త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flipkart Pay Later | అకౌంట్‌లో డ‌బ్బులు లేకున్నా ఫ్లిప్‌కార్ట్‌లో వ‌స్తువుల‌ను కొన‌వ‌చ్చు.. పే లేట‌ర్ స‌ర్వీస్ లాంచ్‌..

Flipkart Pay Later | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తన వినియోగదారుల కోసం కొత్త క్రెడిట్ సేవ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ను ప్రారంభించింది. ఈ సేవను పేయూకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పేయూ ఫైనాన్స్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

S

Technology | Published On Jul 30, 2026, 3.45 pm IST

Flipkart Pay Later | అకౌంట్‌లో డ‌బ్బులు లేకున్నా ఫ్లిప్‌కార్ట్‌లో వ‌స్తువుల‌ను కొన‌వ‌చ్చు.. పే లేట‌ర్ స‌ర్వీస్ లాంచ్‌..
Advertisement

Flipkart Pay Later | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తన వినియోగదారుల కోసం కొత్త క్రెడిట్ సేవ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ను ప్రారంభించింది. ఈ సేవను పేయూకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పేయూ ఫైనాన్స్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసే సమయంలోనే తమకు అనుకూలమైన చెల్లింపు విధానాన్ని ఎంచుకుని కొనుగోళ్లు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌లో వినియోగదారులకు మూడు రకాల రీపేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పే లేటర్ ఆప్ష‌న్ లో రోజువారీ కొనుగోళ్లకు గరిష్టంగా 30 రోజుల వరకు చెల్లింపు గడువు లభిస్తుంది. పే ఇన్ 3 ఆప్షన్‌లో కొనుగోలు మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించవచ్చు. అలాగే అధిక విలువ కలిగిన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి ఉత్పత్తుల కోసం 3 నుంచి 12 నెలల వరకు ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

అవ‌స‌రానికి అనుగుణంగా చెల్లింపు ప్ర‌ణాళిక‌..

ఈ సేవ ద్వారా తక్కువ విలువ కలిగిన రోజువారీ కొనుగోళ్ల నుంచి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల వరకు వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా చెల్లింపు ప్రణాళికను ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఫ్యాషన్, హోమ్, బ్యూటీ, జనరల్ మెర్చండైజ్ వంటి అనేక విభాగాల్లో ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ కార్యక్రమంలో తొలి రుణ భాగస్వామిగా పేయూ ఫైనాన్స్ వ్యవహరిస్తోంది. లైసెన్స్ పొందిన రుణదాతగా పేయూ ఫైనాన్స్ సేవలు అందిస్తుండగా, కస్టమర్ రిలేషన్‌షిప్ నిర్వహణతోపాటు క్రెడిట్ ఇంటెలిజెన్స్ బాధ్యతలను ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ చేపడుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌, పేయూ ఫైనాన్స్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌..

కస్టమర్లకు క్రెడిట్ మంజూరు చేసే ప్రక్రియలో ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్‌కు చెందిన కామర్స్ డేటాతో పాటు పేయూ ఫైనాన్స్‌కు ఉన్న రుణాల అంచనా నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు. క్రెడిట్ అంచనాలో వినియోగదారుల ట్రాన్సాక్షన్ హిస్టరీ, కొనుగోలు విధానం, ప్లాట్‌ఫామ్‌లో వారి ప్రవర్తన, ఇతర డేటా సోర్స్‌ల నుంచి లభించే సమాచారం, అలాగే పేయూ ఫైనాన్స్‌కు చెందిన రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అంశాల ఆధారంగా కస్టమర్ క్రెడిట్ అర్హతను నిర్ణయించి రుణ పరిమితిని కేటాయిస్తారు.

Advertisement
Advertisement