Duddilla Sridhar Babu | ఏఐ, క్వాంటం, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు.. ఇవే ఫ్యూచర్
డీప్‌టెక్, పరిశ్రమలతో తెలంగాణ రూపురేఖలు మారనున్నాయి. 8.1 శాతం వృద్ధి రేటుతో సరికొత్త మైలురాయి దాటిన రాష్ట్రం.. పూర్తి వివరాలు ఇవే.
- తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్‌టెక్, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
- 8.1 శాతం వృద్ధి రేటుతో రాష్ట్ర జీఎస్‌వీఏ (GSVA) రూ.3.04 లక్షల కోట్లకు చేరిక
- ఎగుమతుల్లో 39.3 శాతం భారీ పెరుగుదల నమోదు
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే దిశగా ప్రణాళికలు
- మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Duddilla Sridhar Babu | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించబోయే డీప్‌టెక్, అత్యాధునిక ఆవిష్కరణలకు తెలంగాణను అడ్డాగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం బేగంపేట ఐటీసీ కాకతీయలో జరిగిన ఫిక్కీ (FICCI) వందేళ్ల వేడుకలు, తెలంగాణ డీప్-టెక్ లీడర్ షిప్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఈ కీలక ప్రసంగం చేశారు.
కీలక రంగాల్లో భారీ మౌలిక వసతులు
రాబోయే రోజుల్లో గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వీటిలో రీసెర్చ్, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను శరవేగంగా డెవలప్ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

పారిశ్రామిక వృద్ధిలో కొత్త రికార్డులు
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి గణాంకాలను వివరిస్తూ మంత్రి పలు కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్ర జీఎస్‌వీఏ (GSVA)లో పారిశ్రామిక వాటా 8.1 శాతం గ్రోత్ రేట్‌తో రూ.3.04 లక్షల కోట్లకు చేరుకుంది. స్టేట్ మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఏకంగా 39.3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

లక్ష్యం: 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ చర్యలతోనే ఇది సాధ్యం కాదని.. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆవిష్కర్తల భాగస్వామ్యం అత్యంత కీలకమని పిలుపునిచ్చారు.

ఈ సమ్మిట్‌లో ఫిక్కీ తెలంగాణ ఛాప్టర్ ఛైర్మన్ వి.వి. రామరాజు, కో-ఛైర్మన్ జయదేవ్ మీలా, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ కె.కె. మహేశ్వరి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
- ●Dell 14S | చవక ధరలకే డెల్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు బెస్ట్..
- ●Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర.. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి
- ●Dhanteras Offers | ధన్తేరస్ ఆఫర్లలో ఏది బెటర్? 20 శాతం మేకింగ్ ఛార్జీల తగ్గింపా.. ఉచిత బంగారు నాణెమా?
- ●Harish Rao | పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ
- ●Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు

Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

Dell 14S | చవక ధరలకే డెల్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు బెస్ట్..

Abdul El-Sayed | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చరిత్ర.. సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి

Dhanteras Offers | ధన్తేరస్ ఆఫర్లలో ఏది బెటర్? 20 శాతం మేకింగ్ ఛార్జీల తగ్గింపా.. ఉచిత బంగారు నాణెమా?




