Dell Pro Precision | డెల్ నుంచి కొత్త ప్రొ ప్రెసిషన్ వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయి.. ధర ఎంతంటే..
Dell Pro Precision | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్ తన నూతన ప్రెసిషన్ వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్ లను ప్రవేశపెట్టింది. ఇవి 14ఎస్, 16ఎస్ మోడల్స్ పేరిట లాంచ్ అయ్యాయి.
Technology | Published On Jul 10, 2026, 10.29 am IST
Dell Pro Precision | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్ తన నూతన ప్రెసిషన్ వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్ లను ప్రవేశపెట్టింది. ఇవి 14ఎస్, 16ఎస్ మోడల్స్ పేరిట లాంచ్ అయ్యాయి. డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్ (14, 16), డెల్ ప్రొ ప్రెసిషన్ 7 సిరీస్ (14, 16), డెల్ ప్రొ ప్రెసిషన్ 7 టీ1 మోడల్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్‌లోని 14ఎస్, 16ఎస్ మోడల్స్ ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌లను కలిగి ఉండగా, ప్రొ ప్రెసిషన్ 514, ప్రొ ప్రెసిషన్ 5 16 మోడల్స్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 సిరీస్ 3 ప్రాసెసర్‌లను ఇచ్చారు. డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్ ప్రారంభ ధర రూ.1.49 లక్షలు ఉండగా, డెల్ ప్రొ ప్రెసిషన్ 7 సిరీస్ ప్రారంభ ధర రూ.2.25 లక్షలుగా ఉంది. అలాగే డెల్ ప్రొ ప్రెసిషన్ 7 టి1 ప్రారంభ ధరను రూ.89వేలుగా నిర్ణయించారు. ఈ మోడల్స్ శుక్రవారం నుంచే మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి.
64జీబీ వరకు ర్యామ్..
డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్ 14ఎస్, 16ఎస్ మోడల్స్‌ను ఆగస్టు 10 నుంచి విక్రయిస్తారు. డెల్ ప్రొ మ్యాక్స్ విత్ జీబీ10 ల్యాప్ టాప్ ధర రూ.4.99 లక్షలుగా ఉంది. డెల్ ప్రొ మ్యాక్స్ విత్ జీబీ300 ను ఈ ఏడాది చివర్లో విక్రయించనున్నారు. డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్ (14ఎస్, 16ఎస్) మోడల్స్ వరుసగా 14, 16 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఆర్క్ ప్రొ గ్రాఫిక్స్, ఏఎండీ రైజెన్ ఏఐ400 ప్రాసెసర్, ఏఎండీ రేడియన్ ప్రొ గ్రాఫిక్స్, 64జీబీ వరకు ర్యామ్ వంటి ఫీచర్లను ఇవి కలిగి ఉన్నాయి. ప్రొ ప్రెసిషన్ 5 14ఎస్ కేవలం 1.4 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల ప్రయాణాల్లో తీసుకెళ్లడం, వాడడం సులభంగా ఉంటుంది. ఇది అత్యంత సన్నని, తేలికైన వర్క్ స్టేషన్ అని డెల్ తెలిపింది. త్రీ సైడెడ్ అల్యూమినియం డిజైన్‌ను ఇది కలిగి ఉంది. 70 వాట్ అవర్ బ్యాటరీని ఇచ్చారు.
50 టాప్స్ ఎన్‌పీయూ..
డెల్ ప్రొ ప్రెసిషన్ 5 సిరీస్ (14, 16) మోడల్స్ కూడా 14, 16 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో లాంచ్ అయ్యాయి. వీటిల్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 సిరీస్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 50 టాప్స్ ఎన్‌పీయూ ఉన్నందున ఏఐ పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రొ ప్రెసిషన్ 15 14 మోడల్‌లో ఎన్‌విడియా ఆర్టీఎక్స్ 500 బ్లాక్ వెల్ గ్రాఫిక్స్‌ను ఆప్షనల్‌గా పొందవచ్చు. 2టీబీ స్టోరేజ్, 72 వాట్ అవర్ బ్యాటరీ ఫీచర్లు ఈ ల్యాప్ టాప్‌లో ఉన్నాయి. ప్రొ ప్రెసిషన్ 16లో ఎన్‌విడియా ఆర్టీఎక్స్ ప్రొ 2000 బ్లాక్‌వెల్ గ్రాఫిక్స్‌ను ఆప్షనల్‌గా ఇచ్చారు. 4టీబీ స్టోరేజ్, 64, 96 వాట్ అవర్ బ్యాటరీ వంటి ఆప్షన్లు ఉన్నాయి. డెల్ ప్రొ ప్రెసిషన్ 7 సిరీస్‌లోనూ 14, 16 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో మోడల్స్‌ను లాంచ్ చేశారు. ప్రొ ప్రెసిషన్ 7 14లో 45 వాట్ల ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ ఉంది. ఎన్‌విడియా ఆర్టీఎక్స్ ప్రొ 2000 బ్లాక్ వెల్ గ్రాఫిక్స్ కార్డు లభిస్తుంది. 64జీబీ ర్యామ్, 4టీబీ స్టోరేజ్, 72 వాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్‌లను ఇచ్చారు.
4జి, 5జి సేవలు సైతం..
ఈ ల్యాప్‌టాప్‌లు అన్నింటిలోనూ వైఫై 7 కామన్ గా లభిస్తోంది. అలాగే 4జి లేదా 5జి సేవలను ఆప్షనల్‌గా పొందవచ్చు. ఐఆర్ కెమెరాలు, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, థండర్ బోల్ట్ 4 పోర్టులు, హెచ్‌డీఎంఐ 2.1, ఆప్షనల్ స్మార్ట్ కార్డ్ రీడర్ వంటి ఫీచర్లను ఇచ్చారు. కొత్త వర్క్ స్టేషన్లతోపాటు డెల్ డెస్క్ సైడ్ ఏజెంటిక్ ఏఐ అనే కొత్త వర్క్ స్టేషన్ ఆధారిత మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్‌ను స్థానికంగానే ఉపయోగించుకునేలా పనిచేస్తుంది. క్లౌడ్ ఏపీఐలతో పోలిస్తే 2 సంవత్సరాల్లో సంస్థలు 87 శాతం వరకు ఖర్చును తగ్గించుకోవచ్చని సంస్థ తెలిపింది.
సంబంధిత వార్తలు

Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..
జులై 29, 2026

Dell | ఎక్స్పీఎస్ సిరీస్‌లో డెల్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏకంగా 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
ఏప్రిల్ 27, 2026

Dell 15 | ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లతో లాంచ్ అయిన డెల్15 కొత్త ల్యాప్ టాప్.. ధర తక్కువే..
ఏప్రిల్ 20, 2026
తాజావార్తలు
- ●CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్
- ●Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్
- ●Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
- ●DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్

Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్

Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు

DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్



