Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర.. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి
Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మిచిగాన్ సెనేట్ స్థానం నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ముస్లిం అయిన అబ్దుల్ ఎల్-సయేద్ (Abdul El-Sayed) ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లింగా సరికొత్త చరిత్ర లిఖించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం పోటీపడిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి (Saritha Komatireddy) ఓటమిపాలయ్యారు.
International | Published On Nov 4, 2026, 3.14 pm IST
Abdul El-Sayed | త్రినేత్ర న్యూస్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్లకు షాకిస్తూ.. డెమోక్రాట్లు దూసుకెళ్తున్నారు. సెనేట్‌లో మెజారిటీ చేజిక్కించుకోగా.. అటు ప్రతినిధుల సభలోనూ అవసరమైన మెజారిటీ మార్క్ 218ని దాటేశారు. ఈ ఎన్నికల సందర్భంగా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టెక్సాస్ యూఎస్ సెనేట్‌ను డెమోక్రాట్లు దాదాపు 32 ఏళ్ల తర్వాత కైవసం చేసుకోగా.. అటు కాన్సాస్‌లో రిపబ్లికన్ల కంచుకోట బద్దలు కొట్టారు. అక్కడ దాదాపు 92 ఏళ్ల తర్వాత డెమోక్రాట్ అభ్యర్థి విజయం సాధించారు.
సెనెట్, గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో వివిధ వర్గాల అభ్యర్థులు గెలుపొంది సరికొత్త రికార్డులు సృష్టించారు. అమెరికాలోనే కీలకమైన స్వింగ్ స్టేట్ అయిన మిచిగాన్ సెనేట్ స్థానాన్ని డెమోక్రాటిక్ పార్టీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ముస్లిం అయిన అబ్దుల్ ఎల్-సయేద్ (Abdul El-Sayed) ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లింగా చరిత్ర లిఖించారు. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఈ హోరాహోరీ పోరులో అబ్దుల్ ఎల్-సయీద్‌కు 50.74% ఓట్లు (18,72,595 ఓట్లు) రాగా, మైక్ రోజర్స్‌కు 47.29% ఓట్లు (17,45,183 ఓట్లు) వచ్చాయి. అబ్దుల్ తన ప్రత్యర్థిపై 1,27,412 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. అబ్దుల్ గెలుపు డెమోక్రటిక్ పార్టీలోని వామపక్ష (ప్రోగ్రెసివ్) వర్గానికి ఒక చారిత్రక విజయంగా నిలిచింది. ఈ విజయం పట్ల అబ్దుల్ సంతోషం వ్యక్తం చేశారు. "మిచిగాన్.. మనం సాధించాం!" అంటూ తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. మిచిగన్ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
భారత్‌తో అనుబంధం
అబ్దుల్‌కు భారత్‌తో కనెక్షన్ ఉంది. ఆయన భార్య డాక్టర్ సారా జుకాకు కర్ణాటకలోని తీర ప్రాంతానికి చెందిన వారు. ఆమె మానసిక వైద్య నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. మంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్కల్‌లో సారా కుటుంబ మూలాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి బీడీ జెట్టి వద్ద ఆర్థిక శాఖ ఉపమంత్రిగా పనిచేసిన జుకాకు షాంషుద్దిన్ మనవరాలే సారా. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో చదువుతున్న సమయంలో ఎల్ సయ్యద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
తెలంగాణ మహిళ ఓటమి..

ఇక ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న డెమోక్రాట్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. సుహాస్ సుబ్రమణ్యం (Suhas Subramanyam), పియా దాండియా (Pia Dandiya) వంటి ప్రముఖులు ఘన విజయం సాధించారు. అయితే, ట్రంప్ మద్దతున్న రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటూ ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ అటార్నీ జనరల్ (New York Attorney General) పదవి కోసం పోటీపడిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి (Saritha Komatireddy) కూడా ఓటమిపాలయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి లెటిటియా జేమ్స్ (Letitia James) చేతిలో సరితా కోమటిరెడ్డి పరాజయం చెందారు. ఈ విజయంతో లెటిటియా జేమ్స్ వరుసగా మూడోసారి న్యూయార్క్ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ అయిన సరితా కోమటిరెడ్డి శాంతిభద్రతలు, మరియు క్రైమ్ నియంత్రణ వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం చేస్తూ డెమొక్రాట్లకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ సైతం ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది.
Also Read..
సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు
ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్
నవంబర్ 4, 2026

US midterm elections | ట్రంప్‌నకు మిడ్ టర్మ్ షాక్.. సెనేట్, ప్రతినిధుల సభ విపక్షాల వశం..
నవంబర్ 4, 2026

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చరిత్ర సృష్టించిన పియా దాండియా
నవంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..
- ●Ravi Basrur | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్
- ●Iran | భారత్‌కు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిలో నౌకలకు గ్రీన్ సిగ్నల్..
- ●Minister Pongulet Srinivas Reddy | ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు
- ●Sandeep Reddy Vanga | సినిమాలపై నిందలు సరికాదు
- ●Telangana Student Suicide Jabalpur | మధ్యప్రదేశ్‌లో తెలంగాణ యువతి ఆత్మహత్య.. కారణం అదేనా?

Stock Markets | వరుస లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. రెండు నెలల గరిష్టానికి సూచీలు..

Ravi Basrur | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్

Iran | భారత్‌కు భారీ ఊరట.. హార్ముజ్ జలసంధిలో నౌకలకు గ్రీన్ సిగ్నల్..

Minister Pongulet Srinivas Reddy | ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు



