త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dell XPS 13 | ఏఐ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన‌ డెల్ కొత్త ఎక్స్‌పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బ‌డ్జెట్ ధ‌ర‌ల‌కే లాంచ్‌..

Dell XPS 13 | డెల్ భారత్‌లో తన ప్రీమియం కన్జ్యూమర్ ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను మ‌రింత విస్తరించింది. కొత్తగా డెల్ ఎక్స్‌పీఎస్ 13, డెల్ 14ఎస్, డెల్ 16ఎస్, ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్‌లను అధికారికంగా విడుదల చేసింది.

S

Technology | Published On Jul 29, 2026, 2.40 pm IST

Dell XPS 13 | ఏఐ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన‌ డెల్ కొత్త ఎక్స్‌పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బ‌డ్జెట్ ధ‌ర‌ల‌కే లాంచ్‌..
Advertisement

Dell XPS 13 | డెల్ భారత్‌లో తన ప్రీమియం కన్జ్యూమర్ ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను మ‌రింత విస్తరించింది. కొత్తగా డెల్ ఎక్స్‌పీఎస్ 13, డెల్ 14ఎస్, డెల్ 16ఎస్, ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లు ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. కొత్త డెల్ ఎక్స్‌పీఎస్ 13 సీఎన్‌సీ మెషీన్ అల్యూమినియం చాసిస్‌తో రూపుదిద్దుకుంది. ఇది కేవలం 12.7 మిల్లీమీటర్ల మందంతో, బరువు 1 కిలో మాత్రమే ఉండటం విశేషం. ఈ ల్యాప్‌టాప్‌లో ప్రస్తుతం ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్లు అందుబాటులో ఉండగా, ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 వేరియంట్లు తర్వాత మార్కెట్లోకి రానున్నాయి. గరిష్టంగా 32 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఆప్ష‌న్లు ఉన్నాయి.

ప‌వర్‌ఫుల్ డిస్‌ప్లే, ఏఐ ప్రాసెసింగ్‌, అధిక బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

ఎక్స్‌పీఎస్ 13లో 13.4 ఇంచుల 2.5కె ఇన్‌ఫినిటీఎడ్జ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇది 30 హెడ్జ్‌ నుంచి 120 హెడ్జ్‌ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, వెసా డిస్‌ప్లేహెచ్‌డీఆర్ 400 సపోర్ట్‌ల‌ను కలిగి ఉంది. ఇంటెల్ వై-ఫై 7, బ్లూటూత్ 6.0, డాల్బీ అట్మాస్‌తో క్వాడ్ స్పీకర్లు, 1080పి ఐఆర్ వెబ్‌క్యామ్, విండోస్ హ‌లో, బ్యాక్‌లిట్ కీబోర్డ్, గ్లాస్ టచ్‌ప్యాడ్, 52 వాట్ అవర్ బ్యాటరీ, 65 వాట్ యూఎస్‌బీ-సి గాన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏఐ పనితీరుకు గరిష్టంగా 49 టాప్స్ ఎన్‌పీయూ సామర్థ్యాన్ని అందిస్తుంది. స్కై, స్టార్మ్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 17 గంటల వీడియో స్ట్రీమింగ్ బ్యాటరీ లైఫ్ అందుతుందని కంపెనీ తెలిపింది. డెల్ 14ఎస్, డెల్ 16ఎస్ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 లేదా ఏఎండీ రైజెన్ ఏఐ 400 సిరీస్ ప్రాసెసర్లతో అందుబాటులోకి వచ్చాయి. ఏఐ వర్క్‌లోడ్‌ల కోసం గరిష్టంగా 50 టాప్స్ ఎన్‌పీయూ పనితీరును అందిస్తాయి. ముఖ్యంగా ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్7 358హెచ్ ప్రాసెసర్‌తో వచ్చే డెల్ 16ఎస్ గత తరం మోడల్‌తో పోలిస్తే గ్రాఫిక్స్ పనితీరులో 55 శాతం మెరుగుదలను అందిస్తుందని డెల్ పేర్కొంది.

ధ‌ర వివ‌రాలు..

డెల్ ఎక్స్‌పీఎస్ 13 ప్రారంభ ధరను రూ.79,990గా నిర్ణయించారు. డెల్ 14ఎస్ ప్రారంభ ధర రూ.1,19,990 కాగా, డెల్ 16ఎస్ ప్రారంభ ధర రూ.2,29,990, ఏలియన్‌వేర్ 15 ప్రారంభ ధర రూ.1,28,990గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లు డెల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, లార్జ్ ఫార్మాట్ రిటైల్ స్టోర్లు, మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్లలో మోడల్‌ను బట్టి అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా డెల్ ఎక్స్‌పీఎస్ 13, డెల్ 14ఎస్, డెల్ 16ఎస్ కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ఆప్షన్లు, ఒక సంవత్సరం మెక‌ఫీ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నారు. ఏలియన్‌వేర్ 15పై ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో గరిష్టంగా 10 శాతం లేదా రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్, 12, 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే రూ.22,600 విలువైన ఏలియన్‌వేర్ 25 320 హెడ్జ్‌ గేమింగ్ మానిటర్‌ను ప్రత్యేక ఆఫర్ కింద రూ.9,999కే కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.

Advertisement
Advertisement