త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Galaxy Unpacked 2026 | శాంసంగ్ గెలాక్సీ ఎస్‌26 వ‌చ్చేస్తోంది.. ఈ నెల 25న విడుద‌ల‌..

Galaxy Unpacked 2026 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మరోసారి షేక్ చేసేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 25న శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించ‌నున్న Galaxy Unpacked 2026 ఈవెంట్‌లో గెలాక్సీ S26 సిరీస్‌ను ఆవిష్కరించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

S

Technology | Published On Feb 11, 2026, 11.42 am IST

Galaxy Unpacked 2026 | శాంసంగ్ గెలాక్సీ ఎస్‌26 వ‌చ్చేస్తోంది.. ఈ నెల 25న విడుద‌ల‌..
Advertisement

Galaxy Unpacked 2026 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మరోసారి షేక్ చేసేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 25న శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించ‌నున్న Galaxy Unpacked 2026 ఈవెంట్‌లో గెలాక్సీ S26 సిరీస్‌ను ఆవిష్కరించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో Samsung Galaxy S26, Samsung Galaxy S26+, Samsung Galaxy S26 Ultra మోడళ్లను విడుదల చేయ‌నున్నారు. ఇక భారత్‌లో ఇప్పటికే ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. శామ్‌సంగ్ ఇండియా స్టోర్‌లో రూ.999 చెల్లించి వినియోగదారులు ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసే వారికి రూ.2,699 విలువైన వౌచర్ హామీగా ఇస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రీ-రిజర్వేషన్ గడువు ఫిబ్రవరి 25 రాత్రి 11:30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొనుగోలు సమయంలో చెల్లించిన రూ.999 మొత్తాన్ని అడ్జస్ట్ చేస్తారు. కూపన్ వినియోగించకపోతే ఆ మొత్తం తిరిగి రీఫండ్ చేయబడుతుంది.

ఫీచ‌ర్లు, ధ‌ర‌లు ఇవే..?

అధికారికంగా భారత్‌లో లాంచ్ తేదీ, ధరలను ప్రకటించకపోయినా, గ్లోబల్ మార్కెట్‌లో ధరలు వెల్లడయ్యాయి. గెలాక్సీ S26 12GB + 256GB వేరియంట్ ధర 999 అమెరికన్ డాలర్ల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. S26+ ధర 1,269 డాలర్లు, S26 Ultra ధర 1,469 డాలర్ల నుంచి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. S26, S26+ మోడళ్లలో 6.3, 6.7 ఇంచుల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేల‌ను ఇవ్వ‌నున్నారు. 1 నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ మార్కెట్లలో Exynos 2600 ప్రాసెసర్ ఉండగా, Ultra మోడల్‌లో మాత్రం Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ను అందించ‌నున్నారు. ఇక కెమెరా పరంగా S26 సిరీస్‌లో 50MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్, టెలిఫోటో లెన్సులు ఉండనున్నాయి. Ultra మోడల్‌లో 200MP ప్రధాన కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 100x స్పేస్ జూమ్ వంటి ఫీచర్ల‌ను అందించ‌నున్నారు.

S26లో 4300mAh, S26+లో 4900mAh కాగా, Ultra మోడల్‌లో 5000mAh బ్యాటరీ ఇవ్వనున్నారు. Ultra మోడల్‌లో 60W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. కాగా శాంసంగ్ ఈవెంట్ ఫిబ్రవరి 25న భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ చాన‌ల్‌ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. క‌నుక ఈ ఈవెంట్‌ను ప్ర‌త్య‌క్ష ప్రసారంలోనూ వినియోగ‌దారులు వీక్షించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement