Dhanteras Offers | ధన్‌తేరస్ ఆఫర్లలో ఏది బెటర్? 20 శాతం మేకింగ్ ఛార్జీల తగ్గింపా.. ఉచిత బంగారు నాణెమా?
Dhanteras Offers | ధన్‌తేరస్ సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు జ్యువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు, ఉచిత బంగారు నాణెం వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనేది ఆభరణాల ధర, మేకింగ్ ఛార్జీలు, ఉచితంగా ఇచ్చే బంగారు నాణెం విలువపై ఆధారపడి ఉంటుంది.
Dhanteras Offers | ధన్‌తేరస్ సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు జ్యువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు, ఉచిత బంగారు నాణెం వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనేది ఆభరణాల ధర, మేకింగ్ ఛార్జీలు, ఉచితంగా ఇచ్చే బంగారు నాణెం విలువపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణ చూస్తే..
భారతీయ కుటుంబాల్లో ధన్‌తేరస్ రోజున బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఈ పండుగ సమయంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు జ్యువెలర్లు మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు, ఉచిత వెండి వస్తువులు, బంగారు నాణేలు, ఇతర బహుమతులను అందిస్తున్నారు. సాధారణంగా బంగారు ఆభరణాల తయారీకి విధించే మేకింగ్ ఛార్జీలు డిజైన్‌ను బట్టి 5 నుంచి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే, 15 శాతం మేకింగ్ ఛార్జీల కింద రూ.15వేలు చెల్లించాలి. వీటిపై 20 శాతం తగ్గింపు లభిస్తే రూ.3వేలు ఆదా అవుతుంది. దీంతో మేకింగ్ ఛార్జీలు రూ.12వేలకు తగ్గుతాయి. ఈ లెక్కలు జీఎస్టీకి ముందు వర్తిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ బరువున్న, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.
బంగారం నాణెం లభిస్తే..
మరోవైపు, ధన్‌తేరస్ సందర్భంగా పలువురు జ్యువెలర్లు ఉచితంగా బంగారు నాణేలను కూడా అందిస్తున్నారు. కొనుగోలు చేసే మొత్తం ఆధారంగా నాణెం బరువు మారుతుంది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సాధారణంగా 0.5 గ్రాము నుంచి 1 గ్రాము బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారు నాణెం ధర సుమారు రూ.13,500గా పరిగణిస్తే, 0.5 గ్రాము నుంచి 1 గ్రాము వరకు ఉచిత నాణెం లభిస్తే దాని విలువ సుమారు రూ.5వేల నుంచి రూ.13వేల వరకు ఉంటుంది. సాధారణంగా బంగారు నాణెం కొనుగోలు చేసినప్పుడు దాని విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అయితే ఉచిత బహుమతిగా లభించే నాణెంపై ఈ ఖర్చును తప్పించుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగితే ఆ నాణెం విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఏది ఉత్తమం..
అయితే ఈ రెండు ఆఫర్లలో ఏది మెరుగైనదో నిర్ణయించుకునే ముందు వినియోగదారులు తమకు లభించే మొత్తం ప్రయోజనాన్ని లెక్కించుకోవాలి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు వల్ల కొనుగోలు సమయంలోనే తక్షణ నగదు ఆదా లభిస్తుంది. ఉచిత బంగారు నాణెం వల్ల మాత్రం దీర్ఘకాలంలో బంగారం ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆభరణాల ధర, మేకింగ్ ఛార్జీలు, ఉచిత నాణెం బరువు, దాని అసలు మార్కెట్ విలువను పోల్చి చూసిన తర్వాతే ఏ ఆఫర్‌ను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం మంచిది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొంటున్నారా? ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
నవంబర్ 3, 2026

Gold Prices | బంగారం కొనుగోళ్లను తగ్గించిన వ్యాపారులు.. ధరలు పతనమవుతాయా..?
అక్టోబర్ 28, 2026

Robbery | మేడిపల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభరణాలు అపహరణ
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు
- ●KTR | భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డి
- ●Stockal | స్టాక్ఏల్లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..
- ●Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు
- ●Virat Kohli | కోహ్లీ సరికొత్త చరిత్ర.. 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా..
- ●US Stocks | అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులా? భారతీయులు తెలుసుకోవాల్సిన 5 రిస్కులు!

Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు

KTR | భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డి

Stockal | స్టాక్ఏల్లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..

Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు



