Galaxy S25 Ultra | గెలాక్సీ ఎస్25 అల్ట్రా.. ధర భారీగా తగ్గింపు.. రూ.18వేల వరకు డిస్కౌంట్..
Galaxy S25 Ultra | టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ల విడుదల నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గెలాక్సీ ఎస్25 ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.
Technology | Published On Feb 8, 2026, 12.18 pm IST
Galaxy S25 Ultra | టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎస్26 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ల విడుదల నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గెలాక్సీ ఎస్25 ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యంగా ఎస్25 అల్ట్రా 5జి ఫోన్ ధరను భారీగా తగ్గించడంతో ప్రస్తుతం తగ్గింపు ధరకే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.18,599 వరకు ధర తగ్గింది. ఈ క్రమంలో ఫోన్ ధర తగ్గడంతో ప్రస్తుతం ఈ డివైస్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లలో సహజంగానే ప్రీమియం ఫీచర్లు, అధునాతన హార్డ్ వేర్, ఇతర స్పెసిఫికేషన్లు ఉంటాయి కనుక ఈ ఫోన్ పట్ల వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.
అనేక ఆఫర్లు కూడా..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జి ఫోన్‌ను ప్రస్తుతం వినియోగదారులు తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1,12,900కు లిస్ట్ చేసి విక్రయిస్తున్నారు. లాంచింగ్ ధరతో పోలిస్తే ఈ ధర రూ.17,099 తక్కువగా ఉందని స్పష్టమైంది. ఇక ఈ ఫోన్‌కు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో అదనంగా మరో రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ఫైనల్ ధర రూ.1.10 లక్షలుగా మారింది. ఇక ఈ ఫోన్‌పై ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. నెలకు కేవలం రూ.3,969కే ఈ ఫోన్‌ను ఈఎంఐ విధానంలో సొంతం చేసుకోవచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ ఫోన్‌పై అదనంగా రూ.35,950 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ కండిషన్, విడుదల తేదీ వంటి అంశాలపై ఫోన్ విలువ ఆధార పడి ఉంటుంది. ఇక ఎస్25 అల్ట్రా 5జి ఫోన్‌ను కొనేవారు అదనపు వారంటీ సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు.
గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జి ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.9 ఇంచుల డైనమిక్ ఎల్‌టీఈవో అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 1టీబీ వరకు స్టోరేజ్, 12జీబీ ర్యామ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ల ఫాస్ఠ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. వెనుక వైపు 200 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాకు తోడు 50 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా, 10, 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్లను ఇచ్చారు. అలాగే సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఏఐ ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



