేజింగ్‌పై ఈ మార్పులు దృష్టి సారించాయి. కొత్త అప్‌డేట్స్‌లో క్విక్ షేర్‌కు ఎయిర్‌డ్రాప్ కంపాటిబిలిటీ, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా ట్రాన్స్‌ఫర్‌ను సులభతరం చేసే కొత్త ప్రాసెస్, అలాగే ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య ఆర్‌సీఎస్ మెసేజింగ్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్‌ను తీసుకొచ్చింది.

S

Technology | Published On May 13, 2026, 12.46 pm IST

Google | ఐఫోన్‌కు దగ్గరైన ఆండ్రాయిడ్.. గూగుల్ భారీ అప్‌డేట్స్..
Advertisement

Google | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఫైల్ షేరింగ్, డివైస్ మైగ్రేషన్, అలాగే ఆండ్రాయిడ్-ఐఓఎస్ మధ్య సెక్యూర్ మెసేజింగ్‌పై ఈ మార్పులు దృష్టి సారించాయి. కొత్త అప్‌డేట్స్‌లో క్విక్ షేర్‌కు ఎయిర్‌డ్రాప్ కంపాటిబిలిటీ, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా ట్రాన్స్‌ఫర్‌ను సులభతరం చేసే కొత్త ప్రాసెస్, అలాగే ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య ఆర్‌సీఎస్ మెసేజింగ్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌లోని క్విక్ షేర్ ఫీచర్ ఇప్పుడు ఐఓఎస్ డివైస్‌లతో కూడా ఫైల్ షేరింగ్‌కు సపోర్ట్ ఇవ్వనుంది. ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు లేదా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మరింత సులభంగా పంపుకోవచ్చని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ డివైస్‌లతో ప్రారంభమైన ఈ ఫీచర్, ఎయిర్‌డ్రాప్‌కు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ ఏడాదిలోనే శాంసంగ్, ఒప్పో, వన్‌ప్లస్, వివో, షావోమీ, హానర్ వంటి ఇతర ఆండ్రాయిడ్ బ్రాండ్స్‌కూ ఈ సపోర్ట్ ను విస్తరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.

ఆండ్రాయిడ్ టు ఐఓఎస్‌.. ఫైల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ సుల‌భం..

క్విక్ షేర్ కంపాటిబిలిటీ అందుబాటులో లేని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా గూగుల్ ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తోంది. క్విక్ షేర్ ద్వారా క్యూ ఆర్ కోడ్ జనరేట్ చేసి, క్లౌడ్ సహాయంతో ఐఓఎస్ డివైస్‌లకు వెంటనే ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే వాట్సాప్ వంటి ఎంపిక చేసిన యాప్స్‌లో కూడా త్వరలో క్విక్ షేర్ సపోర్ట్ అందుబాటులోకి రానుందని గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం ఆయా ఫీచ‌ర్ల సపోర్ట్ ఉన్న డివైస్‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌, పిక్సెల్ 10 సిరీస్‌, పిక్సెల్ 9 సిరీస్‌, పిక్సెల్ 8ఎ, ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌, ఫైండ్ ఎన్‌6, వివో ఎక్స్ 300 అల్ట్రా ఫోన్ల‌లో ప్ర‌స్తుతం ఆయా కొత్త ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక త్వ‌ర‌లోనే ద‌శ‌ల‌వారీగా అన్ని బ్రాండ్ల‌కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు కూడా ఈ కొత్త అప్ డేట్స్ ను అందించ‌నున్నారు.

డేటా మైగ్రేష‌న్ సైతం ఈజీగానే..

ఇక ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా మైగ్రేషన్ ప్రాసెస్‌ను కూడా గూగుల్ మరింత సులభతరం చేసింది. యాపిల్‌తో కలిసి కొత్త వైర్‌లెస్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌ను రూపొందించినట్లు తెలిపింది. దీని ద్వారా యూజర్లు తమ డేటాను సులభంగా కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లకు మార్చుకోవచ్చు. కొత్త మైగ్రేషన్ సిస్టమ్ ద్వారా పాస్‌వర్డ్స్, ఫోటోలు, మెసేజెస్, ఫేవరెట్ యాప్స్, కాంటాక్ట్స్, హోమ్‌స్క్రీన్ లేఅవుట్, అలాగే ఈ-సిమ్ డేటాను కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక ఆండ్రాయిడ్-ఐఫోన్ యూజర్ల మధ్య జరిగే ఆర్‌సీఎస్ చాట్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. గత 28 రోజుల సగటు ప్రకారం రోజుకు సుమారు 2.5 బిలియన్ ఆర్‌సీఎస్ మెసేజెస్ పంపించుకుంటున్నార‌ని గూగుల్ వెల్లడించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల మధ్య జరిగే ఆర్‌సీఎస్ సంభాషణలు పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సెక్యూర్‌గా ఉండనున్నాయి. దీంతో యూజర్ల ప్రైవసీ మరింత మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది.

క్యూ ఆర్ కోడ్ ఆధారిత క్విక్ షేర్ ఫీచర్ బుధ‌వారం నుంచే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు రోల్ అవుట్ ప్రారంభమవుతుందని, వచ్చే నెలలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని గూగుల్ తెలిపింది. ఈ-సిమ్ ట్రాన్స్‌ఫర్ సపోర్ట్‌తో కూడిన కొత్త ఐఫోన్-టు-ఆండ్రాయిడ్ మైగ్రేషన్ ఫీచర్ ఈ ఏడాది చివర్లో మొదటగా శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్ డివైస్‌లలో ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement