త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసిన గూగుల్‌.. ఏఐ ఫీచ‌ర్ల‌తో అదిరిపోయాయి..

Googleboook | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న క్రోమ్‌బుక్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారంగా అభివృద్ధి చేసిన క్రోమ్ ఓఎస్‌తో ఈ ల్యాప్‌టాప్‌లు ప‌నిచేస్తాయి. అయితే ఈసారి గూగుల్ ఈ ల్యాప్‌టాప్‌ల‌కు క్రోమ్‌బుక్ అని కాకుండా పేరు మార్చి లాంచ్ చేసింది. వీటిని గూగుల్ బుక్ పేరుతో మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది.

S

Technology | Published On Sep 22, 2026, 10.16 am IST

Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసిన గూగుల్‌.. ఏఐ ఫీచ‌ర్ల‌తో అదిరిపోయాయి..
Advertisement

Googleboook | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న క్రోమ్‌బుక్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ల‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారంగా అభివృద్ధి చేసిన క్రోమ్ ఓఎస్‌తో ఈ ల్యాప్‌టాప్‌లు ప‌నిచేస్తాయి. అయితే ఈసారి గూగుల్ ఈ ల్యాప్‌టాప్‌ల‌కు క్రోమ్‌బుక్ అని కాకుండా పేరు మార్చి లాంచ్ చేసింది. వీటిని గూగుల్ బుక్ పేరుతో మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ల్యాప్‌టాప్‌ల‌లో గూగుల్ త‌న జెమిని ఏఐ ఫీచ‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా అందిస్తోంది. అందువ‌ల్ల ఏఐ ఫీచ‌ర్లు ప్ర‌త్యేకంగా కావాల‌నుకునే యూజ‌ర్ల‌కు ఈ ల్యాప్‌టాప్‌లు ఎంతో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తాయ‌ని కంపెనీ చెబుతోంది. కాగా ఈ ల్యాప్‌టాప్‌ల‌ను అభివృద్ధి చేసేందుకు గాను ఏస‌ర్‌, అసుస్‌, డెల్‌, హెచ్‌పీ, లెనోవో వంటి కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌ల‌తో భాగ‌స్వామ్యం అయిన‌ట్లు గూగుల్ తెలిపింది.

5 మోడ‌ల్స్ లాంచ్‌..

గూగుల్ తొలిసారిగా లాంచ్ చేసిన గూగుల్ బుక్ ల్యాప్‌టాప్‌ల‌ను అల్యూమినియం, మెగ్నిషియం మిశ్ర‌మ‌లోహంతో రూపొందించారు. అందువ‌ల్ల ల్యాప్‌టాప్‌లు అద్భుత‌మైన లుక్‌ను క‌లిగి ఉంటాయి. మొత్తం 5 మోడ‌ల్స్‌ను గూగుల్ లాంచ్ చేసింది. వీటిల్లో 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌, బ్యాక్‌లిట్ కీబోర్డులు వంటి ఫీచ‌ర్లను కామ‌న్‌గా అందించారు. ఇక గూగుల్‌కు చెందిన టైటాన్ సెక్యూరిటీ హార్డ్‌వేర్ ర‌క్ష‌ణ‌, ఫింగ‌ర్‌ప్రింట్ రీడ‌ర్ ఉన్నందున హ్యాక‌ర్ల నుంచి సుర‌క్షితంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ప‌లు మోడ‌ల్స్‌లో ఫేస్ అన్‌లాక్ స‌పోర్ట్‌ను కూడా ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌ల‌కు బ‌య‌టి వైపు లిడ్ మీద గ్లోబార్‌ను ఇచ్చారు. ఇది ల్యాప్‌టాప్ ఆన్ అయ్యే స‌మ‌యంలో, బ్యాట‌రీ చార్జింగ్ స్థాయిల‌ను సూచిస్తూ ప్ర‌కాశిస్తుంది. యూజ‌ర్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉండే జెమిని ఏఐతో సంభాష‌ణ‌లు చేసిన‌ప్పుడు కూడా ఈ లైట్ వెలుగుతుంది.

ఫోన్‌, ల్యాప్‌టాప్ లింక్‌..

