Dell 15 | ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లతో లాంచ్ అయిన డెల్15 కొత్త ల్యాప్ టాప్.. ధర తక్కువే..
Dell 15 | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్ తన నూతన ల్యాప్‌టాప్ మోడల్ డెల్ 15 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ్యాలెన్స్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి, ఏఐ సామర్థ్యం కావాలని అనుకుంటే, రోజువారి పనులకు ఈ ల్యాప్ టాప్ భేషుగ్గా పనిచేస్తుందని కంపెనీ తెలియజేసింది.
Technology | Published On Apr 20, 2026, 5.11 pm IST
Dell 15 | ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీ సంస్థ డెల్ టెక్నాలజీస్ తన నూతన ల్యాప్‌టాప్ మోడల్ డెల్ 15 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ్యాలెన్స్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి, ఏఐ సామర్థ్యం కావాలని అనుకుంటే, రోజువారి పనులకు ఈ ల్యాప్ టాప్ భేషుగ్గా పనిచేస్తుందని కంపెనీ తెలియజేసింది. మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ను అందించేలా ఈ ల్యాప్‌టాప్ ను తీర్చిదిద్దినట్లు తెలిపింది. అందువల్ల యూజర్లు దీన్ని పని, విద్య, కమ్యూనికేషన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ వంటి భిన్న రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా5 225హెచ్, కోర్ అల్ట్రా7 225హెచ్ ప్రాసెసర్ వేరియెంట్లను ఇచ్చారు. ఇవి తక్కువ పవర్‌ను వాడుకుంటూ మెరుగైన ప్రదర్శనను ఇస్తాయి. అలాగే ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌ను, డెడికేటెడ్ ఎన్‌పీయూను ఏఐ టాస్క్‌ల కోసం ఇచ్చారు. దీని వల్ల యూజర్లు ఏఐ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.
విండోస్ 11 హోం ఓఎస్, 15.6 ఇంచుల డిస్‌ప్లే..
డెల్ 15 ల్యాప్ టాప్‌లో విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఏఐ ని త్వరగా యాక్సెస్ చేసేందుకు ఈ ల్యాప్‌టాప్‌కు ప్రత్యేక కో-పైలట్ కీని ఇచ్చారు. అలాగే వీడియో కాల్స్ చేసుకునేందుకు కూడా వెసులు బాటు కల్పించారు. ఇందులో 15.6 ఇంచుల డిస్‌ప్లేను ఇవ్వగా, ఇది ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల దృశ్యాలు చాలా క్వాలిటీగా కనిపిస్తాయి. ఔట్ డోర్‌లో డిస్‌ప్లే విజిబిలిటీ కోసం 300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. డిస్‌ప్లేకు యాంటీ గ్లేర్ కోటింగ్‌ను ఇచ్చినందున కళ్లకు రక్షణ లభిస్తుంది. ఎక్కువ సేపు డిస్‌ప్లేను చూసినా కళ్లపై పెద్దగా నెగెటివ్ ఎఫెక్ట్ పడదు. అలాగే హెచ్‌డీ వెబ్ క్యామ్, ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్స్, ఏఐ పవర్డ్ నాయిస్ రిడక్షన్ వంటి ఫీచర్లను ఇందులో ఇచ్చారు.
ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, అడాప్టివ్ థర్మల్ టెక్నాలజీ..
డెల్ 15 ల్యాప్‌టాప్‌లో ఫుల్ సైజ్ కీబోర్డు ఉంటుంది. ఇందులో 10-కీ న్యూమరిక్ ప్యాడ్ కూడా లభిస్తుంది. అలాగే టైపింగ్ సులభంగా ఉండేందుకు కీబోర్డు కీ లను ఎర్గోనోమిక్ డిజైన్‌లో ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ ఎక్స్‌ప్రెస్ చార్జ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీని వల్ల వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవలం 60 నిమిషాల్లోనే సున్నా నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అలాగే ల్యాప్‌టాప్‌లో అడాప్టివ్ థర్మల్ టెక్నాలజీని ఇచ్చినందున దీన్ని ఎక్కువ సేపు ఉపయోగించినా కూడా పెర్ఫార్మెన్స్ ఏమీ డ్రాప్ కాదు. చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది. ఈ ల్యాప్ టాప్‌ను కార్బన్ బ్లాక్, ప్లాటినం సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. పాలీకార్బొనేట్ చాసిస్‌ను కలిగి ఉంది. 65వాట్ల కెపాసిటీ కలిగిన యూఎస్బీ టైప్ సి అడాప్టర్ దీనికి లభిస్తుంది. దీంతో ల్యాప్ టాప్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.

ర్యామ్, స్టోరేజ్, కనెక్టివిటీ ఆప్షన్లు..
8జీబీ, 16జీబీ ర్యామ్, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు. 41 వాట్ అవర్ 3 సెల్ బ్యాటరీ ఇందులో ఉంది. డ్యుయల్ స్పీకర్లను ఇచ్చారు. 720పి హెచ్‌డీ వెబ్‌క్యామ్ ఉంది. సింగిల్ డిజిటల్ మైక్రోఫోన్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-ఎ, యూఎస్‌బీ 3.2 జెన్ 2 టైప్-సి, యూఎస్‌బీ 2.0 టైప్-ఎ, హెచ్‌డీఎంఐ 1.4, ఆడియో జాక్ పోర్టులు ఉన్నాయి. ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. కేవలం 1.66 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ ల్యాప్‌టాప్ రోజువారి ప్రయాణాల్లో కూడా చక్కగా పనిచేస్తుందని డెల్ తెలిపింది. ఇక ఇందులో డెల్ ఆప్టిమైజర్, డెల్ డిజిటల్ రికవరీ, మెక్అఫీ యాంటీ వైరస్ వంటి సాఫ్ట్‌వేర్లు, టూల్స్‌ను ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా అందిస్తున్నారు.
ధర వివరాలు..
డెల్ 15 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.69,999 ఉండగా, దీన్ని డెల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, రిటెయిల్ స్టోర్స్, మల్టీ బ్రాండ్ స్టోర్స్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా పలు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందించారు. కేవలం రూ.99కే 1 ఏడాది కాల పరిమితి కలిగిన యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది. రూ.299 చెల్లిస్తే అదనంగా మరో ఏడాది పాటు వారంటీని పొందవచ్చు. జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత వార్తలు

Dell Pro Precision | డెల్ నుంచి కొత్త ప్రొ ప్రెసిషన్ వర్క్‌స్టేషన్ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయి.. ధర ఎంతంటే..
జులై 10, 2026

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
జులై 4, 2026

Laptop | మ్యాక్‌బుక్ వర్సెస్ థింక్‌ప్యాడ్.. ఏ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి..?
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
- ●Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి
- ●Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
- ●CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ●SBI Funds Management IPO | ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ.. షేర్ ధర రూ.574, రిటైల్ పెట్టుబడిదారులు ఎంత పెట్టాలి?

Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి

Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..



