Dell 14S | చవక ధరలకే డెల్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు బెస్ట్..
Dell 14S | డెల్ టెక్నాలజీస్ సంస్థ భారత మార్కెట్లో కొత్త డెల్ 14ఎస్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ 5, కోర్ 7 సిరీస్ 3 ప్రాసెసర్లు, 2.8కె రిజల్యూషన్‌తో 120హెడ్జ్ డిస్‌ప్లే, గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధరను రూ.79,990గా నిర్ణయించింది.
Technology | Published On Nov 4, 2026, 3.21 pm IST
Dell 14S | డెల్ టెక్నాలజీస్ సంస్థ భారత మార్కెట్లో కొత్త డెల్ 14ఎస్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ 5, కోర్ 7 సిరీస్ 3 ప్రాసెసర్లు, 2.8కె రిజల్యూషన్‌తో 120హెడ్జ్ డిస్‌ప్లే, గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధరను రూ.79,990గా నిర్ణయించింది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్..
డెల్ టెక్నాలజీస్ భారత్‌లో డెల్ 14ఎస్ (డీఎస్14270) పేరుతో కొత్త తేలికపాటి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మూడు భాగాలతో రూపొందించిన అల్యూమినియం బాడీతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ కేవలం 13.5 మిల్లీమీటర్ల మందం, 1.15 కిలోల బరువు కలిగి ఉంది. లినెన్, డస్టీ రోజ్, వాష్డ్ డెనిమ్, వెల్వెట్ గ్రీన్ అనే నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్యాక్‌లిట్, నీటి చుక్కలు పడినా తట్టుకునే కీబోర్డ్‌ను ఇందులో అందించారు. ఇంటెల్ కోర్ 5 320, కోర్ 7 350 సిరీస్ 3 ప్రాసెసర్లతో పనిచేస్తుంది. గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌ను పొందుపరిచారు. 14 ఇంచుల 2.8కె డిస్‌ప్లే 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ బ్రైట్‌నెస్‌తో లభిస్తుంది. మరో 2కె డిస్‌ప్లే వేరియంట్ 60హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంటుంది.
21 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 21 గంటల నెట్‌ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుందని డెల్ వెల్లడించింది. 61.2వాట్ అవర్ బ్యాటరీతోపాటు 65వాట్ల యూఎస్‌బీ టైప్ సి ఛార్జర్‌ను అందించింది. వీడియో కాల్స్ కోసం 108పి కెమెరా, డ్యుయల్ అరే మైక్రోఫోన్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన రెండు 2వాట్ల స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వైఫై 6ఈ, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, విండోస్ హలో, మైక్రోసాఫ్ట్ ప్లూటన్ సెక్యూరిటీ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రెండు యూఎస్‌బీ టైప్ సి 3.2 జెన్ 2 పోర్టులు, హెచ్‌డీఎంఐ 1.4 పోర్టు, ఆడియో జాక్‌ను అందించారు. విండోస్ 11 హోమ్ లేదా ప్రొ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభించే ఈ ల్యాప్‌టాప్ ఎనర్జీ స్టార్ 9.0, ఈపీఈఏటీ సిల్వర్ క్లైమేట్ ప్లస్ గుర్తింపులను పొందింది.
ధర వివరాలు..
భారత్‌లో డెల్ 14ఎస్ ప్రారంభ ధరను రూ.79,990గా నిర్ణయించారు. ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ ఫైనాన్స్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ప్రకటించింది. అదనంగా రూ.499కే ఏడాది ప్రమాదవశాత్తు నష్టం రక్షణ సదుపాయాన్ని పొందవచ్చు. నాలుగు రంగుల వేరియంట్లు డెల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లో అందుబాటులోకి వచ్చాయి. లినెన్ రంగు మోడల్ డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ప్రముఖ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తుంది. మిగిలిన మూడు రంగుల మోడళ్లు నవంబర్ చివరి నాటికి ఇతర రిటైల్ కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dell XPS 13 | 2.5కె డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే..
అక్టోబర్ 14, 2026

Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..
జులై 29, 2026

ASUS | ఆసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఏఐ ఫీచర్లకు ప్రత్యేకం..
జులై 11, 2026
తాజావార్తలు
- ●Duddilla Sridhar Babu | ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు.. ఇవే ఫ్యూచర్
- ●Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
- ●Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర.. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి
- ●Dhanteras Offers | ధన్తేరస్ ఆఫర్లలో ఏది బెటర్? 20 శాతం మేకింగ్ ఛార్జీల తగ్గింపా.. ఉచిత బంగారు నాణెమా?
- ●Harish Rao | పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ
- ●Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు

Duddilla Sridhar Babu | ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు.. ఇవే ఫ్యూచర్

Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర.. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి

Dhanteras Offers | ధన్తేరస్ ఆఫర్లలో ఏది బెటర్? 20 శాతం మేకింగ్ ఛార్జీల తగ్గింపా.. ఉచిత బంగారు నాణెమా?



