Dell XPS 13 | 2.5కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్‌తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే..
Dell XPS 13 | ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ భారత్‌లో కొత్త ఎక్స్పీఎస్ 13 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 3 ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత జూలైలో ఇంటెల్ కోర్ 5 320 ప్రాసెసర్ వేరియంట్‌ను విడుదల చేసిన అనంతరం తాజాగా కొత్త కాన్ఫిగరేషన్లను ప్రవేశపెట్టింది.
Technology | Published On Oct 14, 2026, 3.23 pm IST
Dell XPS 13 | ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ భారత్‌లో కొత్త ఎక్స్పీఎస్ 13 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 3 ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత జూలైలో ఇంటెల్ కోర్ 5 320 ప్రాసెసర్ వేరియంట్‌ను విడుదల చేసిన అనంతరం తాజాగా కొత్త కాన్ఫిగరేషన్లను ప్రవేశపెట్టింది. వీటిలో గరిష్ఠంగా 32 జీబీ మెమొరీ, 1 టీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ సదుపాయం ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ సీఎన్సీ యంత్ర సాంకేతికతతో రూపొందించిన అల్యూమినియం బాడీతో వస్తుంది. దీని మందం కేవలం 12.7 మిల్లీమీటర్లు కాగా, బరువు ఒక కిలోగ్రాము మాత్రమే. ఇందులో 13.4 ఇంచుల 2.5కె ఇన్ఫినిటీ ఎడ్జ్ ఎల్సీడీ టచ్ డిస్ప్లేను అందించారు. ఇది 30 హెడ్జ్ నుంచి 120 హెడ్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. గరిష్ఠంగా 500 నిట్స్ బ్రైట్నెస్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ కవరేజ్‌తోపాటు కళ్లకు రక్షణ కల్పించే ఐసేఫ్ సాంకేతికతను కలిగి ఉంది.
డాల్బీ అట్మోస్ ఫీచర్..
ఇందులో ప్రత్యేకంగా కనిపించని విధంగా అమర్చిన గ్లాస్ టచ్‌ప్యాడ్, కెపాసిటివ్ టచ్ ఫంక్షన్ రో, బ్యాక్లిట్ కీబోర్డ్‌ను అందించారు. కాన్ఫిగరేషన్‌ను బట్టి రెండు యూఎస్బీ 3.2 జెన్ 2 టైప్ సి పోర్టులు లేదా రెండు థండర్‌బోల్ట్ 4/యూఎస్బీ టైప్ సి పోర్టులు ఉంటాయి. ఇంటెల్ వైఫై 7 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. డాల్బీ అట్మాస్ సాంకేతికతతో ప్రత్యేకంగా ట్యూన్ చేసిన నాలుగు స్పీకర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ స్ట్రీమింగ్ వినియోగంలో గరిష్ఠంగా 17 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని డెల్ వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఎనర్జీ స్టార్ ధ్రువీకరణతో పాటు, క్లైమేట్ ప్లస్ గుర్తింపుతో ఈపీట్ గోల్డ్ రిజిస్ట్రేషన్‌ను కూడా పొందింది. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 355 (సిరీస్ 3) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో ఎనిమిది కోర్లు ఉండగా, గరిష్ఠంగా 4.7 గిగాహెడ్జ్ వేగంతో పనిచేస్తుంది. విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఇంటెల్ గ్రాఫిక్స్ సదుపాయం ఉంది.
32జీబీ వరకు ర్యామ్..
16 జీబీ లేదా 32 జీబీ ర్యామ్‌ను అందించారు. స్టోరేజ్ కోసం 512 జీబీ లేదా 1 టీబీ ఎం.2 పీసీఐఈ ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ ఆప్షన్లు ఉన్నాయి. వైర్లెస్ కనెక్టివిటీ కోసం ఇంటెల్ వైఫై 7 బీఈ211, బ్లూటూత్ 6.0 సదుపాయాలను ఇచ్చారు. ఇంగ్లిష్ ఇంటర్నేషనల్ బ్యాక్లిట్ కీబోర్డ్ ఇందులో ఉంది. 52 వాట్ అవర్ సామర్థ్యంతో కూడిన మూడు సెల్ల బ్యాటరీని అమర్చారు. ఛార్జింగ్ కోసం 65 వాట్ల యూఎస్బీ సి గ్యాలియం నైట్రైడ్ స్లిమ్ ఏసీ అడాప్టర్‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ స్కై కలర్లో లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024, ఒక ఏడాది మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం ఏడాది పాటు మెకాఫీ ప్లస్ ప్రీమియం సదుపాయం కల్పిస్తున్నారు. హార్డ్‌వేర్ సమస్యల కోసం రిమోట్ డయాగ్నసిస్ అనంతరం ఏడాది ప్రాథమిక ఆన్సైట్ సర్వీస్‌ను అందిస్తారు. ఈ సేవ హార్డ్‌వేర్ సంబంధిత సమస్యలకే పరిమితం.
ధర వివరాలు..
డెల్ ఎక్స్పీఎస్ 13 ల్యాప్‌టాప్ మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. వీటన్నింటిలోనూ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ 3 ప్రాసెసర్, ఇంటెల్ గ్రాఫిక్స్ ఉన్నాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,80,990గా నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్డీ వేరియంట్ ధర రూ.2,00,990. ఇక 32 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్డీతో వచ్చే టాప్ వేరియంట్ ధర రూ.2,41,990గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను ప్రస్తుతం డెల్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత వార్తలు

Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..
జులై 29, 2026

Dell Pro Precision | డెల్ నుంచి కొత్త ప్రొ ప్రెసిషన్ వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయి.. ధర ఎంతంటే..
జులై 10, 2026

Dell | ఎక్స్పీఎస్ సిరీస్‌లో డెల్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏకంగా 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం
- ●CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం
- ●No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?
- ●Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..
- ●Delhi Police | వాళ్లు చేసిన నేరమేమిటంటే? సీజేపీ సభ్యుల అరెస్ట్‌పై ఢిల్లీ పోలీసుల ఫుల్ ఎక్స్ప్లనేషన్
- ●VC Sajjanar | చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేయడం క్షమించారని నేరం

MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం

CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం

No Cost EMI | పండుగ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ.. నిజంగా లాభమేనా?

Sri Chaitanya Guruji | జూబ్లీహిల్స్‌లో ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వేధింపులు..



