త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | స‌మాధానాలు లేకే.. దిమాగీ న‌క్స‌ల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖ‌ర్గే విమ‌ర్శ‌లు

Mallikarjun Kharge | ఓట్ల చోరీపై (Vote Theft) సమాధానం చెప్పలేకనే ప్రధాని మోదీ ఫ్లాప్ అయిపోయిన 'దిమాగీ నక్సల్' (Dimaagi Naxal) నినాదాన్ని ప‌దేప‌దే లేవ‌నెత్తుతున్నార‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆరోపించారు. ఓట్ల చోరీపై ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

D

National | Published On Nov 4, 2026, 2.37 pm IST

Mallikarjun Kharge | స‌మాధానాలు లేకే.. దిమాగీ న‌క్స‌ల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖ‌ర్గే విమ‌ర్శ‌లు
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాల (Amit Shah)పై కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓట్ల చోరీపై (Vote Theft) సమాధానం చెప్పలేకనే ప్రధాని మోదీ ఫ్లాప్ అయిపోయిన 'దిమాగీ నక్సల్' (Dimaagi Naxal) నినాదాన్ని ప‌దేప‌దే లేవ‌నెత్తుతున్నార‌ని ఆరోపించారు. భారత ప్రయోజనాలను విదేశీ శక్తులకు మోదీ ఎలా తాకట్టు పెట్టారనే అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విసిరిన బహిరంగ చర్చ (Open Debate) సవాల్‌ను స్వీకరించాలని ఈ సంద‌ర్భంగా ఖర్గే డిమాండ్ చేశారు.

ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు. ఓటరు జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర‌ సవరణ (SIR) ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ECI) ఐదు యూ టర్న్‌లు తీసుకుందని ఖ‌ర్గే ఆరోపించారు. ఫారం-6లో చేసిన మార్పుల‌ను తోటి ఎన్నికల కమిషనర్లే చట్టవిరుద్ధమని పేర్కొన్న విష‌యాన్ని గుర్తు చేశారు. దేశంలో 3 కోట్ల మంది ఓట‌ర్లు చొర‌బాటుదారుల‌ని అమిత్ షా చెబుతున్నార‌ని... ఇన్నేళ్లుగా హోం మంత్రిగా ఉంటూ అక్ర‌మ వలసలను దేశంలోని ఎలా అనుమ‌తించారు..? అంటూ ప్ర‌శ్నించారు. ఈ అస‌మ‌ర్థ‌త‌కు ఆయ‌న త‌న‌ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఖ‌ర్గే డిమాండ్ చేశారు.

అదేవిధంగా వ‌ర్షాకాల స‌మావేశాలు వాయిదాప‌డి 83 రోజులు గ‌డిచింద‌ని గుర్తు చేశారు. ఇంకా ఇప్ప‌టికీ అధికారికంగా ముగించ‌లేద‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు శీతాకాల స‌మావేశాలు కూడా సమీపిస్తున్న‌ తరుణంలో.. వాళ్లు ఇంకా ప్రత్యేక సమావేశాలు కోరుకుంటున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌ (CEC Gyanesh Kumar)పై విప‌క్షాలు చేప‌ట్టిన ప్రజా అభిశంసన, ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వ‌హించిన భారీ ఓట్ బ‌చావో ర్యాలీ చూసి మోదీ-షా ద్వ‌యం వ‌ణికిపోతోంద‌ని ఖ‌ర్గే వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పార్లమెంటుకు రావడం లేదని చెప్పిన ఖ‌ర్గే.. ఒక్క ప్రెస్ మీట్‌ను కూడా నిర్వ‌హించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నలను ఎదుర్కోవాలని ఖర్గే సవాల్ విసిరారు. ఓట్ల చోరీపై ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read..

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై FIR నమోదు

ప్ర‌యాణికుల రైలు వెళ్లిన కొద్దిసేప‌టికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

అదిరిపోయే దీపావ‌ళి గిఫ్ట్.. ఉద్యోగుల‌ను ఐఫోన్లతో స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సంస్థ‌

ట్యాగ్స్:

Amit ShahCEC Gyanesh KumarDimaagi NaxalMallikarjun KhargeOpen Debate On Vote TheftPm ModiRahul GandhiSIRVote Chori
Advertisement
Advertisement