Dell | ఎక్స్‌పీఎస్ సిరీస్‌లో డెల్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏకంగా 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
Dell | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్ తన నూతన ఎక్స్‌పీఎస్ సిరీస్ ల్యాప్ టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్‌పీఎస్14, ఎక్స్‌పీఎస్16 డిస్‌ప్లే సైజుల్లో ఈ ల్యాప్‌టాప్ లను ప్రవేశపెట్టింది. పోర్టబిలిటీ, పనితీరు, అధునాతన హార్డ్ వేర్ వంటి సదుపాయాలను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా డెల్ వీటిని లాంచ్ చేసింది.
Technology | Published On Apr 27, 2026, 3.38 pm IST
Dell | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్ తన నూతన ఎక్స్‌పీఎస్ సిరీస్ ల్యాప్ టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్‌పీఎస్14, ఎక్స్‌పీఎస్16 డిస్‌ప్లే సైజుల్లో ఈ ల్యాప్‌టాప్ లను ప్రవేశపెట్టింది. పోర్టబిలిటీ, పనితీరు, అధునాతన హార్డ్ వేర్ వంటి సదుపాయాలను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా డెల్ వీటిని లాంచ్ చేసింది. అంతకు ముందు వచ్చిన ఇదే ఎక్స్‌పీఎస్ మోడల్ ల్యాప్ టాప్‌లతో పోలిస్తే ఇవి మరింత తక్కువ మందం కలిగి ఉండడమే కాకుండా, చాలా తేలిగ్గా ఉంటాయి. అందువల్ల వీటిని రోజువారీ ప్రయాణాలు చేసేవారు చాలా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తొలిసారిగా ల్యాప్‌టాప్ లిడ్ మధ్యలో ఎక్స్‌పీఎస్ లోగోను ఇచ్చారు.
దృఢమైన బిల్డ్ క్వాలిటీ, తక్కువ బరువు..
ఈ ల్యాప్‌టాప్‌లు అల్యూనిమియం అల్లాయ్ మిశ్రమ లోహం చాసిస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో రూపొందాయి. అందువల్ల బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. బయటకు కనిపించే జాయింట్లను చాలా వరకు తగ్గేలా వీటిని డిజైన్ చేశారు. రెండు మోడల్స్ మందం 14.6 మిల్లీమీటర్లు కాగా, ఎక్స్‌పీఎస్ 14 బరువు 1.36కిలోలుగా ఉంది. ఎక్స్‌పీఎస్ 16 మోడల్ 1.65 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో రిలీజ్ అయిన అత్యంత స్లీక్ ఎక్స్‌పీఎస్ ల్యాప్ టాప్‌లు ఇవేనని డెల్ తెలియజేసింది. ఇక ఈ ల్యాప్ టాప్‌లకు సంప్రదాయ ఫంక్షన్ వరుసను మళ్లీ తెచ్చారు. జీరో-లాటీస్ కీబోర్డును ఇచ్చినందున టైపింగ్ వేగంగా, సులభంగా ఉంటుంది. గ్లాస్ టచ్ ప్యాడ్ ఉన్నందున స్మూత్ నావిగేషన్ సాధ్యమవుతుంది.
గత మోడల్స్ కన్నా రెట్టింపు వేగంతో..
ఈ ల్యాప్ టాప్‌లలో ఇంటెల్ కోర్ అల్ట్రా 3 సిరీస్ ప్రాసెసర్‌లను ఇచ్చారు. యూజర్ తమకు కావల్సిన కాన్ఫిగరేషన్‌కు అనుగుణంగా ప్రాసెసర్ కలిగిన ల్యాప్ టాప్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్7 358హెచ్ ప్రాసెసర్‌లను సైతం ఇందులో పొందవచ్చు. అలాగే ఇంటెల్ ఆర్క్ ఇన్‌బిల్ట్ గ్రాఫిక్స్, 12ఎక్స్ఈ కోర్‌లు, 32జీబీ వరకు ర్యామ్ సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్‌లు గతంలో వచ్చిన ఎక్స్‌పీఎస్ మోడల్స్‌తో పోలిస్తే ఏఐ పనితీరులో 57 నుంచి 78 శాతం వరకు మెరుగ్గా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే గ్రాఫిక్స్ పనితీరు గత మోడల్స్ కన్నా 50 శాతం మేర పెరిగిందని తెలిపింది. ఈ ల్యాప్ టాప్‌లలో కొత్తగా థర్మల్ సిస్టమ్‌ను ఇచ్చారు. దీని వల్ల గత మోడల్స్ కన్నా ఇవి 61 శాతం పెద్ద ఇంటర్నల్ ఫ్యాన్స్‌తో పనిచేస్తాయి. ల్యాప్ టాప్ హీట్ కు గురికాకుండా రక్షిస్తుంది. ల్యాప్ టాప్ 8 డిగ్రీల వరకు చల్లబడడంతోపాటు 36 శాతం వరకు తక్కువ శబ్దం ఇస్తుంది.

భారీ బ్యాటరీ బ్యాకప్..
వీటిల్లో 900 వాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీలను ఇచ్చారు. ఇవి మెరుగైన బ్యాకప్‌ను అందిస్తాయి. వీడియోల స్ట్రీమింగ్‌కు 27 గంటలు, లోకల్ వీడియో ప్లే బ్యాక్‌కు 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని కంపెనీ తెలియజేసింది. వీటిల్లో ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లేతోపాటు 2కె, 2.8కె, 3.2కె రిజల్యూషన్‌లలో ఓలెడ్ డిస్‌ప్లే ఆప్షన్‌లను, టచ్ సదుపాయాన్ని కూడా ఇస్తున్నారు. ఇవి 30 శాతం వరకు విద్యుత్‌ను తక్కువగా వాడుకుంటాయని కంపెనీ తెలిపింది. ఇక వీటిల్లో 10 వాట్ల క్వాడ్ స్పీకర్ సిస్టమ్ ఉండగా, దీనికి స్పేషియల్ సౌండ్ టెక్నాలజీ ఉంది. అందువల్ల ఆడియో క్వాలిటీగా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సల్ వెబ్ కెమెరాను ఇచ్చారు. ఇది 4కె రిజల్యూషన్‌ను అందిస్తుంది. దీంతో వీడియో కాల్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది.
ధర వివరాలు..
ఇక ఈ ల్యాప్‌టాప్‌లను డెల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు డెల్ స్టోర్స్, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. డెల్ ఎక్స్‌పీఎస్ 14 ఇంచుల మోడల్ ప్రారంభ ధర రూ.2,05,990 ఉండగా, ఎక్స్‌పీఎస్ 16 ప్రారంభ ధర రూ.2,78,550గా ఉంది. పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ల్యాప్ టాప్‌ల కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. గరిష్టంగా రూ.15వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, అదనపు వారంటీ, ఉచిత యాక్ససరీలు వంటి ఆఫర్లను ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
సెప్టెంబర్ 30, 2026

Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన గూగుల్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయాయి..
సెప్టెంబర్ 22, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్
- ●Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్
- ●Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
- ●DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్

Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్

Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు

DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్



