Google AI Plus | ఇప్పుడు మరింత చవకగా గూగుల్ ఏఐ ప్రొ టూల్స్.. నూతన ప్లాన్ అందుబాటులోకి..
Technology | Published On Dec 10, 2025, 5.43 pm IST
Google AI Plus | ప్రస్తుతం తరుణంలో చాలా మంది సోషల్ మీడియాను అధికంగా ఉపయోగిస్తున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు సోషల్ మీడియా ప్రపంచంలో విహరిస్తున్నారు. అందులో భాగంగానే రోజూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక క్రియేటర్లు అయితే నిత్యం అందులోనే మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్ల కోసం అనేక ఏఐ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల పోస్టులను పబ్లిష్ చేయడం చాలా సులభతరంగా మారింది. అలాగే ఇమేజ్‌లను కూడా చాలా అద్భుతమైన క్వాలిటీతో క్రియేటింగ్, ఎడిటింగ్ చేస్తున్నారు. ఇక ఇందుకు గాను పలు ఏఐ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది ఏఐ వీడియోలు లేదా ఇమేజ్‌లను క్రియేట్ చేసేందుకు గూగుల్‌కు చెందిన నానో బనానా టూల్ ను ఉపయోగిస్తున్నారు. కానీ దీనికి చెందిన బేసిక్ వెర్షన్‌లో చాలా పరిమితులు ఉంటున్నాయి.
ఇక నానో బనానా టూల్ ప్రొ వెర్షన్‌ను పొందాలంటే గూగుల్ కు చెందిన ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్‌ను నెల చందా కట్టి తీసుకోవాలి. కానీ దానికి నెలకు దాదాపుగా రూ.2వేల వరకు అవుతుంది. అయితే చాలా మందికి అంత స్థోమత ఉండడం లేదు. దీంతో ఇదే విషయాన్ని అర్థం చేసుకున్న గూగుల్ సంస్థ అలాంటి యూజర్ల కోసం ఓ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ఏఐ ప్లస్ పేరిట భారత యూజర్ల కోసం ఓ నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను పొందాలంటే నెలకు కేవలం రూ.399 చెల్లిస్తే చాలు. ఇక ఇది స్టాండర్డ్ ప్లాన్ అయినప్పటికీ ఒక యూజర్ ఈ ప్లాన్‌ను తీసుకుంటే దాన్ని 5 మందికి షేర్ చేయవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అలాగే కొత్తగా గూగుల్ ఏఐ సబ్ స్క్రిప్షన్ ను పొందే వారికి ఈ ప్లాన్ నెలకు రూ.199కే లభిస్తుంది. అలా వారు ఈ ప్లాన్‌ను మొదటి 6 నెలల పాటు కేవలం రూ.199కే వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు పలు అద్భుతమైన ఏఐ టూల్స్‌ను అందిస్తున్నారు.
గూగుల్‌లో ఇమేజ్ లేదా వీడియో క్రియేషన్, ఎడిటింగ్ కోసం వాడే నానో బనానా టూల్ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని బేసిక్ వెర్షన్ లో చాలా పరిమితులతో వాడుకోవాల్సి ఉంటుంది. కానీ గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌ను పొందితే ఈ టూల్‌కు చెందిన అధునాతన వెర్షన్‌ను ఈ ప్లాన్‌లో భాగంగా వాడుకోవచ్చు. అలాగే సాధారణ సెర్చ్, సమాచారం, ఇతర వివరాల కోసం గూగుల్ కు చెందిన అధునాతన జెమిని 3 ప్రొ ఏఐ మోడల్‌ను కూడా ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు.
అలాగే జీమెయిల్, డాక్స్, డ్రైవ్ వంటి యాప్‌లలోనూ ఉపయోగించుకునేలా ఈ ప్లాన్‌ను తీర్చిదిద్దారు. దీని కారణంగా ఆయా యాప్ లలో గూగుల్ ఏఐతో ఎంచక్కా పనులను చక్కబెట్టుకోవచ్చు. ఇక ఏదైనా సమాచారం కోసం మరింత లోతుగా అన్వేషించడానికి ఈ ప్లాన్‌లో నోట్ బుక్ ఎల్ఎం టూల్‌ను కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లకు 200 జీబీ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. దీన్ని గూగుల్‌కు చెందిన అన్ని యాప్‌లలోనూ షేరింగ్ పద్ధతిలో వాడుకోవచ్చు. గూగుల్ ఫొటోలు, మెయిల్, డ్రైవ్ వంటి సేవలకు ఈ స్టోరేజ్ లింక్ అవుతుంది. దీంతో అన్నింటికీ కలిపి ఒకే స్టోరేజ్ పనిచేస్తుంది. ఒక వేళ గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌ను ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే అప్పుడు ఆ స్టోరేజ్ కూడా వారికి షేర్ అవుతుంది. ఇలా గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్ పనిచేస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Layoffs | SAPలో లేఆఫ్స్.. 10 వేలకుపైగా ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం!
నవంబర్ 27, 2026

Animation Movie | వెండితెరపై ఇస్కాన్ వ్యవస్థాపకుడి కథ – ఏఐ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో బయోపిక్
నవంబర్ 10, 2026

SplashBI GCC Launch | జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వం.. ఆవిష్కరణ కేంద్రాలుగా తయారు చేస్తం
నవంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