ఈ ల్యాప్‌టాప్‌ల‌ను ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు యూజ‌ర్లు సుల‌భంగా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను ఆండ్రాయిడ్ ఫౌండేష‌న్‌ను ఉప‌యోగించారు. సెట‌ప్ స‌మ‌యంలోనే సైన్ ఇన్ చేయ‌డం ద్వారా ఫోన్ సెట్టింగ్‌లు, సేవ్ చేసిన పాస్‌వ‌ర్డ్‌లు, వైఫై నెట్‌వ‌ర్క్‌లు, మెసేజ్‌లు ల్యాప్‌టాప్‌కు బ‌దిలీ అవుతాయి. త‌రువాత డివైస్‌లు నిరంత‌రాయంగా సింక్‌లో ఉంటాయి. దీంతో ఫోన్‌లో ఉన్న ఆయా వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ల్యాప్‌టాప్‌ల‌లోనూ తెలుసుకోవ‌చ్చు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు మ‌ధ్య డేటా సుర‌క్షితంగా ఎన్‌క్రిప్ట్ అయి ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. అందువ‌ల్ల డేటా లీక్ బెడ‌ద ఉండ‌దు. అలాగే ఫోన్‌లో ఉండే కంటెంట్‌ను ల్యాప్‌టాప్‌లోనూ ఏ స‌మ‌యంలోనైనా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఇది యాపిల్ ఎకో సిస్ట‌మ్ మాదిరిగా ప‌నిచేస్తుంది.

ధ‌ర‌లు ఎంత‌..

గూగుల్ లాంచ్ చేసిన తొలి గూగుల్ బుక్ ల్యాప్‌టాప్‌లు ప్ర‌స్తుతానికి కేవ‌లం అమెరికాలోనే అందుబాటులో ఉన్నాయి. వీటిని ముందుగా అమెరికాలో విక్ర‌యానికి అందుబాటులో ఉంచ‌నున్నారు. అక్టోబ‌ర్ 4 నుంచి అమెరికాతోపాటు కెన‌డా, యూకే, ఐర్లాంగ్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీల‌లె అందుబాటులో ఉంటాయి. అక్టోబ‌ర్ 5 నుంచి ఆస్ట్రేలియాలో విక్ర‌యిస్తారు. అయితే భార‌త్‌లో ఈ ల్యాప్‌టాప్‌ల లాంచింగ్‌పై గూగుల్ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ ల్యాప్‌టాప్‌ల‌ను గూగుల్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు స్థానికంగా ఉండే ఆథ‌రైజ్డ్ సెల్ల‌ర్స్ వ‌ద్ద కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఏస‌ర్‌కు చెందిన గూగుల్‌బుక్ 14 ప్రారంభ ధ‌ర 999 డాల‌ర్లు (సుమారు రూ.95వేలు) ఉండ‌గా, అసుస్ గూగుల్‌బుక్ 14 ప్రారంభ ధ‌ర 1299 డాల‌ర్లు, డెల్ ఎక్స్‌పీఎస్ గూగుల్ బుక్ ధ‌ర 1199 డాల‌ర్లుగా ఉంది. హెచ్‌పీ, లెనోవోల‌కు చెందిన గూగుల్ బుక్ 14, 15 మోడ‌ల్స్ ప్రారంభ ధ‌ర‌లు వ‌రుస‌గా 1299, 1099 డాల‌ర్లుగా ఉన్నాయి. వీటి ధ‌ర‌లు భార‌త క‌రెన్సీలో వ‌రుస‌గా సుమారు రూ.1.24 ల‌క్ష‌లు, రూ.1.14 ల‌క్ష‌లు, రూ.1.24 ల‌క్ష‌లు, రూ.1.05 ల‌క్ష‌లుగా ఉన్నాయి. ఈ మోడ‌ల్స్‌ను కొనుగోలు చేసిన యూజ‌ర్ల‌కు 12 నెల‌ల పాటు ఉచిత గూగుల్ ఏఐ ప్రొ ప్లాన్ ల‌భిస్తుంది. 5టీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌, జెమిని అడ్వాన్స్‌డ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. 3 నెల‌ల వాలిడిటీతో యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ ప్లాన్‌, అడోబ్ ఫొటోషాప్ ఇస్తున్నారు.

Advertisement
Advertisement