ASUS | ఆసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఏఐ ఫీచర్లకు ప్రత్యేకం..
ASUS | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఆసుస్ భారత్‌లో తన నూతన ఏఐ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వివోబుక్ 14 (ఎక్స్1404ఎంఏ), వివోబుక్ 15 (ఎక్స్1504ఎంఏ) మోడల్స్ పేరిట వీటిని లాంచ్ చేసింది. వీటిల్లో లేటెస్ట్ ఇంటెల్ కోర్ 7 సిరీస్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే ఏఐ పనుల కోసం ప్రత్యేకంగా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ)ను సైతం ఇచ్చారు.
Technology | Published On Jul 11, 2026, 10.09 am IST
ASUS | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఆసుస్ భారత్‌లో తన నూతన ఏఐ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వివోబుక్ 14 (ఎక్స్1404ఎంఏ), వివోబుక్ 15 (ఎక్స్1504ఎంఏ) మోడల్స్ పేరిట వీటిని లాంచ్ చేసింది. వీటిల్లో లేటెస్ట్ ఇంటెల్ కోర్ 7 సిరీస్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే ఏఐ పనుల కోసం ప్రత్యేకంగా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ)ను సైతం ఇచ్చారు. అందువల్ల ఏఐ పనులను ఈ ల్యాప్ టాప్‌లలో వేగంగా నిర్వహించుకోవచ్చు. ఇవి గరిష్టంగా 17 టాప్స్ స్పీడ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. వీటిలో 16జీబీ వరకు ర్యామ్‌ను గరిష్టంగా అందిస్తున్నారు. 512జీబీ స్టోరేజ్ లభిస్తుంది. అత్యంత తక్కువ బరువుతో, స్లీక్ డిజైన్‌తో ఈ ల్యాప్ టాప్‌ను రూపొందించారు. వీటికి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అందువల్ల బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. అలాగే 180 డిగ్రీల వరకు పూర్తిగా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యే హింజ్‌లను కూడా కలిగి ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్‌లను టెర్రాకోటా, క్వైట్ బ్లూ, కూల్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు.
ఫింగర్ ప్రింట్ లాగిన్..
వివోబుక్ 14లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉండగా, వివోబుక్ 15లో 15 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇవి ఔట్ డోర్‌లో 250 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తాయి. అలాగే పలు వేరియెంట్లలో టచ్ స్క్రీన్ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. ఆడియో కోసం ఆసుస్ సోనిక్ మాస్టర్ స్పీకర్స్ ఉన్నాయి. అందువల్ల శబ్ద నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ముందు వైపు హెచ్‌డీ వెబ్ కెమెరాను ఇచ్చారు. దీనికి ప్రైవసీ షటర్ కూడా ఉంది. అలాగే పాస్‌వర్డ్ అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్ తో లాగిన్ అయ్యే ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా వీటిల్లో ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ 2.0 టైప్ సి, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్ ఎ, యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్ సి, హెచ్‌డీఎంఐ 1.4, 3.5ఎంఎం ఆడియో జాక్, డీసీ ఇన్ పోర్ట్ వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. వీటిల్లో 42 వాట్ అవర్ బ్యాటరీని ఇచ్చారు. ఇది మూడు సెల్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ల్యాప్‌టాప్‌లతోపాటు 45 వాట్ల ఏసీ అడాప్టర్‌ను కూడా ఇస్తున్నారు.
ధర వివరాలు..
వివోబుక్ 15 ల్యాప్‌టాప్ ప్రారంభ ధరను రూ.75,990గా నిర్ణయించారు. వివోబుక్ 14 ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ.1,07,990గా ఉంది. వీటిని ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లో, ఆసుస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో విక్రయిస్తున్నారు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోం 2024 ఎడిషన్ జీవితకాల వాలిడిటీతో ఉచితంగా వస్తోంది. ఇందులో వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ వంటి అప్లికేషన్‌లను వాడుకోవచ్చు. అలాగే ఏడాది కాలవ్యవధి కలిగిన 100 జీబీ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆఫ్ లైన్‌లో వీటిని కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం పొందవచ్చు. వివోబుక్ 15 నెలకు రూ.5,066కు, వివోబుక్ 14 నెలకు రూ.7,199కు ఈఎంఐలతో లభిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

On-Device AI | ఫోన్ కొనేముందు తప్పక తెలుసుకోండి.. ఆన్ డివైస్ ఏఐ అంటే ఏమిటి ?
జులై 31, 2026

Windows 11 | మీ విండోస్ ల్యాప్ టాప్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం లేదా.. ఈ సెట్టింగ్స్‌ను మార్చండి..
జులై 25, 2026

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
జులై 4, 2026
తాజావార్తలు
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్
- ●G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?



